బికినీ షాట్తో మంచి ఓపెనింగ్స్ వస్తాయట!! | Anil kapoor 'open-minded' about Sonam kapoor bikini shot | Sakshi
Sakshi News home page

బికినీ షాట్తో మంచి ఓపెనింగ్స్ వస్తాయట!!

Published Sat, Mar 1 2014 12:37 PM | Last Updated on Sat, Sep 2 2017 4:14 AM

బికినీ షాట్తో మంచి ఓపెనింగ్స్ వస్తాయట!!

బికినీ షాట్తో మంచి ఓపెనింగ్స్ వస్తాయట!!

బేవకూఫియా అనే తాజా చిత్రంలో సోనమ్ కపూర్ టూ పీస్ బికినీ వేసుకుని ఓ దృశ్యంలో నటించింది. దీని గురించి అందరూ అమ్మో అనుకున్నారు గానీ.. ఆమె తండ్రి అనిల్ కపూర్ మాత్రం ఏమంత ఆశ్చర్యపోలేదట. పైపెచ్చు, ఈ దృశ్యం వల్ల సినిమాకు మంచి ఓపెనింగ్స్ వస్తాయని చెబుతున్నాడట. ''మా నాన్నకు బికినీ షాట్ గురించి తెలుసు. ఆయన కూడా నటుడే. ఆయన హృదయం చాలా విశాలమైనది. అసలు నన్ను సినిమాల గురించి ప్రోత్సహించింది ఆయనే. అందువల్ల బికినీ షాట్ గురించి ఏమీ అనలేదు'' అని సోనమ్ చెప్పింది. సినిమాకు సంబంధించిన ప్రమోషన్ కార్యక్రమంలో ఆమె మాట్లాడింది.

మంచి పొడగరి అయిన సోనమ్ కపూర్.. ఒకప్పుడు చాలా లావుగా, బరువుగా ఉండేది. కానీ ఇప్పుడు టూ పీస్ బికినీ వేసుకోడానికి తగినంత సన్నగా, రివటలా తయారైంది. తాను ఎప్పటికప్పుడు బరువు పెరగడం, తగ్గడం చేస్తూనే ఉంటానని, ఇందుకోసం ప్రత్యేకంగా కష్టపడేది ఏమీ లేదని తెలిపింది. పైపెచ్చు ఈ సినిమాలో తాను సాధారణ అమ్మాయిగానే కనిపిస్తాను తప్ప ప్రత్యేకంగా ఉండనని చెప్పింది. ఈ సినిమాకు సంతకం చేసేటప్పుడే బికినీ గురించి తెలుసని, ఎటూ సన్నగానే ఉన్నాను కాబట్టి, సరే అన్నానని సోనమ్ తెలిపింది. ధూమ్, రేస్ లాంటి సినిమాల్లో అయితే హీరోయిన్ల శరీరం మీదే కెమెరా కళ్లు ఉంటాయని, ఇందులో అలా ఉండదని చెప్పింది. నూపుర్ ఆస్థానా దర్శకత్వం వహించిన ఈ సినిమాలో ఆయుష్మాన్ ఖురానా కూడా నటించాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement