అబ్బాయి.. అమ్మాయి.. ఓ నాన్న! | amaram akhilam prema first look | Sakshi
Sakshi News home page

అబ్బాయి.. అమ్మాయి.. ఓ నాన్న!

Published Wed, Feb 15 2017 11:37 PM | Last Updated on Tue, Sep 5 2017 3:48 AM

అబ్బాయి.. అమ్మాయి.. ఓ నాన్న!

అబ్బాయి.. అమ్మాయి.. ఓ నాన్న!

ఈ సృష్టిలో మరణం లేనిది ప్రేమ ఒక్కటే. ఈ విశ్వమంతా వ్యాపించి ఉన్నది ప్రేమ ఒక్కటే. అంతులేని ఆ అనుభూతిని ‘అమరం అఖిలం ప్రేమ’గా ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు కొత్త దర్శకుడు జోనాధన్‌ ఎడ్‌. విజయ్‌రామ్, శివశక్తి సచ్‌దేవ్‌ జంటగా ఆయన దర్శత్వంలో వీఈవీకేడీఎస్‌ ప్రసాద్‌ నిర్మిస్తున్న చిత్రం ‘అమరం అఖిలం ప్రేమ’. ప్రేమికుల రోజున ఫస్ట్‌ లుక్‌ విడుదల చేశారు. ‘‘ఇదొక.. అమ్మాయి కథ, అబ్బాయి కథ, నాన్న కథ. అందర్నీ కలిపే స్వచ్ఛమైన ప్రేమకథ. వేసవిలో చిత్రాన్ని విడుదల చేస్తాం’’ అన్నారు నిర్మాత. సీనియర్‌ నరేశ్, అన్నపూర్ణమ్మ, శ్రీకాంత్‌ అయ్యంగార్, పార్వతి నటిస్తున్న ఈ చిత్రానికి కూర్పు: అమర్‌రెడ్డి, కళ: రామకృష్ణ, మాటలు: విస్సా శ్రీకాంత్‌నాయుడు, కెమేరా: రసూల్‌ ఎల్లోర్, సంగీతం: రథన్‌.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement