
బాలీవుడ్ ‘బిగ్ బీ’ అమితాబ్‌బచ్చన్‌ను ఒకప్పుడు దక్షిణాది చిత్రాల్లో నటింపజేయడానికి చాలా మంది ప్రయత్నించారు. కానీ అవేవీ సక్సెస్ కాలేదు. అలాంటిది లేట్ వయసులో ఆయనిప్పుడు దక్షిణాదిపై దృష్టి సారించడం విశేషం. ప్రస్తుతం అమితాబ్ తెలుగులో చిరంజీవి, నయనతార జంటగా నటిస్తున్న సైరా నరసింహారెడ్డి చిత్రంలో ఒక కీలక పాత్ర పోషిస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా కోలీవుడ్‌లో కూడా ఆయన ఎంట్రీ ఖరారైనట్లు సమాచారం.
విలక్షణ దర్శకుడు, నటుడు ఎస్‌జే.సూర్య కథానాయకుడిగా నటించబోతున్న ‘ఉయర్నద మణిదన్’ చిత్రంలో అమితాబ్‌బచ్చన్ ఒక ప్రధాన పాత్రను పోషించడానికి అంగీకరించారనే వార్తలు వినిపిస్తున్నాయి. అంతే కాదు ఆ చిత్రం కోసం ఆయన ఏకంగా 40 రోజులు కాల్‌షీట్స్ కేటాయించినట్లు సమాచారం. గతంలో ఎస్‌జే.సూర్య హీరోగా నటించిన ‘కల్వనిన్ కాదలి’ చిత్రాన్ని తెరకెక్కించిన తమిళ్‌వాననే ఈ క్రేజీ చిత్రానికి దర్శకత్వం వహించనున్నారు.
Comments
Please login to add a commentAdd a comment