ఆ సినిమాలో రొమాంటిక్‌ పాత్ర కాదట! | Anasuya on Her Character in Vijay Devarakonda And Tharun Bhascker Movie | Sakshi
Sakshi News home page

Published Wed, Jan 30 2019 7:25 PM | Last Updated on Wed, Jan 30 2019 8:09 PM

Anasuya on Her Character in Vijay Devarakonda And Tharun Bhascker Movie - Sakshi

సెన్సేషనల్‌ స్టార్‌ విజయ్‌ దేవరకొండ తనకు మొదటి బ్లాక్‌ బస్టర్‌హిట్‌ను ఇచ్చిన ‘పెళ్లిచూపులు’ డైరెక్టర్‌ను హీరోగా పరిచయం చేయబోతోన్న సంగతి తెలిసిందే. నాలుగు పాత్రల చుట్టూ తిరిగే ఈ కథలో ఓ పాత్రలో తరుణ్‌ భాస్కర్‌ను మరో పాత్రకు అనసూయను తీసుకున్నారు. ఈ చిత్రంలో అనసూయ రొమాంటిక్‌ పాత్రలో నటించనున్నట్లు రూమర్స్‌ వినిపించాయి. అయితే ఈ వార్తలను ఖండిస్తూ.. తన పాత్ర గురించి అనసూయ చెప్పుకొచ్చారు.

ఈ విషయంపై అనసూయను మీడియా ప్రశ్నించగా.. ఆ చిత్రంలో తనది రొమాంటిక్‌ పాత్ర కాదని, ఓ ముఖ్య మైన పాత్రను పోషిస్తున్నాని, ఆ క్యారెక్టర్‌ తనకు మంచి గుర్తింపును తీసుకువస్తుందన్నారు. ఈ చిత్రం సెట్స్‌పైకి వెళ్లిన తరువాత మిగతా వివరాలను ప్రకటిస్తానని తెలిపారు. అనసూయ ప్రస్తుతం ‘కథనం’ సినిమాతో బిజీగా ఉన్నారు. ఈ మూవీ విడుదలకు సిద్దంగాఉంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement