చనిపోయిన పసికందు
చినమేరంగి సీహెచ్‌సీలో పసికందు కన్నుమూత
Published Tue, Sep 20 2016 12:19 AM | Last Updated on Mon, Sep 4 2017 2:08 PM
జియ్యమ్మవలస : మండలంలోని చినమేరంగి సీహెచ్‌సీలో పసికందు మరణించిన సంఘటన సోమవారం చోటు చేసుకుంది. వివరాలు ఇలా ఉన్నాయి. మండలంలోని చినబుడ్డిడి గ్రామానికి చెందిన తుమరాడ గోవిందమ్మ కుమార్తె రామలక్ష్మికి శ్రీకాకుళం జిల్లా వీరఘట్టాం నడిమికెల్ల గ్రామానికి చెందిన వ్యక్తితో వివాహం జరిపించారు. ప్రస్తుతం ఆమె ఏడో గర్భిణి కావడంతో కన్నవారిళ్లైన చినబుడ్డిడికి వచ్చింది. మెుదట్లో గర్భిణిని పార్వతీపురంలో ఉన్న వందన హాస్పటల్‌కు తీసుకెళ్లగా వైద్య పరీక్షలు నిర్వహించి అక్టోబర్ 16కి డెలివరీ డేట్ ఇచ్చారు. అయితే సోమవారం ఉదయం ఒక్కసారిగా పురిటినొప్పులు రావడంతో రామలక్ష్మిని తల్లి గోవిందమ్మ చినమేరంగి పీహెచ్‌సీకి 108లో తీసుకెళ్లింది. వెంటనే వైద్యాధికారి శ్రీకాంత్ వైద్యపరీక్షలు నిర్వహించగా, మత శిశువు జన్మించింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఆలస్యం అయితే తల్లి ప్రాణాలకే ముప్పు ఏర్పడేదన్నారు. ఇదిలా ఉంటే మాతా,శిశు మరణాల రేటు తగ్గించడానికి కషి చేస్తున్నామని అధికారులు చెబుతున్నారే తప్ప వాస్తవంలో అమలు కావడం లేదని పలువురు అసంతప్తి వ్యక్తం చేస్తున్నారు. గర్భిణికి క్రమంతప్పకుండా వైద్యపరీక్షలు చేపట్టకపోవడం వల్లే ఈ పరిస్థితి ఏర్పడిందని వాపోతున్నారు.
Advertisement