ప్రామిస్‌.. మీ అందరినీ ఎంటర్‌టైన్‌ చేస్తా: శ్రీముఖి | Anchor Srimukhi Posted Video on Twitter | Sakshi
Sakshi News home page

ప్రామిస్‌.. మీ అందరినీ ఎంటర్‌టైన్‌ చేస్తా: శ్రీముఖి

Published Mon, Jul 22 2019 11:13 AM | Last Updated on Fri, Jul 26 2019 7:20 PM

Anchor Srimukhi Posted Video on Twitter - Sakshi

పదమూడో కంటెస్టెంట్‌గా బిగ్‌బాస్‌ హౌస్‌లోకి ప్రముఖ యాంకర్‌ శ్రీముఖి అడుగుపెట్టిన సంగతి తెలిసిందే. బిగ్‌బాస్‌లోకి వచ్చిరాగానే.. తన డ్యాన్సులతో అదరగొట్టారు శ్రీముఖి. తనకు కలిసి వచ్చిన రాములమ్మ స్టెప్పులతో హల్‌చల్‌ చేశారు. బిగ్‌బాస్‌లోకి ఎంట్రీ అయిన విషయాన్ని అఫీషియల్‌గా ప్రకటిస్తూ శ్రీముఖి ట్విటర్‌లో ఓ వీడియోను పోస్ట్‌ చేశారు. బిగ్‌బాస్‌ నిబంధనల వల్లే తాను ముందు ఈ విషయాన్ని అభిమానులకు చెప్పలేకపోయానని ఆమె వీడియోలో వివరించారు. 

‘మీ అందరితో ఈ విషయం షేర్‌ చేసుకోవడం చాలా హ్యాపీగా ఉంది. బిగ్‌బాస్‌-3కి వెళుతున్నారా? పార్టిసిపెంట్‌ చేస్తున్నారా? అని మీరందరూ అడిగారు. కానీ బిగ్‌బాస్‌ కండిషన్స్‌ వల్ల మేము ఆ విషయాన్ని ముందే చెప్పలేదు. ఈ వీడియో ప్లే అయ్యేసమయానికి ఎపిసోడ్‌ టెలిక్యాస్ట్‌ అయి ఉంటుంది కాబట్టి చెబుతున్నా. మీ అందరినీ బోలెడంతా ఎంటర్‌టైన్‌ చేస్తానని ప్రామిస్‌ చేస్తున్నాను. ఇప్పటివరకు ఎలాగైతే సపోర్ట్‌ చేస్తున్నారో ఇకముందు కూడా అలాగే ఆదరించాలి’ అని శ్రీముఖి ఈ వీడియోలో తన ఫ్యాన్స్‌కు అపీల్‌ చేశారు. 

అక్కినేని నాగార్జున హోస్ట్‌గా ఆదివారం ప్రారంభమైన బిగ్‌బాస్‌-3 గేమ్‌లో మొత్తం 15 మంది కంటెస్టెంట్స్‌ పాల్గొంటున్న సంగతి తెలిసిందే. ఈ గేమ్‌ షోలో ప్రముఖ యాంకర్‌ సావిత్రి(శివ జ్యోతి), సీరియల్‌ ఆర్టిస్ట్‌ రవికృష్ణ, డబ్‌ స్మాష్‌ స్టార్‌ అషూ రెడ్డి, జర్నలిస్ట్‌ జాఫర్‌, నటి  హిమజ, సింగర్‌ రాహుల్‌ సిప్లిగంజ్‌, టీవీ నటి రోహిణి, కొరియోగ్రాఫర్‌ బాబా భాస్కర్‌, ఉయ్యాల జంపాల ఫేమ్‌ పునర్ణవి భూపాలం, ప్రముఖ నటి హేమ, నటుడు అలీ రెజా, యూట్యూబ్‌ స్టార్‌ కమెడియన్‌ మహేష్‌ విట్టా, యాంకర్‌ శ్రీముఖి, సినీ దంపతులు వరుణ్‌ సందేశ్‌, వితికా షేరు కంటెస్టెంట్స్‌గా పాల్గొంటున్నారు.
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement