షాకయ్యా! | Anushka Sharma Lashes Out At A News Publication For Forging An Interview With The Actress | Sakshi
Sakshi News home page

షాకయ్యా!

Published Sat, Mar 10 2018 12:38 AM | Last Updated on Wed, Apr 3 2019 6:23 PM

Anushka Sharma Lashes Out At A News Publication For Forging An Interview With The Actress - Sakshi

అనుష్కా శర్మ

‘‘నాతో ఎవరూ మాట్లాడలేదు. ఏ ప్రశ్నలకూ నేను సమాధానాలు చెప్పలేదు. కానీ నేను చెప్పినట్లుగా ఆర్టికల్‌ వచ్చింది. చదివి షాకయ్యాను’’ అన్నారు బాలీవుడ్‌ బ్యూటీ అనుష్కా శర్మ. అసలు విషయానికొస్తే.. అనుష్కా శర్మ చెప్పినట్లుగా ఆమె వ్యక్తిగత విషయాల గురించి న్యూస్‌ ఆర్టికల్స్‌ వచ్చాయి. దీంతో ఆమె తెగ ఫీలైపోయారు.

ఆ ఆర్టికల్స్‌ గురించి ఆమె చెబుతూ– ‘‘నా గురించి పూర్తిగా కల్పించి రాసిన వార్తలు చూసి షాకయ్యాను. నా వ్యక్తిగత విషయాల గురించి ఎవ్వరికీ ఏమీ చెప్పలేదు. ఏ ఇంటర్వ్యూ ఇవ్వలేదు. ఇలా ఒకరి పర్సనల్‌ లైఫ్‌ ఫ్రీడమ్‌.. ఇంకొకకరి వల్ల డిస్ట్రబ్‌ అవ్వడం సరికాదేమో. సెన్సేషన్‌ కోసం ఇవ్వని ఇంటర్వ్యూని ఇచ్చినట్లుగా రాయడం సబబు కాదు’’ అని అన్నారు. ప్రస్తుతం ‘సూయి ధాగా, సంజు, జీరో’ చిత్రాల్లో నటిస్తున్నారామె.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement