
‘సైజ్ జీరో’తో అనుష్కకు పంచ్ పడింది! అవును... ‘సైజ్ జీరో’నే! ఆమెను కుదురుగా కూర్చోనివ్వలేదు... సరిగా నిలబడనివ్వలేదు. అందరి నోళ్లలో నానేలా చేసింది! ‘సైజ్ జీరో’ కోసం అనుష్క బరువు పెరగడం ఓ వార్త అయితే... తర్వాత ఆమె ఏం చేసినా... ఎన్ని చేసినా... బరువు తగ్గడం లేదనే అంశంపై బోల్డన్ని పుకార్లు. ఏకంగా ‘బాహుబలి–2’లో గ్రాఫిక్స్ ద్వారా ఆమెను సన్నగా చూపించారని కామెంట్ చేశారు కొందరు! ఇప్పుడు అనుష్క ప్రధాన పాత్రలో నటించిన ‘భాగమతి’ విడుదలకు సిద్ధమవుతున్న టైమ్‌లో మళ్లీ అటువంటి కామెంట్లు వస్తున్నాయి. ఈ వార్తలు అటు తిరిగి... ఇటు తిరిగి... అనుష్క చెవిన పడ్డట్టున్నాయి. అటువంటి పుకార్లకు చెక్ పెట్టాలనుకున్నారో... ఏమో ... ఫేస్‌బుక్‌లో స్లిమ్ముగా ఉన్న ఫొటోను పోస్ట్ చేశారు. అంతటితో ఆగలేదు. ఫొటోతో పాటు ‘‘మాయలు, మంత్రాలతో కల సాకారం కాదు. చెమట చిందించాలి. అంకితభావంతో కల కోసం కృషి చేయాలి. బాగా కష్టపడాలి’’ అని పేర్కొన్నారు. పుకార్లకు చెక్ పెట్టడానికి ఈ పంచ్ వేశారంటున్నారు సినిమా జనాలు. పంచ్‌కు పంచ్ అన్నమాట.
Comments
Please login to add a commentAdd a comment