రుద్రమతో ఆడిపాడుతున్న నిత్యామీనన్, కేథరిన్
రుద్రమతో ఆడిపాడుతున్న నిత్యామీనన్, కేథరిన్
Published Tue, Oct 22 2013 1:03 AM | Last Updated on Fri, Sep 1 2017 11:50 PM
రాణీరుద్రమ వీరత్వం గురించి తెలియని వారు తెలుగునేలపై లేరు. కానీ రుద్రమలో అంతర్గ తంగా దాగున్న కళలెన్నో. చరిత్రను అధ్యయనం చేసిన కొందరికే వాటి గురించి తెలు స్తుంది. ఆ కొందరిలో ఇప్పుడు గుణశేఖర్ కూడా ఒకరు. కాకతీయ ప్రాభవాన్ని ప్రపంచానికి చాటిచెప్పిన వీరనారి రాణీరుద్రమదేవి చరిత్రను ఆకళింపు చేసుకొని దాన్ని వెండితెరపై అద్భుతంగా ఆవిష్కరిస్తున్నారాయన. కదనరంగంలోనే కాదు, కళారంగంలోనూ రుద్రమ దిట్టేనని, కత్తి పట్టినా.. కాళ్లకు గజ్జె కట్టినా... రుద్రమకు సాటి రుద్రమేనని తన సినిమా ద్వారా తెలియజేయనున్నారు గుణశేఖర్.
‘రుద్రమదేవి’గా అనుష్క నటిస్తున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం అన్నపూర్ణ ఏడెకరాల్లో వేసిన భారీ అంతఃపురం సెట్‌లో అనుష్కపై ఓ గీతాన్ని తెరకెక్కిస్తున్నారు గుణశేఖర్. ఈ పాటలో అనుష్కతో పాటు నిత్యామీనన్, కేథరిన్ కూడా నర్తిస్తుండటం విశేషం. గత మూడు రోజులుగా ఈ పాట చిత్రీకరణ జరుగుతోంది. ఇందులో గోనగన్నారెడ్డి ప్రియురాలిగా కేథరిన్ నటిస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం. గోనగన్నారెడ్డి పాత్రలో సూపర్‌స్టార్ మహేష్ నటిస్తున్నట్లు అప్పట్లో వార్తలు వినిపించాయి. అదే నిజమైతే కేథరిన్ చాలా లక్కీ అన్నమాటే. మరి ఇందులో నిత్యామీనన్ పోషిస్తున్న పాత్ర ఏంటో తెలియాల్సి ఉంది.
రానా, కృష్ణంరాజు, సుమన్, ప్రకాష్‌రాజ్, బాబా సెహగల్, నథాలియా కౌర్, జరాషా, హంసానందిని, మధుమిత కీలక పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రంలో బ్రహ్మానందం, తనికెళ్ల భరణి, ధర్మవరపు సుబ్రమణ్యం, ఆదిత్య మీనన్, జయప్రకాష్‌రెడ్డి, అతిథి చంగప్ప, అజయ్, ఆహుతి ప్రసాద్, కృష్ణభగవాన్, ఎల్బీశ్రీరామ్, వేణుమాధవ్, వెన్నెల కిషోర్, బ్రహ్మాజీ తదితరులు ఇతర పాత్రధారులు. ఈ చిత్రానికి మాటలు: పరుచూరి బ్రదర్స్, కెమెరా: అజయ్ విన్సెంట్, పాటలు: సిరివెన్నెల సీతారామశాస్త్రి, ఎడిటింగ్: శ్రీకర్‌ప్రసాద్, కాస్ట్యూమ్ డిజైనర్: నీతాలుల్లా (‘జోథా అక్బర్’ ఫేం), ఎగ్జిక్యూటివ్ నిర్మాత: కె.రామ్‌గోపాల్, నిర్మాణం: గుణా టీమ్ వర్క్స్.
Advertisement