amaram akhilam prema
-
టైటిల్ నాకు బాగా నచ్చింది
విజయ్‌రామ్, శివశక్తి సచ్దేవ్ జంటగా జోనాథన్ ఎడ్వర్డ్ దర్శకత్వంలో వీఈవీకేడీఎస్ ప్రసాద్ నిర్మించిన చిత్రం ‘అమరం అఖిలం ప్రేమ’. ‘ప్రేమించటం అంటే ప్రేమిస్తూనే ఉండటం’ అనేది ఉపశీర్షిక. ఈ చిత్రం టీజర్‌ను ప్రముఖ దర్శకులు సుకుమార్, కొరటాల శివ ఆవిష్కరించారు. ‘‘అమరం అఖిలం ప్రేమ’ టైటిల్ నాకు బాగా నచ్చింది. ప్రసాద్‌గారు నిర్మాతగా సక్సెస్ కావాలి’’ అన్నారు కొరటాల శివ. ‘‘ప్రసాద్, నేను లెక్చరర్స్‌గా కలిసి పనిచేశాం. ఆయన ఈ సినిమాతో నిర్మాతగా మారడం చాలా సంతోషంగా ఉంది. ఆర్టిస్టుగా బాగా పెర్ఫార్మ్ చేయగలిగితే, హీరోగా చేయడానికి అంత కన్నా పెద్ద లక్షణం అవసరం లేదు. అది విజయ్‌రామ్‌లో చూశాను. జోనాథన్ తీసిన ఓ షార్ట్ ఫిల్మ్ చూసి స్ఫూర్తి పొందాను. జోనాథన్ మంచి ప్రతిభ ఉన్న దర్శకుడు. ఈ సినిమాకు శ్రీకాంత్ మంచి డైలాగ్స్ రాశాడు. అల్లు అర్జున్‌తో నేను తెరకెక్కిస్తున్న సినిమాకు శ్రీకాంత్ మాటలు రాస్తున్నాడు’’ అన్నారు. ‘‘సుకుమార్‌గారు లేకుంటే ఈ సినిమా ప్రారంభం అయ్యేది కాదు. ప్రసాద్‌గారు సహనశీలి’’ అన్నారు జోనాథన్. ‘‘చిన్న సినిమా, పెద్ద సినిమా అనే తేడా లేదు. ఆడిన సినిమా పెద్ద సినిమా అవుతుంది. విజయ్‌రామ్ హీరోగా సక్సెస్ కావాలని కోరుకుంటున్నాను’’ అన్నారు నిర్మాత ప్రసాద్. కెమెరామెన్ రసూల్ ఎల్లోర్, సంగీత దర్శకుడు రధన్, దర్శకుడు హరి ప్రసాద్ జక్కా, మాటల రచయిత శ్రీకాంత్ విస్సా తదితరులు పాల్గొన్నారు. -
అబ్బాయి.. అమ్మాయి.. ఓ నాన్న!
ఈ సృష్టిలో మరణం లేనిది ప్రేమ ఒక్కటే. ఈ విశ్వమంతా వ్యాపించి ఉన్నది ప్రేమ ఒక్కటే. అంతులేని ఆ అనుభూతిని ‘అమరం అఖిలం ప్రేమ’గా ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు కొత్త దర్శకుడు జోనాధన్ ఎడ్. విజయ్‌రామ్, శివశక్తి సచ్దేవ్ జంటగా ఆయన దర్శత్వంలో వీఈవీకేడీఎస్ ప్రసాద్ నిర్మిస్తున్న చిత్రం ‘అమరం అఖిలం ప్రేమ’. ప్రేమికుల రోజున ఫస్ట్ లుక్ విడుదల చేశారు. ‘‘ఇదొక.. అమ్మాయి కథ, అబ్బాయి కథ, నాన్న కథ. అందర్నీ కలిపే స్వచ్ఛమైన ప్రేమకథ. వేసవిలో చిత్రాన్ని విడుదల చేస్తాం’’ అన్నారు నిర్మాత. సీనియర్ నరేశ్, అన్నపూర్ణమ్మ, శ్రీకాంత్ అయ్యంగార్, పార్వతి నటిస్తున్న ఈ చిత్రానికి కూర్పు: అమర్‌రెడ్డి, కళ: రామకృష్ణ, మాటలు: విస్సా శ్రీకాంత్‌నాయుడు, కెమేరా: రసూల్ ఎల్లోర్, సంగీతం: రథన్. -
అమరం.. అఖిలం.. ప్రేమ!
ప్రేమ ఎప్పుడూ కొత్తగానే ఉంటుంది. ప్రతి సినిమాలోనూ తప్పకుండా ఉంటుంది కూడా. అయితే.. ప్రేమను సరికొత్తగా చూపడంలో దర్శకుడు సుకుమార్‌ది ప్రత్యేకమైన శైలి. కథ అందించడంతో పాటు నిర్మించిన ‘కుమారి 21ఎఫ్’, దర్శకత్వం వహించిన ‘ఆర్య’, ‘100% లవ్’ చిత్రాలు సుకుమార్ శైలిని స్పష్టం చేశాయి. ఇప్పుడాయన అందరూ కొత్తవాళ్లతో ఓ ప్రేమకథా చిత్రం నిర్మిస్తున్నారు. సుకుమార్ దగ్గర కో-డెరైక్టర్‌గా పనిచేసిన జనార్థన్ దర్శకుడిగా పరిచయమవుతున్న ఈ చిత్రానికి ‘అమరం.. అఖిలం.. ప్రేమ’ అనే టైటిల్ ఖరారు చేశారట! ఈ చిత్రానికి ‘అందాల రాక్షసి’ ఫేమ్ రధన్ సంగీతం అందిస్తున్నారు.