రిద్దికుమార్, విరాజ్ జె. అశ్విన్
ప్రముఖ నిర్మాత డీవీఎస్ రాజు అల్లుడు కేఎల్‌ఎన్ రాజు 30 ఏళ్లుగా సినీ ఫైనాన్షియర్‌గా ఉన్నారు. తొలిసారి ఆయన నిర్మించిన చిత్రం ‘అనగనగా ఓ ప్రేమకథ’. డైరెక్టర్ ఎన్. శంకర్ వద్ద అసోసియేట్‌గా పని చేసిన టి.ప్రతాప్ ఈ చిత్రంతో దర్శకునిగా మారారు. ఎడిటర్ మార్తాండ్ కె.వెంకటేష్ మేనల్లుడు విరాజ్ జె.అశ్విన్ హీరోగా, రిద్దికుమార్, రాధా బంగారు హీరోయిన్లుగా పరిచయమవుతున్నారు. థౌజండ్ లైట్స్ మీడియా పతాకంపై తెరకెక్కిన ఈ చిత్రం నిర్మాణానంతర కార్యక్రమాలు జరుపుకుంటోంది. తొలి ప్రచార చిత్రాన్ని శుక్రవారం హీరో వరుణ్ తేజ్ విడుదల చేశారు.
కే ఎల్‌ఎన్ రాజు మాట్లాడుతూ– ‘‘ఓ మంచి కథతో రూపొందిన చిత్రమిది. అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకునేలా ఉంటుంది. అక్టోబర్‌లో మా సినిమాను రిలీజ్ చేయాలనుకుంటున్నాం’’ అన్నారు. ‘‘కేఎల్‌ఎన్ రాజుగారు బ్యానర్ స్థాపించి, మొదటి సినిమాకి దర్శకుడిగా నాకు అవకాశం ఇవ్వడం చాలా ఆనందంగా ఉంది’’ అన్నారు ప్రతాప్. విరాజ్ జె.అశ్విన్ పాల్గొన్నారు. కాశీ విశ్వనాథ్, అనీష్ కురువిళ్ల, వేణు తదితరులు నటించిన ఈ చిత్రానికి సంగీతం: కె.సి.అంజన్, కెమెరా: ఎదురొలు రాజు.
Comments
Please login to add a commentAdd a comment