
అమితాబ్ బచ్చన్
మెగాస్టార్ చిరంజీవి హీరోగా తెరకెక్కుతున్న ప్రతిష్టాత్మక చిత్రం సైరా నరసింహారెడ్డి. భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న ఈ చారిత్రక చిత్రంలో పరభాషా నటులు కూడా చాలా మంది కనిపించనున్నారు. ముఖ్యంగా బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ ఈ సినిమాలో కీలక పాత్రలో నటిస్తున్నాడంటూ చిత్రయూనిట్ ప్రకటించారు. అయితే కొద్ది రోజులుగా ఈ ప్రాజెక్ట్ నుంచి అమితాబ్ తప్పుకున్నాడన్న వార్తలు వినిపించాయి.
ఇప్పటికే సినిమాటోగ్రాఫర్‌తో పాటు సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్ ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పుకోవటంతో బిగ్ బి కూడా తప్పకున్నారన్న వార్తలు మరింతగా వినిపించాయి. అయితే ఈ రూమర్స్‌కు చెక్ పెడుతూ సైరా షూటింగ్‌లో బిగ్ బి పాల్గొంటున్నారు. ఈ మేరకు అమితాబ్‌తో కలిసి దిగిన ఫొటోను తన సోషల్ మీడియా పేజ్‌లో షేర్ చేశాడు దర్శకుడు సురేందర్ రెడ్డి. ఈ సినిమాలో అమితాబ్ నరసింహారెడ్డి గురువు గోసాయి వెంకన్న పాత్రలో కనింపించనున్నారు. చిరంజీవి టైటిల్ రోల్ పోషిస్తున్న ఈ సినిమాలో నయనతార హీరోయిన్‌గా నటిస్తుండగా జగపతి బాబు, విజయ్ సేతుపతి, సుధీప్‌లు ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment