మెగాస్టార్ చిరంజీవి స్వతంత్ర్య పోరాట యోధుడిగా చేస్తున్న సైరా చిత్రం అన్ని కార్యక్రమాలకు పూర్తి చేసుకుని విడుదలకు సిద్దంగా ఉంది. ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కుతున్న ఈ మూవీపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. ప్యాన్‌ఇండియన్ మూవీగా అత్యధిక స్క్రీన్స్‌పై ఈ చిత్రాన్ని రిలీజ్ చేసేందుకు సిద్దమవుతున్నారు.
జాతీయ స్థాయిలో అత్యంత భారీ ఎత్తున విడుదల చేస్తున్న ఈ మూవీ ప్రమోషన్ కార్యక్రమాలను చేపట్టింది చిత్రయూనిట్. ఈ క్రమంలో చిరు ముంబై వెళ్లిన సంగతి తెలిసిందే. ఇక చెన్నై, బెంగళూరులోకూడా ప్రమోషన్ కార్యక్రమాల జోరు పెంచారు. అయితే ముంబై వెళ్లిన చిరును, అమితాబ్‌తో కలిపి ఫర్హాన్ అక్తర్ ఓ ఇంటర్వ్యూ చేశారు. ఈ ఇంటర్వ్యూలో ఇరువురు పలు ఆసక్తికర సంఘటలను వెల్లడించారు.
చిరంజీవి రాజకీయాల్లోకి వెళ్తానని చెప్పినప్పుడు తాను వద్దని వారించినా.. తన మాట వినలేదని అమితాబ్ చెప్పుకొచ్చాడు. అమితాబ్ చెబితే వినలేదు.. వెళ్లాను.. బాధపడ్డానంటూ చిరు బదులిచ్చాడు. ఇదే సలహాను రజనీకాంత్‌కు కూడా ఇచ్చాను కానీ ఆయన కూడా వినలేదంటూ అమితాబ్ వెల్లడించాడు. బిగ్‌బీ అమితాబ్, విజయ్ సేతుపతి, కిచ్చా సుదీప్, నయన తార, తమన్నా, జగపతి బాబు లాంటి భారీ తారాగణంతో తెరకెక్కిన ఈ చిత్రం అక్టోబర్ 2న ప్రేక్షకుల ముందుకు రానుంది.
Comments
Please login to add a commentAdd a comment