
మరో రెండు భారీ చిత్రాల్లో స్వీటీ
ఈ ఏడాది రెండు పెద్ద సినిమాలతో మంచి విజయాలు సాధించిన అనుష్క, వచ్చే సంవత్సరం కూడా అదే జోరు చూపించాలని భావిస్తోంది. బాహుబలి, రుద్రమదేవి సినిమాలతో బ్లాక్ బస్టర్ హిట్స్ సాధించిన ఈ బ్యూటి త్వరలో 'సైజ్జీరో'తో ఆకట్టుకునే ప్రయత్నం చేస్తోంది. ఇలా వరుసగా లేడి ఓరియంటెడ్ సినిమాలు చేస్తూ స్టార్ హీరోలకు గట్టిపోటి ఇస్తోంది.
ప్రస్తుతం బాహుబలి 2 తో పాటు సింగం 3 సినిమాల కోసం రెడీ అవుతున్న అనుష్క, ఆ రెండు సినిమాలు పూర్తవ్వగానే మరోసారి లేడి ఓరియంటెడ్ సినిమాల మీద దృష్టి పెట్టనుందట. ఇప్పటికే హైదరాబాద్ను ఏళిన కులీ కుతుబ్ షాహీల జీవిత కథ ఆధారంగా తెరకెక్కనున్న భాగమతి సినిమాలో టైటిల్ రోల్లో నటించడానికి అంగీకరించింది అనుష్క.
ఆ సినిమాతో పాటు దిల్ రాజు నిర్మించనున్న మరో సినిమాకు కూడా ఓకె చెప్పిందట స్వీటీ. ఇప్పటికే ఈ సినిమా స్టోరి కూడా ఫైనల్ చేసి యూనిట్ పూర్తి వివరాలను త్వరలోనే వెల్లడించనున్నారు. ఇలా వరుసగా లేడి ఓరియంటెడ్ సినిమాలను అంగీకరిస్తూ వస్తున్న అనుష్క త్వరలోనే రెమ్యూనరేషన్ విషయంలో కూడా స్టార్ హీరోలకు పోటి ఇచ్చే చాన్స్ ఉందంటున్నారు సినీ జనాలు.