CHC
-
మసకబారిన కంటి వెలుగు
చంద్రబాబు కూటమి ప్రభుత్వ అనాలోచిత నిర్ణయం స్కూలు పిల్లలకు, పేద వృద్ధులకు అందించే ‘కంటి వెలుగు’ కార్యక్రమాన్ని దెబ్బతీసింది. గత ఐదేళ్లలో రాష్ట్రంలోని ప్రతి విద్యారి్థకీ, పేదలకు కంటి పరీక్షలు నిర్వహించి, అవసరమైన సూచనలు, కళ్లద్దాలు, చికిత్స అందించిన వైఎస్సార్ కంటి వెలుగు కార్యక్రమం ఇప్పుడు కుంటుపడింది.కూటమి ప్రభుత్వం రాగానే ఇటీవలి వరకు ఈ కార్యక్రమం కింద సేవలందించిన ఆప్తాల్మిక్ అసిస్టెంట్లను తొలగించడంతోపాటు కమ్యూనిటీ హెల్త్ సెంటర్లలో (సీహెచ్‌సీల్లో) ఉండే ‘ సీఎం ఈ–ఐ’ కేంద్రాలను కూడా మూసివేసింది. దీంతో ఆ ఉద్యోగుల కుటుంబాలు రోడ్డునపడ్డాయి. కంటి వైద్యానికి విద్యార్థులు, పేద ప్రజలు తీవ్ర అవస్తలు పడుతున్నారు. - సాక్షి, అమరావతిప్రత్యేకంగా డీఎస్సీ ద్వారా..వైఎస్ జగన్ ప్రభుత్వం కంటి వెలుగు కార్యక్రమం కోసమే ప్రత్యేకంగా డీఎస్సీ ద్వారా 108 మంది ఆప్తాల్మిక్ అసిస్టెంట్లను నియమించింది. ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఉండే ఆప్తాల్మిక్ అసిస్టెంట్లతో పాటు వీరు కూడా విద్యార్థులకు కంటి పరీక్షలు చేసేవారు. వీరి సేవలను జూలై 30వ తేదీ నుంచి చంద్రబాబు ప్రభుత్వం నిలిపివేసింది. తమను కొనసాగించాలని వీరందరూ డిప్యూటీ సీఎం, మంత్రులను కోరినా పట్టించుకోలేదు. ఆగస్టు నెల నుంచి కేవలం ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఉన్న 208 మంది ఆప్తాల్మిక్ అసిస్టెంట్లతోనే హైసూ్కళ్లలో విద్యార్థులకు పరీక్షలు చేయిస్తోంది. ఒక్కో ఆప్తాల్మిక్ అసిస్టెంట్‌కు రోజుకు 200 మంది విద్యార్థులను స్క్రీనింగ్ చేయాలని పలు జిల్లాల్లో లక్ష్యాలను నిర్దేశించారు. ఇది వారికి తలకు మించిన భారంగా మారింది. సాధారణంగా ఒక విద్యారి్థని పరీక్షించడానికి కనీసం పావుగంట పడుతుంది. ఈ లెక్కన రోజుకు 60 నుంచి 80 మందిని పరీక్షించడమే కష్టం. అలాంటిది 200 మందిని ఎలా పరీక్షించగలుగుతామని వారు వాపోతున్నారు. చాలా చోట్ల అరకొరగా పరీక్షలు చేసి మమ అనిపించేస్తుండటంతో దీని ప్రభావం విద్యార్థుల భవిష్యతపై పడుతోంది. మరోపక్క కంటి వైద్యం గురించి తెలియని ఉపాధ్యాయులతో కూడా కంటి పరీక్షలు చేయించేస్తున్నారు. పిల్లల్లో మెల్ల కన్ను, శుక్లాలు, గ్లకోమా, పుట్టుకతో, పౌష్టికాహార లోపంతో వచ్చే దృష్టిలోపాలను 12 ఏళ్లలోపే గుర్తించి, వాటి నివారణకు కళ్లద్దాలు, సర్జరీలు చేయాల్సి ఉంటుంది. నిపుణులైన ఆప్తాల్మిక్ అసిస్టెంట్లే ఈ లోపాలను పసిగట్టడానికి వీలుంటుంది. లేని పక్షంలో ఈ సమస్యలు తీవ్రమై భవిష్యత్తుకు ప్రమాదమని నిపుణులు చెబుతున్నారు.సీహెచ్‌సీల్లో స్క్రీనింగ్ బంద్అపోలో సంస్థతో ఒప్పందం ముగిసిందనే కారణంతో రాష్ట్రవ్యాప్తంగా 115 సీహెచ్‌సీల్లోని ఈ–ఐ కేంద్రాలను కూటమి ప్రభుత్వం మూసివేసింది. ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయకపోవడంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. గత ప్రభుత్వ విన్నపం మేరకు కేంద్ర ప్రభుత్వం నేషనల్ హెల్త్ మిషన్ పరిధిలో 91 ఆప్తాల్మిక్ అసిస్టెంట్ పోస్టులను ఎన్నికల సమయంలో మంజూరు చేసింది. ఇప్పుడున్న ప్రభుత్వం ఈ పోస్టులను భర్తీ చేయకుండా తాత్సారం చేస్తోంది. దీంతో ప్రజలు కూడా కంటి పరీక్షలు జరగక ఇబ్బందులు పడుతున్నారు.91 పోస్టుల్లో మమ్మల్ని సర్దుబాటు చేయాలి వైఎస్సార్ కంటి వెలుగు కార్యక్రమంలో సేవలందించిన మమ్మల్ని జూన్ నెల నుంచి ఆపేశారు. ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చిన నాటి నుంచి వేతనాలు కూడా ఇవ్వడంలేదు. మా కుటుంబాలు రోడ్డున పడ్డాయి. ఎన్హెచ్ఎం కింద రాష్ట్రానికి మంజూరైన 91 పోస్టుల్లో మమ్మల్ని సర్దుబాటు చేయాలి. విద్యార్థులకు కంటి పరీక్షల కోసం నైపుణ్యం లేని ఉపాధ్యాయులను వాడుతున్నారు. ప్రత్యేకంగా కంటి పరీక్షల కోసమే నియమించిన మా సేవలను వినియోగించుకుంటే పేద ప్రజలకు మేలు జరుగుతుంది. – తలారి ఆనంద్‌కుమార్, రాష్ట్ర ఆప్తాల్మిక్ అసిస్టెంట్ల సంఘం కార్యదర్శి -
కు.ని. బాధితుల్లో 28 మందికి ఇన్ఫెక్షన్
సాక్షి, హైదరాబాద్: రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం సామాజిక ఆరోగ్య కేంద్రం (సీహెచ్‌సీ)లో కుటుంబ నియంత్రణ (కు.ని.) ఆపరేషన్లు వికటించి ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్న 30 మంది బాధితుల్లో 28 మందికి తీవ్రమైన ఇన్ఫెక్షన్ సోకినట్లు నిర్ధారణ అయింది. వారికి అపోలో, నిమ్స్ ఆస్పత్రుల్లో చికిత్స నిర్వహిస్తున్నారు. ఆపరేషన్లు వికటించి నలుగురు మృతి చెందడంతో అప్రమత్తమైన ప్రభుత్వం మిగిలిన 30 మంది మహిళలనూ వేరే ఆసుపత్రులకు తరలించింది. ఇన్ఫెక్షన్కు గురైన వారిని సకాలంలో ఆసుపత్రులకు తీసుకురావడంతో వారు ప్రమాదం నుంచి బయటపడ్డారని వైద్య వర్గాలు చెబుతున్నాయి. కుటుంబ నియంత్రణకు ఉపయోగించే వైద్య పరికరాలు సరిగా స్టెరిలైజేషన్ చేయకపోవడం వల్లే ఇన్ఫెక్షన్ సోకినట్లు అధికారులు చెబుతున్నారు. దీనిపై సమగ్రంగా విచారణ చేపడుతున్నారు. కాగా, ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్న 30 మందిలో 10 మందిని శుక్రవారం డిశ్చార్జి చేయాలని భావిస్తున్నారు. వారి ఆరోగ్యం నిలకడగా ఉందని చెబుతున్నారు. విడతల వారీగా బాధితులను డిశ్చార్జి చేస్తామని ప్రజారోగ్య సంచాలకుడు డాక్టర్ శ్రీనివాసరావు తెలిపారు. ప్రస్తుతం బాధితులంతా వైద్యుల పర్యవేక్షణలో ఉన్నారన్నారు. ఎవరికీ ఎలాంటి ప్రమాదం లేదని స్పష్టంచేశారు. ఇన్ఫెక్షన్ కారణంగానే మృతి ఇబ్రహీంపట్నంలో మృతి చెందిన నలుగురి పోస్ట్‌మార్టం వివరాలను వైద్య వర్గాలు వెల్లడించాయి. వారి రిపోర్టులు సాధారణంగానే ఉన్నాయని తెలిపాయి. ఇతరత్రా అవయవాలపై ఎలాంటి ప్రభావం కనిపించలేదని స్పష్టం చేశాయి. ప్రస్తుతానికి ఇన్ఫెక్షన్ కారణంగానే వారు మరణించినట్లు భావిస్తున్నామన్నాయి. కాగా, డబుల్ పంక్చర్ లాప్రోస్కోపీ (డీపీఎల్) పద్ధతిలో క్యాంపుల ద్వారా జరిగే కుటుంబ నియంత్రణ ఆపరేషన్లను ప్రభుత్వం తాత్కాలికంగా నిలిపివేసింది. ఒక్కో రోజు 10–15 మంది కంటే ఎక్కువగా కు.