సైరా ప్రమోషన్స్‌.. ముంబై వెళ్లిన చిరు | Chiranjeevi Went To Mumbai To Promote Sye Raa Movie | Sakshi
Sakshi News home page

సైరా ప్రమోషన్స్‌.. ముంబై వెళ్లిన చిరు

Published Fri, Sep 27 2019 7:43 PM | Last Updated on Fri, Sep 27 2019 8:01 PM

Chiranjeevi Went To Mumbai To Promote Sye Raa Movie - Sakshi

తొలి స్వతంత్ర్య యోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి.. జీవిత చరిత్ర ఆధారంగా సైరా నరసింహారెడ్డి తెరకెక్కింది. మెగాస్టార్‌ చిరంజీవి హీరోగా అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న ఈ మూవీని రామ్‌చరణ్‌ నిర్మించారు. ఇప్పటికే రిలీజ్‌ చేసిన టీజర్‌, ట్రైలర్స్‌, సాంగ్‌తో సినిమాపై మంచి హైప్‌ క్రియేట్‌ అయింది. తాజాగా ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ను ఘనంగా నిర్వహించారు.

ఈ మూవీ ప్రమోషన్స్‌ పెంచే కార్యక్రమంలో భాగంగా.. చిరు ముంబైకి వెళ్లారు. ఈ క్రమంలో అమితాబ్‌, ఫర్హాన్‌ అక్తర్‌, చిరంజీవి కలిసి దిగిన ఫోటో ప్రస్తుతం వైరల్‌ అవుతోంది. సురేందర్‌రెడ్డి దర్శకత్వంలో బిగ్‌ బీ అమితాబ్‌, కిచ్చా సుదీప్‌, విజయ్‌ సేతుపతి, జగపతి బాబు, అనుష్క, తమన్నా, నయనతారలాంటి భారీ తారాగణంతో తెరకెక్కించిన ఈ చిత్రం  ఈ చిత్రం తెలుగు, తమిళ, మళయాల, కన్నడ హిందీ భాషల్లో అక్టోబర్‌ 2న విడుదల కానుంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement