
మరో గౌరవం
నటిగా, దర్శకురాలిగా, నిర్మాతగా తెలుగు చిత్రసీమకు విశేష సేవలు అందించిన విజయనిర్మల కీర్తి కిరీటంలో మరో కలికితురాయి చేరింది. అత్యధిక (46) చిత్రాలకు దర్శకత్వం వహించిన మహిళగా గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డ్స్‌కి ఎక్కిన ఆమెకు గౌరవ డాక్టరేట్ దక్కింది, ‘ద రాయల్ అకాడమీ ఆఫ్ గ్లోబల్ పీస్, యూకే’ సంస్థ మలేసియాలోని కౌలాలంపూర్‌లో గౌరవ డాక్టరేట్‌ను అందజేసింది.