ఎందుకంత తొందర!
‘మీరెప్పుడు తీపి కబురు చెబుతారు?’ – ఇటీవల తరచూ అనుష్కా శర్మకి ఈ ప్రశ్న ఎదురవుతోంది. తీపి కబురు అంటే పెళ్లి గురించి అనుకునేరు, కాదండీ బాబు! సినిమాల గురించే. హిందీ హీరోయిన్లందరూ ఒక్కొక్కరుగా హాలీవుడ్‌కి వెళ్తున్న సంగతి తెలిసిందే. మరి, బాలీవుడ్ టాప్ హీరోయిన్లలో ఒకరైన అనుష్కా శర్మ ఇంగ్లీష్ సినిమా చేసేదెప్పుడు? అనడిగితే – ‘‘నాకంత తొందర లేదు. హాలీవుడ్‌లో నటించాలనే దిశగా ఆలోచించడం లేదు.
ఇంగ్లీష్, కొరియన్, జపనీస్ లేదా మన ప్రాంతీయ సినిమాలు... ఎవరైనా ఎక్కడైనా నటించవచ్చు. అయితే... నేను ఓ సినిమాకి సంతకం చేసే ముందు నటిగా నా ప్రతిభను ఆ సినిమా ఎంత వరకూ వెలికి తీస్తుంది? నా పాత్ర ఆసక్తిగా ఉందా? లేదా? అనే అంశాలు ఆలోచిస్తా. మంచి కథ, పాత్ర లభిస్తే హాలీవుడ్‌కి వెళ్లడానికి నాకేమీ అభ్యంతరం లేదు’’ అన్నారు.