నాగ్ బ్యానర్లో మరో సినిమా | Annapurna Studios Second movie with Raj Tarun | Sakshi
Sakshi News home page

నాగ్ బ్యానర్లో మరో సినిమా

Published Sat, Nov 19 2016 12:01 PM | Last Updated on Mon, Jul 15 2019 9:21 PM

నాగ్ బ్యానర్లో మరో సినిమా - Sakshi

నాగ్ బ్యానర్లో మరో సినిమా

సీనియర్ హీరో నాగార్జున, దర్శకులను సాంకేతిక నిపుణులను మాత్రమే కాదు.. ఇటీవల తన బ్యానర్లో హీరోలను కూడా పరిచయం చేస్తున్నాడు. అలా నాగ్ బ్యానర్ అన్నపూర్ణ స్టూడియోస్ ద్వారా పరిచయం అయిన యంగ్ హీరో రాజ్ తరుణ్. ఉయ్యాల జంపాల సినిమాతో హీరోగా పరిచయం అయిన రాజ్ తరుణ్. ఆ సినిమా సమయంలోనే అదే బ్యానర్లో మరో సినిమా చేయడానికి అంగీకరించాడు. అయితే ఇన్నాళ్లు సరైన కథ దొరక్క ఆ ప్రాజెక్ట్ వాయిదా పడుతూ వచ్చింది.

తాజాగా రాజ్ తరుణ్, అన్నపూర్ణ స్టూడియోస్లో తన రెండో సినిమాకు ఓకె చెప్పాడు. ఈ సినిమాతో రంజని అనే మహిళా దర్శకురాలు ఇండస్ట్రీకి పరిచయం అవుతోంది. ప్రస్తుతం నటీనటుల ఎంపిక జరుగుతున్న ఈ సినిమా డిసెంబర్ 1న లాంచనంగా ప్రారంభించనున్నారు. రాజ్ తరుణ్ హీరోగా నటిస్తున్న రాజుగాడు సినిమా రిలీజ్కు రెడీ అవ్వగా, అందగాడు, కిట్టు ఉన్నాడు జాగ్రత్త సినిమాలు షూటింగ్ దశలో ఉన్నాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement