
ముంబై: ఒకవైపు ఐపీఎల్ మ్యాచ్‌లకు హాజరవుతూ భర్త విరాట్ కోహ్లిని ఎంకరేజ్ చేస్తోన్న అనుష్క శర్మ.. మరోవైపు షూటింగ్స్‌ను కూడా చక్కగా మేనేజ్ చేసుకుంటున్నారు. ప్రస్తుతం ఆమె వరుణ్ ధావన్‌తో కలిసి ‘సుయీ ధాగా’ (సూదీ-దారం) సినిమాలో నటిస్తున్నారు. భరత్ కఠారియా దర్శకత్వం వహిస్తోన్న ఈ సినిమా 2018 సెప్టెంబర్‌లో విడుదలకానుంది. కాగా, అనుష్క వృద్ధురాలిగా కనిపించే తాజా లుక్ ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆమె గత చిత్రం ‘పరీ’లో భయానక రూపం కూడా ఇదే మాదిరిగా అభిమానులను ఆకట్టుకుంది. అయితే, ఇప్పటి వృధ్ధురాలి వేషం ‘సూయీ ధాగా’కు సంబంధించిందా, లేక వేరేదైనా వాణిజ్య ప్రకటన కోసం వేసిందా అన్నది తెలియాల్సిఉంది. మేకప్ ఆర్టిస్టులు అనుష్కను తయారుచేస్తుండగా తీసిన ఈ ఫొటోపై నెటిజన్లు రకరకాలుగా కామెంట్లు చేస్తున్నారు. ‘మిసెస్ కోహ్లి.. ఏమిటీ వేషం? ఏ క్యారెక్టర్?’ తరహాలో..!
Comments
Please login to add a commentAdd a comment