ని. ఆపరేషన్లు చేయకూడదని నిర్ణయించినట్లు వైద్య విధాన పరిషత్ కమిషనర్ డాక్టర్ అజయ్‌కుమార్ తెలిపారు. ఇతర విధానాల్లో కు.ని. సర్జరీలు యథావిధిగా కొనసాగుతాయని స్పష్టం చేశారు. మరోవైపు ప్రజారోగ్య సంచాలకులు డాక్టర్ శ్రీనివాసరావు గురువారం జిల్లా వైద్యాధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఇబ్రహీంపట్నం ఘటన నేపథ్యంలో కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు జాగ్రత్తగా నిర్వహించాలని ఆదేశించారు. ఎక్కడైనా వికటించే సంఘటనలు జరిగితే జిల్లా వైద్యాధికారులే బాధ్యత వహించాల్సి ఉంటుందని హెచ్చరించారు. -
పాడిరైతులకు 45 సీహెచ్‌సీలు
సాక్షి, అమరావతి: పాడిరైతులకు అద్దె ప్రాతిపదికన ఆధునిక యంత్ర పరికరాలను అందుబాటులోకి తీసుకొస్తున్నారు. ఇందుకోసం పశుసంవర్ధకశాఖ డివిజన్‌స్థాయిలో కస్టమ్ హైరింగ్ సెంటర్స్ (యంత్ర సేవాకేంద్రాలు–సీహెచ్‌సీలు) ఏర్పాటు చేస్తోంది. ఈ నెలాఖరులోగా అర్హతగల జాయింట్ లయబుల్ గ్రూపు (జేఎల్‌జీ)లకు రుణాలు మంజూరు చేసి మే మొదటి వారంలో వీటిని ప్రారంభించాలని నిర్ణయించారు. రాష్ట్రంలో 46 లక్షల ఆవులు, 62.19 లక్షల గేదెలు, 1.76 కోట్ల మేకలు, గొర్రెలు ఉన్నాయి. వీటికి నాణ్యమైన మేతను అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే పెద్ద ఎత్తున కార్యక్రమాలు అమలు చేస్తోంది. పశుగ్రాసానికి అవసరమైన యంత్ర పరికరాలను అద్దె ప్రాతిపదికన రైతులకు అందుబాటులోకి తీసుకొచ్చేందుకు 45 పశుసంవర్ధక శాఖ డివిజన్లలో సీహెచ్‌సీలను ఏర్పాటు చేస్తున్నారు. నలుగురికి తక్కువ కాకుండా పాడి రైతులతో ఏర్పాటైన జేఎల్‌జీ గ్రూపుల్లో అర్హత ఉన్న గ్రూపుల ఎంపిక 39 డివిజన్లలో పూర్తయింది. ఈ కేంద్రాలను క్రమంగా ఏరియా వెటర్నరీ ఆస్పత్రి, డిస్పెన్సరీ స్థాయికి విస్తరిస్తారు. 40 శాతం సబ్సిడీ ఈ కేంద్రాలకు రూ.14.70 లక్షల విలువైన 8 రకాల యంత్రపరికరాలను సమకూర్చనున్నారు. వీటిలో గడ్డిని ముక్కలు చేసే యంత్రాలు, కట్టలు కట్టే యంత్రాలు తదితరాలున్నాయి. కంకిపాడు వ్యవసాయ మార్కెట్ కమిటీలో డెమో ప్రదర్శనకు ఉంచిన ఈ యంత్రాలను పరిశీలించి గ్రూపు సభ్యులు తమకు అవసరమైనవే కొనుక్కునే వెసులుబాటు కల్పించారు. ఈ మొత్తంలో 10 శాతం జేఎల్‌జీ భరించాలి. 40 శాతం సబ్సిడీ రూపంలో రాష్ట్రీయ కృషి వికాస్ యోజన (ఆర్కేవీవై) కింద ప్రభుత్వం సమకూరుస్తుంది. మిగిలిన 50 శాతం మొత్తాన్ని బ్యాంకుల ద్వారా రుణ సదుపాయం కల్పిస్తున్నారు. ప్రతి యంత్ర పరికరానికి జియో ట్యాగింగ్ చేస్తున్నారు. యూనిట్ గ్రౌండ్ కాగానే సబ్సిడీ విడుదల చేయనున్నారు. ఇందుకోసం ఆర్కేవీవై నిధుల నుంచి రూ.2.65 కోట్లు కేటాయించారు. నెలాఖరులోగా జేఎల్‌జీ గ్రూపుల ఎంపిక, రుణాల మంజూరు ప్రక్రియను పూర్తిచేసి వచ్చేనెలలో ఈ కేంద్రాలను అందుబాటులోకి తీసుకురావాలని ప్రయత్నిస్తున్నట్లు పశుసంవర్ధక శాఖ డీడీ అమరేంద్రకుమార్ ‘సాక్షి’కి తెలిపారు. -
ఆసుపత్రిపై కమాండ్ & కంట్రోల్
సాక్షి, హైదరాబాద్: పోలీస్‌శాఖలో కమాండ్ అండ్ కంట్రోల్ వ్యవస్థ ద్వారా శాంతిభద్రతలను ఎలాపర్య వేక్షిస్తున్నారో అలాగే వైద్యఆరోగ్యశాఖలోనూ ఏర్పాటు చేయాలని సర్కారు సూత్రప్రాయంగా నిర్ణయించింది. ప్రాథమిక ఆరోగ్య కేంద్రం (పీహెచ్సీ) మొదలు ఏరియా ఆసుపత్రి, సామాజిక ఆరోగ్య కేంద్రం (సీహెచ్‌సీ), జిల్లా ఆసుపత్రి, బోధనాసు పత్రి ఇలా అన్ని రకాల ప్రభుత్వాస్పత్రుల్లో రోగుల కు అందుతున్న సేవలన్నింటిపైనా నిరంతర పర్య వేక్షణకు ఈ కమాండ్ అండ్ కంట్రోల్ వ్యవస్థను ఏర్పాటు చేస్తారు. ఈ మేరకు ఆ శాఖ మంత్రి ఈటల రాజేం దర్ ఉన్నతాధికారులతో జరిగిన సమావేశంలో నిర్ణయించారు. ఇప్పటికే బయోమెట్రిక్ వ్యవస్థను ఏర్పాటు చేయాల ని నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. దీంతోపాటు మంగళవారం కమాండ్ అండ్ కంట్రోల్ వ్యవస్థపైనా సూత్ర ప్రాయ నిర్ణయం తీసుకున్నారు. ఆసుపత్రులు ఎన్నింటికి తెరుస్తున్నారు? సిబ్బంది సమయపాలన పాటిస్తున్నారా లేదా? డాక్టర్లు ఎన్ని గంటలకు వస్తున్నారు? రోగులు ఎంత సేపటి నుంచి వేచి చూస్తున్నారు? రోగుల పట్ల వైద్య సిబ్బంది తీరు ఎలా ఉంటుందో మొత్తం కమాండ్ అండ్ కంట్రోల్ వ్యవస్థ ద్వారా వీక్షించవచ్చు. అందుకోసం అన్ని ప్రభుత్వ ఆసుపత్రుల్లో నిఘా కెమెరాలు ఏర్పాటు చేస్తారు. వాటినన్నింటినీ హైదరాబాద్ కోఠిలోని ఆరోగ్య కుటుంబ సంక్షేమ కమిషనర్ కార్యాలయంలో ఏర్పాటు చేసే కమాండ్ అండ్ కంట్రోల్ వ్యవస్థకు అనుసంధానం చేస్తారు. అవసరమైతే సచివాలయంలో వైద్య ఆరోగ్య శాఖ మంత్రి చాంబర్లోనూ ఈ వ్యవస్థను ఏర్పాటు చేసే అంశాన్ని పరిశీ లిస్తున్నారు. తద్వారా ప్రభుత్వ ఆసుపత్రుల్లో రోగులకు సక్రమంగా వైద్య సేవలు అందించాలన్నదే ఉద్దేశమని ఆ శాఖ వర్గాలు తెలిపాయి. మందుల ట్రాకింగ్... రాష్ట్రంలో 900 పైగా పీహెచ్‌సీలున్నాయి. 31 జిల్లా ఆసుపత్రులున్నాయి. ఏరియా ఆసుపత్రులు, సామాజిక ఆరోగ్య కేంద్రాలున్నాయి. వాటితోపాటు ప్రభుత్వ బోధనాసు పత్రులున్నాయి. ఏజెన్సీ ఏరియా ఉట్నూరు ప్రభుత్వ ఆసుపత్రి నుంచి మొదలుపెడితే హైదరాబాద్ గాంధీ, ఉస్మానియా బోధనాసుపత్రి వరకు మొత్తం అన్ని ప్రభుత్వ ఆసుపత్రులనూ కమాండ్ అండ్ కంట్రోల్ వ్యవస్థకు అనుసంధానం చేస్తారు. వైద్య ఆరోగ్యశాఖలోని జిల్లా, రాష్ట్రస్థాయి పరిపాలనా వ్యవస్థలనూ అనుసంధానం చేసే వీలుం ది. ఉదాహరణకు హైదరాబాద్ నీలోఫర్‌లో చిన్న పిల్లలకు పడకలు లేక అనేక సందర్భాల్లో ఆరుబయట ఉంచడం, కింద పడుకోబెట్టడం వంటివి జరుగుతున్నాయి. ఇలాంటి వాటిపై పిల్లల తల్లిదండ్రులు ఫిర్యాదు చేసే పరిస్థితి ఉండటం లేదు. కానీ కమాండ్ అండ్ కంట్రోల్ వ్యవస్థ ద్వారా చూసి తక్షణమే సంబంధిత వైద్యాధికారితో పరి స్థితిని చక్కదిద్దుతారు. డ్రగ్ కంట్రోల్ కేంద్రాల నుంచి ఏఏ మందులు ఎన్నె న్ని ఆసుపత్రులకు వెళ్తున్నాయో కూడా జీపీఎస్ ద్వారా కమాండ్ అండ్ కంట్రోల్ వ్యవస్థకూ అనుసంధా నం చేస్తారు. ఎక్కడికైనా తరలి వెళుతున్నాయా? నిర్దేశిత ఆసుపత్రికే వెళుతున్నాయా? వెళితే ఎంతెంత వెళుతున్నాయో కూడా ఆన్లైన్లో కనిపిస్తుంది. ఇక ఇండెంట్ ప్రకారమే మందులు వెళుతున్నాయా లేదో కూడా చూస్తారు. ఆస్పత్రుల్లో రోగులకు అవసరమైన మందులున్నాయా అని రోజూ ఆన్లైన్లో పర్యవేక్షిస్తారు. ఇటీవల నాంపల్లి యూపీహెచ్‌సీలో వ్యాక్సిన్ అనంతరం వేసిన ట్రెమడాల్ మాత్ర వికటించి ఇద్దరు పిల్లలు చనిపోయిన నేపథ్యంలో అనవసర మాత్రలు ఉన్నాయా అన్నది కూడా పరిశీలిస్తారు. కమాండ్ అండ్ కంట్రోల్ వ్యవస్థ ద్వారా రోగులకు ప్రభుత్వం నిర్దేశించిన విధంగా సేవలు అందాలన్నదే ఉద్దేశమని ఒక ఉన్నతాధికారి తెలిపారు. ఉన్నతాధికారిపై సర్కార్ సీరియస్ లక్ష్యం మేరకు వైద్య ఆరోగ్యశాఖలోని ఒక ఉన్నతాధికారి సరిగా పనిచేయక పోవడంతో సర్కారు సీరియస్‌గా ఉంది. ఇటీవల మంత్రి ఈటల రాజేందర్ నిర్వ హించిన సమీక్షలోనూ ఆ అధికారి వ్యవహార శైలిపై సీరియస్ అయినట్లు తెలుస్తోంది. ఆ కారణంగానే మనస్తాపానికి గురై ఆ అధికారి సెలవుపై వెళ్లినట్లు వైద్య ఆరోగ్య శాఖలో చర్చ జరుగుతోంది. ప్రధానంగా కేసీఆర్ కిట్ అమలు తీరులో సరిగా వ్యవహ రించకపోవడం, ఇప్పటికీ చాలాచోట్ల కిట్ సొమ్ము అం దకపోవడం, నాంపల్లి యూపీహెచ్‌సీలో వ్యాక్సిన్ అనం తరం వేసిన ట్రెమడాల్ మాత్ర వికటించిన ఘటనలో ఇద్దరు పసి పిల్లలు చనిపోవడం తదితర అంశాలపై ఆ అధికారి వ్యవహరించిన తీరుపట్ల సర్కారు తీవ్ర అసంతృప్తి వ్యక్తంచేసినట్లు తెలి సింది. పైగా ఉద్యోగులతోనూ కఠినంగా ఉంటున్నారని, కొందరు ఔట్సోర్సింగ్ ఉద్యోగులను తొలగించడం వంటి అంశాలూ కూడా ఈ పరిస్థితికి కారణమని తెలి సింది. అయితే ఆ అధికారి పేషీకి సంబంధించిన సిబ్బంది మాత్రం వేసవి సెలవులకు వెళ్లారని చెబుతున్నారు. ఉన్నతస్థాయి వర్గాలు మాత్రం దీనిపై స్పందించడంలేదు. -
ఓట్ల కోసం ఉత్తుత్తి జీవోలు
అగనంపూడి: పారిశ్రామిక ప్రాంత రోగుల పాలిట సంజీవని, మినీ ఘోషాసుపత్రిగా పేరొందిన అగనంపూడి సీహెచ్‌సీ స్థాయి పెంచుతాం... పరిసర ప్రాంతాల్లోనిప్రజలందరికీ వైద్య సేవలు అందుబాటులోకి తీసుకొస్తాం... అని గతంలో పల్లా శ్రీనివాసరావు ఓ హామీ ఇచ్చేశారు. అనంతరం ఆ విషయమే మరిచిపోయారు. ఇంతలో ఎన్నికలు సమీపిస్తుండడంతో హడావుడిగా ఓ జీవో తీసుకొచ్చేలా ప్రభుత్వంలో మంత్రాంగం నడిపారు. ఇంకేముంది ఘనత వహించిన ముఖ్యమంత్రి చంద్రబాబు ఓ జీవో జారీ చేసేశారు. స్థానిక సీహెచ్‌సీని ఏరియా ఆస్పత్రిగా మారుస్తున్నామని ప్రకటించేశారు. అంతేతప్ప ఏరియా ఆస్పత్రిగా మారిస్తే ఎంత మంది వైద్యులు అవసరం, ఇతర సిబ్బంది నియామకం, వసతులు, ల్యాబొరేటరీ కల్పన తదితర అంశాలను మాత్రం పట్టించుకోలేదు. సరిగ్గా ఎన్నికల నోటిఫికేషన్‌కు 25 రోజుల ముందు తీసుకొచ్చిన ఈ జీవోపై అగనంపూడి, పరిసర ప్రాంతాల ప్రజలు మండిపడుతున్నారు. మళ్లీ మాయ జీవోలతో ఓట్లు దండుకునేందుకు టీడీపీ నాయకులు డ్రామాలాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఓట్ల కోసం హడావుడిగా జీవో జారీ ప్రస్తుతమున్న సీహెచ్‌సీలో పూర్తిస్థాయి వసతులు లేకపోవడంతో పరిసర ప్రాంతాల వాసులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అత్యవసరమైతే ప్రైవేటు ఆస్పత్రులను ఆశ్రయించిన వేలాది రూపాయలు ఖర్చు చేస్తున్నారు. ఆర్థిక స్థోమత లేనివారు నగరంలోని కేజీహెచ్‌కు పరుగులు తీస్తున్నారు. ఈ పరిస్థితుల్లో స్థానిక సీహెచ్‌సీని ఏరియా ఆస్పత్రిగా మారిస్తే అందరికీ ప్రయోజనకరంగా ఉంటుందనే డిమాండ్ ఏళ్ల తరబడి ఉంది. ప్రస్తుతం సీహెచ్‌సీలో డాక్లర్టు 8 మంది, నర్సులు 9 మంది, ఫార్మాసిస్టు ఒకరు, జూనియర్ అసిస్టెంట్ ఒకరు, ల్యాబ్ అసిస్టెంట్ ఒకరు ఉన్నారు. వీరితోపాటు అవుట్ సోర్సింగ్‌లో తీసుకున్న కాంట్రాక్ట్ సిబ్బంది 15 మంది పనిచేస్తున్నారు. దీన్ని ఏరియా ఆస్పత్రిగా మార్చేశామంటూ ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావుతోసహా టీడీపీ నాయకులంతా బాజా మోగిస్తున్నారు. అయితే కనీస చర్యలు చేపట్టకపోవడంతో ఈ ఉత్తర్వులు కేవలం ఎన్నికలను దృష్టిలో పెట్టుకొనే ఇచ్చారని స్థానికులు పెద్ద ఎత్తున ఆరోపణలు చేస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 28 ఆస్పత్రుల స్థాయి పెంచుతూ అగనంపూడిని కూడా ఆ జాబితాలో చేర్చేశారనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావుకు చిత్తశుద్ధి ఉంటే సిబ్బంది పెంచడం లేదా సౌకర్యాలు కల్పించడానికి కృషి చేసేవారంటున్నారు. -
ఇంతకీ డ్రైవరా... డాక్టరా..?
సాక్షి, ఉలవపాడు (ప్రకాశం): ఏదైనా వైద్యశాలకు వెళ్లాలంటే అక్కడ ఎలా వైద్యం చేస్తారని కనుక్కుని వెళతాం. ఇలాంటి పరిస్థితుల్లో వైద్య విధాన పరిషత్ ఆధ్వర్యంలో నడుస్తున్న సీహెచ్‌సీలో కారు డ్రైవర్ ఇంజక్షన్లు, సెలైన్లు వేస్తున్న దుస్థితి నెలకొంది. ప్రభుత్వ వైద్యశాల అంటే ఎక్కువగా పేదలే వస్తుంటారు. వారి వైద్యం అంటే ప్రభుత్వానికి ఆటగా మారింది. ఉలవపాడు వైద్యశాలలో కంటి వైద్య నిపుణురాలుకి కారు ఉంది. ఆమె కావలి నుంచి ప్రతిరోజూ కారులో వస్తుంది. ఆమె కారు డ్రైవరే ఇప్పుడు వైద్యశాలలో వైద్యం చేస్తున్నాడు. ఉలవపాడు వైద్యశాలలో ఆరుగురు వైద్యులు ఉన్నారు. గైనకాలజిస్టు, పిల్లల వైద్యనిపుణులు, పంటి వైద్య నిపుణులు, కంటి వైద్య నిపుణులు, జనరల్ వైద్యులతో పాటు వైద్యాధికారిణి కూడా ఉన్నారు. వీరు ఓపీ చూసిన తరువాత ఇంజక్షన్లు లేదా, సెలైన్లు రాస్తారు. ఈ సెలైన్లను కారు డ్రైవర్ పెడతున్న పరిస్థితి నెలకొంది. శిక్షణ పొందిన స్టాఫ్ నర్సులు ఉన్నా డ్రైవర్ పెడుతుండడంతో రోగులు భయాందోళనలు చెందుతున్నారు. భయాందోళనలో రోగులు.. రోగులు కారు డ్రైవర్ ఇంజక్షన్లు, సెలైన్లు పెడుతుండడంతో భయాందోళనలు చెందుతున్నారు. ప్రభుత్వ వైద్యశాలలో ఎలాంటి శిక్షణ లేని వారు, వైద్యశాలకు సంబంధం లేని వారు వైద్యం ఎలా చేస్తారని ప్రశ్నిస్తున్నారు. వారి డ్రైవర్లు ఇలా చేస్తే ఎలా అని అడుగుతున్నారు. సిబ్బంది సైతం కారు డ్రైవర్లతో బాగుంటూ వారు చెప్పిన విధంగా చేస్తున్నారు. లేకుంటే వైద్యులకు చెప్పితమను ఇబ్బంది పెడతారేమో అని భయం సిబ్బందిలో ఉంది. దీంతో వారు వైద్యం చేస్తున్నా ప్రశ్నించడం లేదు. ఈ విషయంపై వైద్యాధికారిణి శోభారాణిని వివరణ కోరగాఈ విషయం నా దృష్టికి రాలేదు. ఒక్కరే నర్సు ఉన్న సమయంలో ఆమెకు సాయం చేస్తున్నారు. ఆపేయమంటు ఆపేస్తామని తెలిపారు. ఇలా అయితే ఎలా... ప్రస్తుతం ఉలవపాడు వైద్యశాలను ఎంఎల్‌సీసీ (మెడికో లీగల్ సెంటర్)గా మార్చారు. వివాదాలు, కొట్లాట కేసులు వస్తుంటాయి. వారికి వైద్యం చేసి వెంటనే పోలీసులకు రిపోర్టు అందజేయాలి. దీని పైనే కేసులు ఆధారపడి ఉంటాయి. ఇలాంటి పరిస్థితుల్లో వైద్యం చేసిన సమయంలో ఏ ఇబ్బందులు జరిగినా దానికి బాధ్యత ఎవరు వహించాలి. లీగల్ కేసులు వస్తున్న పరిస్థితుల్లో శిక్షణ పొందిన వారు వైద్యం చేయాలని కోరుతున్నారు. బయట వ్యక్తులు కేసులను తప్పుదోవ పట్టించే అవకాశం ఉంటుంది. ఇలాంటి చర్యలు పునరావృతంకాకుండా చూడాలని రోగులు కోరుతున్నారు. -
పాచి పట్టిన ‘దంత’ నిధులు
కడప రూరల్: నిధుల్లేక.. ఉన్నా అవి విడుదల కాక చాలా ప్రభుత్వ శాఖలు ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటున్నాయి. కొన్ని శాఖల అధికారుల నిర్లక్ష్యం ప్రజలకు శాపంగా మారింది. ఇందులో వైద్య రంగాన్ని చెప్పుకోవాలి. కేంద్ర ప్రభుత్వం ‘నేషనల్ ఓరల్ హెల్త్ ప్రోగ్రాం’ కింద దంత చికిత్స విభాగానికి రూ.59 లక్షలు కేటాయించింది. ఈ బడ్జెట్‌ను జిల్లా వ్యాప్తంగా వైద్య విధాన పరిషత్ శాఖ పరిధిలోని సీహెచ్‌సీ మ్యూనిటీ హెల్త్ సెంటర్)లకు కేటాయించింది. అయితే ఏడాది దాటినా ఆ నిధులను ఖర్చు చేయడానికి ఎందుకు చేతులు ఆడడంలేదో అర్థం కావడంలేదు. 11సీహెచ్‌సీలకు రూ.59 లక్షలు మంజూరు జిల్లా వైద్య విధాన పరిషత్ పర్యవేక్షణలో జిల్లా వ్యాప్తంగా ప్రొద్దుటూరులో జిల్లా ఆసుపత్రి, పులివెందులలో ఏరియా హాస్పిటల్ ఉన్నాయి. అలాగే ఒకొక్కటి చొప్పున మైదుకూరు, సిద్దవటం, పోరుమామిళ్ల, బద్వేల్, రైల్వేకోడూరు, రాజంపేట, రాయచోటి, లక్కిరెడ్డిపల్లె, వేంపల్లె, కమలాపురం, జమ్మలమడుగు, చెన్నూరు కలిపి మొత్తం 14 సీహెచ్‌సీలు ఉన్నాయి. ఇందులో లక్కిరెడ్డిపల్లె, సిద్దవటం, చెన్నూరు సీహెచ్‌సీలను మినహాయిస్తే, ఒక సీహెచ్‌సీకి రూ.5.36 లక్షల ప్రకారం మొత్తం 11 సీహెచ్‌సీలకు దాదాపు రూ.59 లక్షలు మంజూరైంది. 2018 ఫిబ్రవరిలో మంజూరైన నిధులు ఈ నిధులను కేంద్ర ప్రభుత్వం 2018 ఫిబ్రవరిలో విడుదల చేసింది. ఈ నిధులతో ఆయా సీహెచ్‌సీల్లోని ‘దంత వైద్యం’ విభాగానికి ఖర్చు చేయాల్సి ఉంది. అంటే డెంటల్ ఛైర్, దంత వైద్యం పరికరాల కొనుగోలు తదితర అవసరాల కోసం ఖర్చు చేయాలి. అంటే దంత వైద్యానికి వచ్చే రోగులకు మెరుగైన వైద్య సేవలను అందించడమే ప్రధాన లక్ష్యం. ఇలాంటి ప్రాముఖ్యత కలిగిన నిధులను ఆ శాఖ ఇంతవరకు ఖర్చు చేయకపోవడం దారుణం. కాగా రాష్ట్రంలోని 12 జిల్లాల్లో ఈ నిధులను ఎప్పుడో ఖర్చు పెట్టేశారు. వైఎస్సార్ కడప జిల్లాలో మాత్రం ఖర్చు పెట్టకుండా ఎందుకు పొదుపు చేస్తున్నారో అర్థం కావడం లేదు. 25శాతం రోగులకు దంత సమస్యలే ప్రతి సీహెచ్‌సీలో రోగుల సంఖ్య పెరిగింది. రోజుకు ప్రతి సీహెచ్‌సీకి వందకు పైగా రోగులు వస్తున్నారు. ఇందులో దాదాపు 25 శాతం మంది దంతాల సమస్యలతో బాధపడుతున్నారు. శరీరంలో దంత సంరక్షణ ఎంతో కీలకం. ఇలాంటి విభాగానికి ఇచ్చిన నిధులను ఖర్చు చేయకపోవడం ఏంటని పలువురు ప్రశ్నిస్తున్నారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి వచ్చిన నిధులను ఖర్చు చేయవలసిన అవసరం ఎంతైనా ఉంది. ఈ విషయమై ఆ శాఖ జిల్లా ఆసుపత్రుల సమన్వయ అధికారి డాక్టర్ పద్మజను వివరణ కోరగా.. తాను బిజీగా ఉన్నానని, ఏదైనా ఉంటే చాంబర్‌కు వచ్చి కనుక్కోండని సూచించారు. -
వైద్యం కోసం వస్తే... ఉసురు తీశారు !
విశాఖపట్నం,ముంచంగిపుట్టు(పెదబయలు): తీవ్ర జ్వరంతో వైద్యం కోసం సీహెచ్‌సీ వచ్చిన గిరిజన యువకుడు మృత్యువాత పడడంతో అతని బంధువులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. వైద్యాధాకారి నిర్లక్ష్యం కారణంగానే తమ బిడ్డ మృతి చెందాడని కుటుంబ సభ్యులు ఆరోపించారు. ఈ సంఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. ముంచంగిపుట్టు మండలం పసనపుట్టు పంచాయతీ టిక్రపడ గ్రామానికి చెందిన పాంగి లైకోన్(27)కి తీవ్ర జ్వరం రావడంతో గురువారం ఉదయం 9 గంటలకు ముంచంగిపుట్టు కమ్యూనిటీ ఆస్పత్రికి తీసుకొచ్చారు. 10 గంటలకు పాడేరు నుంచి వచ్చిన వైద్యాధికారి మోహన్‌రావు అతనిని పరీక్షించి, సిలైన్ బాటిల్ పెట్టి, ఇంజక్షన్ ఇచ్చారు. కొంత సేపు ఉన్న వైద్యాధికారి నర్సుకు చెప్పి మళ్లీ పాడేరు వెళ్లిపోయారు. డాక్టర్ వెళ్లిన రెండు గంటల తరువాత సాయంత్రం 4 గంటలకు లైకోన్ మృతి చెందాడు. దీంతో బంధువులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. వైద్యాధికారి నిర్లక్ష్యం కారణంగా మృత్యువాత పడ్డాడని ఆరోపిస్తూ బంధువులు సీహెచ్‌సీ ఎదుట ఆందోళన చేశారు. ప్రభుత్వ ఆస్పత్రికి వైద్యం కోసం వస్తే శవంగా మార్చారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. గిరిజనులు ఉసురు ప్రభుత్వానికి తగులుతుందన్నారు. చేతికందిన కొడుకు మృత్యువాత పడడంతో తల్లిదండ్రులు గుండెలవిసేలా రోదించారు. లైకోన్ పరిస్థితి విషమంగా ఉన్నా ఎందుకు మెరుగైన వైద్యం కోసం తరలించ లేదని బంధువులు, స్థానిక నాయకులు వైద్య సిబ్బంది పై మండిపడ్డారు. అంబులెన్సులున్నా డ్రైవర్లు లేరు ముంచంగిపుట్టు 108 వాహనానికి ఫోన్ చేసినా ఎవరూ స్పందించలేదు. పీహెచ్‌సీకి అంబులెన్స్ ఉన్నా డ్రైవర్ లేడు. ఫీడర్ అంబులెన్స్ ఉన్నా పైలట్ లేకపోవడంతో కింద స్థాయి సిబ్బందికి పాడేరు తరలించే అవకాశం లేకుండా పోయింది. ముంచంగిపుట్టు సీహెచ్‌సీకి వైద్యులు లేరు. గతంలో ఇక్కడ ఇద్దరు వైద్యులుండగా లబ్బూరు పీహెచ్‌సీకి ఒకరిని, మరొకరిని వేరే ప్రాంతానికి బదిలీ చేశారు. దీంతో సీహెచ్‌సీలో పూర్తిస్థాయి వైద్యులు లేకుండా పోయారు. పాడేరుకు చెందిన మోహన్‌రావుకు అదనపు బాధ్యతలు అప్పగించారు. నాకు కాదు...ఆరోగ్య మంత్రికి చెప్పండి ముంచంగిపుట్టు సీహెచ్‌సీకి పూర్తి స్థాయిలో వైద్యులను నియమించాలని, వైద్యాధికారి లేక పూర్తి స్థాయి వైద్యం అందక గిరిజన యువకుడు మృతి చెందాడని విలేకరులు వైద్య విధాన పరిషత్ జిల్లా కో ఆర్డినేటర్ నాయక్‌కు పోన్ చేస్తే ఆయన దురుసుగా సమాధానం చెప్పారు. వైద్యాధికారులను నియమించడం నా బాధ్యత కాదని, వైద్య ఆరోగ్య శాఖ మంత్రికి అడగండని తెలిపారు. ప్రభుత్వం వద్ద వైద్యాధికారుల నియామకం ఫైల్ ఉందని చెప్పారు. పూర్తి స్థాయిలో వైద్యులను నియమించాలి పెదబయలు, ముంచగిపుట్టు మండలాలకు పెద్ద దిక్కుగా ఉన్న ముంచంగిపుట్టు సీహెచ్‌సీకి ఐదుగురు వైద్యులు ఉండాలి. కానీ ప్రస్తుతం పూర్తి స్థాయి వైద్యుడు ఒక్కరు కూడా లేకపోవడం దారుణమని మండల వైఎస్సార్ సీపీ నాయకులు అరిసెల చిట్టిబాబు, గాసీరావు, రామచందర్ తెలిపారు. తన సొంత నియోజకవర్గంలోనే పూర్తిస్థాయి వైద్యుడు లేకుండా సీహెచ్‌సీ నడుస్తుంటే వైద్య,ఆరోగ్య శాఖ మంత్రికి పట్టదా? అని వారు ప్రశ్నించారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి పూర్తి స్థాయిలో వైద్యులు, సిబ్బందిని నియమించాలని డిమాండ్ చేశారు. -
సీహెచ్‌సీలకు వైద్యులు కావలెను..!
విజయనగరం ఫోర్ట్: జిల్లాలోని సామాజిక ఆరోగ్య కేంద్రాల్లో వైద్యుల కొరత నెలకొంది. మాత, శిశువులకు పూర్తిస్థాయిలో వైద్య సేవలు అందడం లేదు. పేదలు సైతం ప్రైవేటు ఆస్పత్రులను ఆశ్రయించాల్సి వస్తోంది. జిల్లాలో 12 సీహెచ్‌సీలు, జిల్లా ఆస్పత్రి, పార్వతీపురం ఏరియా ఆస్పత్రి ఉన్నాయి. 12 సీహెచ్‌సీలకు ఐదు సీహెచ్‌సీల్లో వైద్యులు కొరత వెంటాడుతోంది. ఇదీ పరిస్థితి... జిల్లాలోని ఎస్.కోట, నెల్లిమర్ల, చీపురపల్లి, భోగాపురం, బాడంగి, సాలురు, భద్రగిరి, కురుపాం, చినమేరంగి, ఘోష ఆస్పత్రి, గజపతినగరం, బొబ్బిలిలో సీహెచ్‌సీలు ఉన్నాయి. వీటిల్లో మాత శిశువులకు వైద్యసేవలు అందించేకు ప్రభుత్వం ఎంసీహెచ్ (మదర్ చైల్డ్ హెల్త్) టీమ్‌లను నియమించింది. ఇందులో ఒక మత్తు వైద్యుడు, ఒక గైనకాలజిస్టు, ఒక పిల్లలు వైద్యుడు ఉండాలి. మాతా శిశువులకు పూర్తి స్థాయిలో ప్రసవాలు, సిజేరియన్లు, శిశువులకు చికిత్స అందించడం కోసం ఎంసీహెచ్ బృందాలను నియమించారు. వీటితో మాత, శిశు మరణాలు తగ్గించాలన్నది వైద్య ఆరోగ్యశాఖ లక్ష్యం. అయితే, ఎంసీహెచ్ బృందాల్లో వైద్యులు పూర్తి స్థాయిలో లేకపోవడంతో సకాలంలో వైద్యం అందడం లేదు. ఫలితం.. సీహెచ్‌సీలకు వచ్చేవారిని మెరుగైన వైద్యం కోసం జిల్లా కేంద్రాస్పత్రికి రిఫర్ చేస్తున్నారు. ఐదు సీహెచ్‌సీల్లో వైద్యుల కొరత.. భద్రగిరి సీహెచ్‌సీలో మత్తువైద్యుడు, గైనకాలజిస్టు, పిల్లల వైద్యుడు ఉండాల్సి ఉండగా ఏ ఒక్కరు లేరు. చినమేరంగిలో పిల్లల వైద్యుడు, మత్తు వైద్యుడు లేరు. సాలురు, బోగాపురంలో మత్తు వైద్యులు లేరు. బాడంగిలో మత్తు వైద్యుడు లేరు. పిల్లల వైద్యుడు కూడా డిప్యుటేషన్‌పై పనిచేస్తున్నారు. గిరిజన ప్రాంతాల్లో వైద్యులు లేకపోవడంతో గర్భిణులను ఘోష ఆస్పత్రికి, కేజీహెచ్‌కు రిఫర్ చేస్తున్నారు. ఏళ్ల తరబడి భర్తీ చేయని ప్రభుత్వం.. సీహెచ్‌సీల్లో మత్తువైద్యుడు, గైనికాల జిస్టు, పిల్లల వైద్యుల పోస్టులు ఏళ్ల తరబడి ఖాళీగా ఉన్నా భర్తీ చేయడం లేదు. మాతా, శిశు సంక్షేమానికి కృషి చేస్తున్నామని ప్రభుత్వం గొప్పలు చెబుతున్నా... మాటలకు, చేతలకు పొంతన ఉండడం లేదు. వైద్యుల కొరత ఉంది... సీహెచ్‌సీల్లో మత్తు, గైనిక్, పిల్లల వైద్యుల పోస్టుల కొరత ఉన్న మాట వాస్తవమే. ప్రభుత్వం స్పెషలిస్టు పోస్టులకు నోటిఫికేషన్ ఇచ్చి భర్తీ చేస్తుంది. ఈ పక్రియ పూర్తయితే పోస్టులు భర్తీ అయ్యే అవకాశం ఉంది.– జి.ఉషశ్రీ,జిల్లా ఆస్పత్రుల సేవల సమన్వయ అధికారి -
సీహెచ్‌సీకి మహర్దశ
బెల్లంపల్లి: బెల్లంపల్లి సామాజిక ఆరోగ్య కేంద్రం(సీహెచ్‌సీ)కు ఎట్టకేలకు మహర్దశ పట్టబోతోంది. ఈ ప్రాంత ప్రజల ఎన్నో ఏళ్ల కల నెరవేర్చడానికి ప్రభుత్వం సిద్ధమైంది. రోగుల అవసరాలను దృష్టిలో పెట్టుకుని అప్‌గ్రేడ్ చేయాలని నిర్ణయం తీసుకుంది. ఇప్పటివకే ఫైలుపై సీఎం కేసీఆర్ సంతకం చేయగా.. వారం రోజుల్లో జీవో వెలువడనున్నట్లు తెలుస్తోంది. 30 పడకల సామర్థ్యం ఉన్న తెలంగాణ వైద్య విధాన పరిషత్ కమ్యూనిటీ హెల్త్ సెంటర్(సీహెచ్‌సీ)ను 100 పడకలకు అప్‌గ్రేడ్ చేయడానికి ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. రెండు రోజుల క్రితమే ప్రభుత్వం జిల్లా కేంద్రం మంచిర్యాలలోని 100 పడకల ఆస్పత్రిని 250 పడకలకు, 30 పడకల సామర్థ్యం కలిగిన లక్సెట్టిపేట ప్రభుత్వాస్పత్రిని 100 పడకలకు అప్‌గ్రేడ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసిన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగానే బెల్లంపల్లి కమ్యూనిటీ హెల్త్ సెంటర్‌ను కూడా అప్‌గ్రేడ్ చేయడానికి సీఎం సంబంధిత ఫైలుపై సంతకం చేసినట్లు విశ్వసనీయ సమాచారం. ఆ ఉత్తర్వుల ప్రతి వారం రోజుల వ్యవధిలో విడుదల కానున్నట్లు తెలుస్తోంది. ప్రభుత్వ తాజా నిర్ణయంతో బెల్లంపల్లి పరిసర ప్రాంతాల ప్రజలకు వైద్య సేవలు మరింతగా అందుబాటులో రానున్నాయి. రూ.17.50 కోట్లు మంజూరు బెల్లంపల్లిలో వంద పడకల ఆస్పత్రి ఏర్పాటుకు ప్రభుత్వం నిధులు మంజూరు చేయడానికి సన్నద్ధమైంది. ప్రాథమిక సమాచారం ప్రకారం రూ.17.50 కోట్లు నిధులు విడుదలకు సంసిద్ధతను వ్యక్తం చేసింది. ప్రస్తుతం తెలంగాణ వైద్య విధాన పరిషత్ కమ్యూనిటీ హెల్త్ సెంటర్‌కు పక్కా భవనం ఉన్నా పాతది కావడంతో పగుళ్లు తేలి పనికిరాకుండా ఉంది. ఆపరేషన్ థియేటర్ గది శిథిలావస్థకు చేరి అధ్వానంగా తయారైంది. వార్ఢులు కూడా అస్తవ్యస్తంగా ఉండడంతో రోగులు తీవ్ర అసౌకర్యానికి గురవుతున్నారు. నూతన భవనం నిర్మించి, పడకల సామర్థ్యం పెంచి, సరిపడా వైద్యులు, సిబ్బందిని కేటాయించాలనే డిమాండ్ కొన్నాళ్ల నుంచి ఉన్నా ఇన్నాళ్ళకు కానీ మోక్షం కలుగలేదు. అప్‌గ్రేడ్ కానుండడంతో రోగుల్లో ఆశలు చిగురిస్తున్నాయి. అధునాతనంగా భవనం నిర్మించి మెరుగైన వైద్యసేవలు అందించనున్నారు. రోజుకు 400పైనే రోగులు కమ్యూనిటీ హెల్త్ సెంటర్ అయినా రోజువారీగా రోగుల తాకిడి అధికంగా ఉంటుంది. చుట్టు పక్కల ప్రాంత రోగులకు దశాబ్దాలుగా వైద్య సేవలు అందిస్తోంది. రోజుకు 300 నుంచి 400 మంది వరకు రోగులు చికిత్స కోసం వస్తుంటారు. మంగళ, బుధ, శుక్రవారాల్లో ఆ సంఖ్య గరిష్టంగా రోజుకు 800 వరకు ఉంటుందని అంచనా. సరిపడా వైద్యులు, సిబ్బంది లేకపోయినా ప్రత్యామ్నాయ మార్గాలు లేకపోవడంతో చికిత్స కోసం రోగులు అనివార్యంగా వచ్చిపోతుంటారు. అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలోని బెల్లంపల్లి, తాండూర్, కాసిపేట, నెన్నెల, భీమిని, కన్నెపల్లి మండలాలతోపాటు కుమురంభీం ఆసిఫాబాద్ జిల్లా పరిధిలో ఉన్న తిర్యాణి, రెబ్బెన, దహెగాం మండలాల రోగులు కూడా ఇక్కడికి వచ్చి చికిత్స తీసుకుని వెళ్తుంటారు. రోడ్డు, రైల్వే మార్గం ఉండడంతో సహజంగానే రోగుల సంఖ్య పెరుగుతోంది. అప్‌గ్రేడ్‌తో.. ఆరోగ్య కేంద్రం 100 పడకలకు అప్‌గ్రేడ్ కానుండడంతో వైద్యులు, సిబ్బంది పోస్టులు పెరగనున్నాయి. కనీసం 15 మంది వరకు వైద్యులు, 60కి పైగా అన్ని రకాల సిబ్బంది నియామకం కానున్నారు. వీరి నియామకంతో ఇకపై మంచిర్యాల జిల్లా ఆసుపత్రికి కొన్ని రోగాలకు తప్పా దాదాపు అన్ని రకాల రోగాలకు బెల్లంపల్లిలోనే వైద్యం అందనుంది. హెల్త్ సెంటర్‌కు విశాలమైన ఖాళీ స్థలం కలిసొచ్చే అంశం. అధునాతనంగా ఆసుపత్రిని నిర్మించడానికి అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. ప్రస్తుతం హెల్త్ సెంటర్ ఆవరణలో వైద్యులు, సిబ్బంది కోసం నిర్మించిన క్వార్టర్లు వినియోగంలో లేకుండా వృథాగా ఉంటున్నాయి. అప్‌గ్రేడ్ అయ్యాక వీటిని వినియోగించుకునే అవకాశాలు లేకపోలేదు.హెల్త్ సెంటర్ ప్రాంగణంలో దాదాపు 15 ఎకరాల వరకు ఖాళీ భూమి ఉండడం వల్ల భవిష్యత్‌లో ఆసుపత్రికి మరింత ప్రయోజనం కలుగనుంది. సీఎం సంతకం చేశారు.. బెల్లంపల్లి కమ్యూనిటీ హెల్త్ సెంటర్‌ను అప్‌గ్రేడ్ చేయడానికి సీఎం కేసీఆర్ సంబంధిత ఫైలుపై సంతకం చేశారు. ఇందుకు సంబంధించిన జీవో వారం రోజుల్లోగా అధికారికంగా వెలువడే అవకాశాలు ఉన్నాయి. హెల్త్ సెంటర్‌ను అప్‌గ్రేడ్ చేయాలని పలుమార్లు సీఎం దృష్టికి తీసుకెళ్లడంతో సానుకూలంగా స్పందించి నిర్ణయం తీసుకున్నారు. సముచిత నిర్ణయం తీసుకున్న సీఎంకు కృతజ్ఞతలు తెలుపుతున్నాం. – ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య, బెల్లంపల్లి -
ఈ–‘ఐ’తో గ్రామీణులకు ఉచితకంటి వైద్యపరీక్షలు
పూతలపట్టు : ముఖ్యమంత్రి ఈ–‘ఐ’ ద్వారా గ్రామీణ ప్రజలకు ఉచిత కంటి పరీక్షలు నిర్వహిస్తామని డీఎం అండ్ హెచ్ఓ విజయగౌరి తెలిపారు. గురువారం మండలంలోని పి.కొత్తకోట సీహెచ్‌సీలో ముఖ్యమంత్రి ఈ–ఐ కేంద్రాన్ని ఆమె ప్రారంభించారు. ఈ కేంద్రంలో ప్రజలకు ఉచిత కంటి వైద్య పరీక్షలు చేసి... ఆ ఇమేజ్ను చెన్నై అపోలో హాస్పిటల్‌కు మెయిల్ చేస్తామని చెప్పారు. అక్కడ కంటివైద్యులు పరిశీలిస్తారని, అవసరమైన వారికి ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఉచితంగా కంటి ఆపరేషన్లు చేయిస్తామని తెలిపారు. కళ్లజోడు అవసరమైతే 20 సంవత్సరాలలోపు యువకులకు ఏడాదికి 2 జతలు, ఆపైన వయసు ఉన్నవారికి ఏడాది ఒక జత అందిస్తామని చెప్పారు. జిల్లాలో గురువారం 115 సెంటర్లు ప్రారంభించామని తెలిపారు. ఆపరేషన్ థియేటర్లో సౌకర్యాలపై అసంతృప్తి సీహెచ్‌సీ ఆవరణను డీఎం అండ్ హెచ్ఓ తనిఖీ చేశారు. ఆఫీసు గదిలో దుమ్ము, దూళి ఉండడంతో అసంతృప్తి వ్యక్తం చేశారు. అనంతరం ఆపరేషన్ ధియేటర్ను పరిశీలించారు. మందులు, ఆపరేషన్ కిట్లు తనిఖీచేసి వైద్యసిబ్బందిపై అసహనం వ్యక్తం చేశారు. గర్భవతుల పరీక్షలపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. కాన్పుల సమయంలో జాగ్రత్తలు వహించి నాణ్యమైన మందులు తగిన సౌకర్యాలు కల్పించాలన్నారు. కాలం చెల్లిన మందులు ఉపయోగించరాద ని, ఎప్పుటికప్పుడు మందులు, ఇంజెక్షన్లు తనిఖీ చేయాలని డాక్టర్లకు సూచించారు. డాక్టర్లు శ్రీనివాసులు, ప్రసాద్ రెడ్డి, లీల, జోత్స్న, కంటి టెక్నీషియన్ ధర్మారెడ్డి, ఏఎన్ఎంలు పాల్గొన్నారు. -
అటకెక్కిన ‘దక్షత’
► ఉమ్మడి జిల్లాలో 25 కేంద్రాలు ఎంపిక ► అమలుకు నోచుకోని కార్యక్రమం మాతాశిశు మరణాలు తగ్గించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన దక్షత కార్యక్రమం అటకెక్కింది. మరణాలను కనీస స్థాయికి తగ్గించాలనే లక్ష్యంతో ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన ప్రభుత్వం పైలెట్ ప్రాజెక్టు కింద రాష్ట్ర వ్యాప్తంగా 200 ఏరియా సీహెచ్‌సీ, పీహెచ్‌సీలను ఎంపిక చేసింది. ఇందులో ఉమ్మడి జిల్లా నుంచి 25 కేంద్రాలు ఎంపికయ్యాయి. ఇందుకోసం నలుగురు సిబ్బందికి శిక్షణ కూడా ఇచ్చారు. వీరి ఆధ్వర్యంలో అమలు కావల్సిన దక్షత కార్యక్రమం ఆరంభంలోనే కనుమరుగైంది. – ఉట్నూర్ ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్రుల్లో ప్రస్తుతం 90 శాతం ప్రసవాలు జరుగుతుండగా అందులో 10శాతం మాత్రమే ప్రభుత్వ ఆస్పత్రుల్లో జరుగుతున్నాయని ప్రభుత్వం తేల్చింది. ప్రభుత్వ ఆస్పత్రుల్లో ప్రసవాల సంఖ్య పెంచుతూ మాతాశిశు మరణాలను కనీస స్థాయికి తగ్గించాలని నిర్ణయించింది. ఇందుకోసం ప్రభుత్వ ఆస్పత్రుల్లో గర్భిణులు ప్రసవ సమయంలో నాణ్యమైన వైద్యంతోపాటు మెరుగైన సదుపాయాలు అందించాలనే ఆశయంతో దక్షత అనే నూతన కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. దీనిని పక్కాగా అమలు చేయడం ద్వారా ప్రభుత్వ ఆస్పత్రుల్లో ప్రసవాలు పది శాతం నుంచి 50 శాతం పెరగడంతోపాటు మాతాశిశు మరణాలు గణనీయంగా తగ్గించవచ్చని అంచనా వేసింది. ప్రస్తుతం ప్రతీ లక్షా ప్రసవాల్లో 78 మాతాశిశు మరణాలు సంభవిస్తున్నాయని, నవజాత శిశువుల్లో ప్రతీ వెయ్యిమందిలో 28 మంది మృత్యువాత పడుతున్నారని ప్రభుత్వం గుర్తించింది. ఈ పరిస్థితి జిల్లాలోని ఏజెన్సీ ప్రాంతాల్లో ఎక్కువగా ఉందని అధికారులు కూడా ప్రభుత్వానికి నివేదిక పంపారు. దక్షత లక్ష్యాలివి.. ప్రసవ సమయంలో ప్రధానంగా నాలుగు రకాల సమస్యలతో తల్లులు మృత్యువాత పడుతున్నట్లు గుర్తించారు. ప్రసవ సమయంలో అధిక రక్తస్రావం, బీపీ పెరిగి ఫిట్స్ రావడం, మధ్యలో ప్రసవం ఆగిపోవడం, నవజాత శిశువుల్లో ఊపిరితిత్తుల్లో శ్వాసకోస సమస్య, నెలలు నిండకుండానే జననం తదితర ఇన్ఫెక్షన్ల వల్ల మాతాశిశు మరణాలు సంభవిస్తున్నాయని గుర్తించిన ప్రభుత్వం వీటిని నివారించేందుకు మెరుగైన వైద్యంతోపాటు సదుపాయాలు కల్పిస్తూ పూర్తి స్థాయిలో శిక్షణ పొందిన వారితో వైద్యం అందించే ఏర్పాటు చేయాలని భావించింది. ఇందుకోసం ఉమ్మడి జిల్లాలో నలుగురు వైద్యశాఖ సిబ్బందికి దక్షత అమలుపై శిక్షణ ఇచ్చింది. ఉమ్మడి జిల్లాలో 25 కేంద్రాలు.. దక్షత కార్యక్రమంలో భాగంగా ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా పైలెట్ ప్రాజెక్టు కింద 25 ఆరోగ్య కేంద్రాలను ఎంపిక చేశారు. ఇందులో 8 సామాజిక ఆరోగ్య కేంద్రాలు, మూడు ఏరియా ఆస్పత్రులు, పదకొండు 24+7 ఆస్పత్రులు, రిమ్స్, ఒక్కొక్కటి చొప్పున పీహెచ్సీ, ఎంసీహెచ్‌లు ఉన్నాయి. వీటిలో రిమ్స్‌తోపాటు సామాజిక ఆరోగ్య కేంద్రాల్లో ఆసిఫాబాద్, బెల్లంపల్లి, చెన్నూర్, బోథ్, లక్సెట్టిపేట, ముథోల్, సిర్పూర్(టి), ఉట్నూర్, 24+7 ఆస్పత్రుల్లో వాంకిడి, కెరమెరి, జైనూర్, సిర్పూర్(యు), కాగజ్‌నగర్, గుడిహత్నుర్, బెజ్జూర్, కాసిపేట, కౌటాల, తాండూర్, భీమిని, ఏరియా ఆస్పత్రుల్లో భైంసా, ఖానాపూర్, మంచిర్యాల, ఎంసీహెచ్ నిర్మల్, ప్రాథమిక ఆరోగ్య కేంద్రం తిర్యాణిలను ఎంపిక చేశారు. ఆయా ఆరోగ్యకేంద్రాల్లో దక్షత కార్యక్రమం ద్వారా మాతాశిశు రక్షణకు ప్రత్యేక చర్యలు తీసుకునేలా ప్రణాళికలు సిద్ధం చేశారు. కాని ఇంత వరకు దీని అమలుపై అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంతో కార్యక్రమం కనుమరుగైంది. శిక్షణ పొందిన వారు ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా శిక్షణ కార్యక్రమాలు నిర్వహించాల్సి ఉండగా అక్కడక్కడ తప్ప పూర్తి స్థాయిలో నిర్వహించలేదని వైద్యశాధికారులు అంటున్నారు. ప్రభుత్వం మంచి ఆశయంతో దక్షతకు శ్రీకారం చుట్టినా అమలుపై దృష్టి సారించకపోవడంతో ఇది ప్రకటనకే పరిమితం అయిందనే విమర్శలు వెల్లువెత్తున్నాయి. దీనికి తోడు ఉమ్మడి జిల్లాలో ఏజెన్సీ ప్రాంతాల్లో మాతాశిశు మరణాలు సంభవిస్తున్నాయని ప్రభుత్వం ఇప్పటికైనా దక్షతను పూర్తి స్థాయిలో అమలు చేసి మరణాలు అరికట్టేలా చర్యలు తీసుకోవాలని జిల్లావాసులు కోరుతున్నారు. -
రాజాం సీహెచ్‌సీకి ఏ గ్రేడ్
రాజాం రూరల్: రోగులకు సకాలంలో సరైన వైద్య సేవలు అందించడంలో రాజాం సామాజిక ఆస్పత్రి(సీహెచ్‌సీ) జిల్లాలోనే ఏ గ్రేడ్ సాధించిందని డీసీహెచ్ఎస్ డాక్టర్ సూర్యారావు తెలిపారు. పాలకొండ ఏరియా ఆస్పత్రి, రాజాం సీహెచ్‌సీలను మంగళవారం ఆయన ఆకస్మికంగా సందర్శించారు. రాజాం సీహెచ్‌సీ పరిశీలన అనంతరం స్థానిక విలేకరులతో మాట్లాడారు. అంకిత భావంతో సేవలు అందించడంలో, ఆస్పత్రిని శుభ్రంగా ఉంచడంలో, సాధారణ ప్రసవాలు, ఆపరేషన్ డెలివరీలు చేయడంలో, ఇతరత్రా సాధారణ శస్త్ర చికిత్సలు, ఎన్టీఆర్ ఆరోగ్యశ్రీ శస్త్ర చికిత్సలు జరపడంలో జిల్లాలోనే అన్ని ఆస్పత్రుల కన్నా రాజాం సీహెచ్‌సీ ముందంజలో ఉందని తెలిపారు. ప్రతీ నెలా 160కు తక్కువ లేకుండా ప్రసవాలు చేస్తున్నారని, మరో 100 వరకూ సాధారణ శస్త్ర చికిత్సలు చేస్తున్నారని చెప్పారు. ఆయనతో పాటు ఆస్పత్రి సూపరింటెండెంట్ గార రవిప్రసాద్, డిప్యూటీ సివిల్ సర్జన్ మహంతి చంద్రశేఖర్‌నాయుడు, డాక్టర్ శ్రీనివాసరావు, హెడ్ సిస్టర్ సోఫియా, ఫార్మసిస్ట్ రాజశేఖర్ తదితరులు ఉన్నారు. -
చినమేరంగి సీహెచ్‌సీలో పసికందు కన్నుమూత
జియ్యమ్మవలస : మండలంలోని చినమేరంగి సీహెచ్‌సీలో పసికందు మరణించిన సంఘటన సోమవారం చోటు చేసుకుంది. వివరాలు ఇలా ఉన్నాయి. మండలంలోని చినబుడ్డిడి గ్రామానికి చెందిన తుమరాడ గోవిందమ్మ కుమార్తె రామలక్ష్మికి శ్రీకాకుళం జిల్లా వీరఘట్టాం నడిమికెల్ల గ్రామానికి చెందిన వ్యక్తితో వివాహం జరిపించారు. ప్రస్తుతం ఆమె ఏడో గర్భిణి కావడంతో కన్నవారిళ్లైన చినబుడ్డిడికి వచ్చింది. మెుదట్లో గర్భిణిని పార్వతీపురంలో ఉన్న వందన హాస్పటల్‌కు తీసుకెళ్లగా వైద్య పరీక్షలు నిర్వహించి అక్టోబర్ 16కి డెలివరీ డేట్ ఇచ్చారు. అయితే సోమవారం ఉదయం ఒక్కసారిగా పురిటినొప్పులు రావడంతో రామలక్ష్మిని తల్లి గోవిందమ్మ చినమేరంగి పీహెచ్‌సీకి 108లో తీసుకెళ్లింది. వెంటనే వైద్యాధికారి శ్రీకాంత్ వైద్యపరీక్షలు నిర్వహించగా, మత శిశువు జన్మించింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఆలస్యం అయితే తల్లి ప్రాణాలకే ముప్పు ఏర్పడేదన్నారు. ఇదిలా ఉంటే మాతా,శిశు మరణాల రేటు తగ్గించడానికి కషి చేస్తున్నామని అధికారులు చెబుతున్నారే తప్ప వాస్తవంలో అమలు కావడం లేదని పలువురు అసంతప్తి వ్యక్తం చేస్తున్నారు. గర్భిణికి క్రమంతప్పకుండా వైద్యపరీక్షలు చేపట్టకపోవడం వల్లే ఈ పరిస్థితి ఏర్పడిందని వాపోతున్నారు. -
నైపుణ్యం పెంచుకోవాలి
వైద్య శాఖ సిబ్బందికి ఏడీఎంహెచ్ఓ సూచన ఎంజీఎం : సీహెచ్‌సీ, పీ హెచ్సీల్లో పనిచేస్తున్న కమ్యూనిటీ హెల్త్ సెంటర్ ఆర్గనైజర్లు, హెల్త్ ఎడ్యుకేటర్లు, ఆరోగ్య విస్తరణాధికారులు వృత్తిలో నైపుణ్యం మెరుగుపరచుకోవాలని అడిషనల్ డీఎంహెచ్ఓ శ్రీరాం సూచించారు. నగరంలోని డీఎంహెచ్ఓ కార్యాలయంలో వై ద్యారోగ్య శాఖలోని పలు పథకాల నిర్వహణపై శుక్రవారం సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీరాం మాట్లాడుతూ.. ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి సంబంధించిన పూర్తి సమాచారం అందుబాటులో ఉంచుకోవాలని, ఇతర ప్రభుత్వ విభాగాలతో సమన్వయంతో పనిచేయాలని అన్నారు. మాతా శిశు మరణాలు నమోౖ§ð నప్పుడు వైద్యాధికారి, ఇతర అధికారులు వాటి కారణాలను పూర్తిగా విశ్లిషించాలని సూచించారు. కేంద్రప్రభుత్వం ప్రవేశపెట్టిన కాయకల్ప్ కార్యక్రమంలో భాగంగా పీహెచ్సీ, సీహెచ్‌సీల్లో మౌలిక వసతుల ఏర్పాటు, సుందరీకరణ, మెరుగైన వైద్యసేవల వంటి అంశాలను పరిగణలోకి తీసుకుని అక్టోబర్ 2న అవార్డులు ఇస్తామని ప్రకటించారు. దీనిపై శనివారం ఐఎంఏ హాల్లో వైద్యాధికారులకు వర్క్‌షాప్ నిర్వహిస్తామని తెలిపారు. సమావేశంలో మాస్ మీడియా అధికారి అశోక్‌రెడ్డి, స్టాటిస్టికల్ అధికారి కాంతారావు, డిప్యూటీ డెమోలు నాగరాజు, స్వరూపరాణి పాల్గొన్నారు. -
ఎన్ఆర్హెచ్ఎం నిధులకు గ్రహణం
ఉట్నూర్, న్యూస్‌లైన్ : పీహెచ్సీ, సీహెచ్‌సీ, ఏరియా ఆస్పత్రుల్లో సమస్యలు రాజ్యమేలుతున్నాయి. ప్రతి ఆర్థిక సంవత్సరం ఎన్ఆర్హెచ్ఎం(జాతీయ గ్రామీణ ఆరోగ్య మిషన్) విడుదల చేసే నిధులకు గ్రహణం పట్టడమే అందుకు కారణం. 2013-14 ఆర్థిక సంవత్సరం ముగిసి నాలుగు నెలలు కావస్తున్నా నిధుల విడదల జాడ లేదు. మాతృ శిశు మరణాలను కనీస స్థాయికి తగ్గించేందుకు కేంద్ర ప్రభుత్వం 2005లో ఎన్ఆర్హెచ్ఎంకు శ్రీకారం చుట్టింది. జిల్లాలోని ప్రతీ పీహెచ్‌సీకి రూ.1.75లక్షలు, సీహెచ్‌సీకి రెండు లక్షలు, ఏరియా ఆస్పత్రులకు రూ.ఐదు లక్షల చొప్పున కేటాయిస్తుంది. వీటిని ఆస్పత్రుల్లో మౌలిక వసతుల కల్పన, వైద్యశిబిరాలు, రోగుల తరలింపు, అత్యవసర మందుల కొనుగోళ్లకు వెచ్చించాల్సి ఉంటుంది. 2013-14 ఆర్థిక సంవత్సరం నిధుల విడుదల కోసం ఆయా వైద్య కేంద్రాలు ఎదురు చూస్తున్నాయి. జిల్లా వ్యాప్తంగా 72 పీహెచ్‌సీలకు గాను ఏజెన్సీలోని గిరిజన ప్రాంతాల్లో 31 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలున్నాయి. వీటికి సుమారు రూ.1.26 కోట్లు విడుదల కావాల్సి ఉండగా.. రూ.54.25 లక్షలు ఏజెన్సీ పీహెచ్‌సీలకు విడుదల కావాలి. ఉట్నూర్, లక్సెట్టిపేట, బోథ్, ఆసిఫాబాద్, ఖానాపూర్, బెల్లంపల్లి, ముథోల్, సిర్పూర్(టి) సామాజిక ఆస్పత్రులకు రూ.రెండు లక్షల చొప్పున, నిర్మల్, మంచిర్యాల, భైంసా ఏరియా ఆస్పత్రులకు రూ.5లక్షల చొపుపన విడుదల కావాల్సి ఉంది. జిల్లాలోని 469 సబ్‌సెంటర్లకు అన్‌టైడ్ ఫండ్స్ రూ.పది వేల చొప్పున రూ.46.90లక్షలు విడుదలకు నోచుకొలేదు. ఏజెన్సీలో పలు పీహెచ్‌సీల్లో కిటికీలు, నీటి సమస్యలు, మరుగుదొడ్లు తదితర సమస్యలు తాండవం చేస్తున్నాయి. నిధులు విడుదల కాక సమస్యలు పరిష్కారానికి నోచుకోవడం లేదు. అత్యవసర మందులు లేక వైద్యం కోసం వచ్చేవారిని బయటే కొనుక్కోవాలని చెప్పాల్సిన పరిస్థితి నెలకొంది. మరోవైపు ఏజెన్సీలోని గిరిజనులు గ్రామాల్లో జ్వరాలు, అతిసార తదితర వ్యాధులతో సతమతం అవుతున్నారు. సర్కారు ఆస్పత్రుల్లో మందుల్లేక.. ప్రైవేటు వైద్యం చేయించుకునే స్థోమత లేక దేవుడిపై భారం వేసి మృత్యు ఒడికి చేరుతున్నారు. యూసీ ఖర్చులు, వసతుల నివేదికలు సంబంధిత ఆస్పతులు సకాలంలో పంపించకపోవడంతోనే నిధుల విడుదలలో జాప్యమైనట్లు తెలుస్తోంది. ఈ విషయమై జిల్లా ఏజెన్సీ అదనపు వైద్యాధికారి ప్రభాకర్‌రెడ్డిని సంప్రదించగా.. నిధులు విడుదల కాలేదని స్పష్టం చేశారు. పూర్తి స్థాయిలో నివేదికలు పంపించాలని వైద్యాధికారులకు ఆదేశాలు జారీ చేసినట్లు చెప్పారు. నిధులు విడుదలయ్యేలా చర్యలు చేపట్టామని తెలిపారు. -
హజ్ యాత్రకు ‘రూపాయి’ దెబ్బ!
దుబాయ్: అంతర్జాతీయ మార్కెట్లో రూపాయి మారకపు విలువ పతనం ప్రభావం పవిత్ర హజ్ యాత్రపైనా పడింది. దీనికితోడు మక్కాలో ఈ ఏడాది హజ్ యాత్రికులకు మౌలిక వసతుల ఏర్పాట్ల ఖర్చు కూడా పెరగడంతో యాత్ర వ్యయం భారీగా పెరిగింది. ఈ కారణంగా ఈ ఏడాది ఇప్పటికే వందలాది మంది భారత ముస్లింలు హజ్‌ను రద్దు చేసుకున్నట్లు దుబాయ్‌కు చెందిన అరబ్ న్యూస్ తెలిపింది. ఆంధ్రప్రదేశ్ నుంచి సెంట్రల్ హజ్ కమిటీ (సీహెచ్‌సీ) ద్వారా యాత్రకు ఎంపికైన 400 మంది యాత్రికులు యాత్రను రద్దు చేసుకున్నట్లు చెప్పింది. భారత్ నుంచి ఈ ఏడాది మొత్తం 1,36,020 మంది యాత్రికులు హజ్ యాత్రకు వెళ్లాల్సి ఉంది. యాత్రికులకు మక్కాలో రెండు రకాల వసతి సౌకర్యం ఉంది. చవకైన అజీజియా ఒకటికాగా ఖరీదైన గ్రీన్ కేటగిరీ మరొకటి. అజీజియా విభాగం కింద గత ఏడాది యాత్రికులు ఒక్కొక్కరూ రూ. 1,36,264 చెల్లించగా ఈసారి ఆ ఖర్చు 1,49,450కి పెరిగింది. అలాగే గ్రీన్ కేటగిరీలో గత ఏడాది రూ. 1,64,905 ఉండగా ఈసారి అది రూ.1,79,800కు పెరిగింది. మరోవైపు సబ్సిడీ విమాన ప్రయాణ చార్జీలు కూడా భారీగా పెరిగాయి. గత ఏడాది ఎయిర్ ఇండియా రూ. 20 వేలు వసూలు చేయగా ఈ ఏడాది ఆ చార్జీ రూ. 28 వేలకు పెరిగింది.