హీరో నిఖిల్ కొత్త సినిమా ముహూర్తానికి అల్లు అర్హ ముఖ్య అతిథిగా హాజరవడం పట్ల ఆమె తండ్రి, స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ఆనందం వ్యక్తం చేశారు. ఓ సినిమాకు గెస్ట్‌గా వెళ్లడానికి తనకు 23 ఏళ్లు పడితే.. అర్హ మాత్రం చిన్న వయసులోనే అతిథిగా వెళ్లిందని హర్షం వ్యక్తం చేశారు. ఈమేరకు గురువారం ఆయన ట్వీటర్ వేదికగా తన ఆనందాన్ని వెలిబుచ్చాడు. ‘నిఖిల్ కొత్త సినిమాకు ఆల్ ది బెస్ట్. ఈ వయసులో ఓ సినిమాకు గెస్ట్‌గా వెళ్లడం అర్హ అదృష్టం. నేను ఒక సినిమాకు గెస్ట్‌గా వెళ్లడానికి 23 ఏళ్లు పట్టింది’ అని ఫన్నీగా అల్లు అర్జున్ ట్వీట్ చేశారు.
(చదవండి : నిఖిల్ చిత్రం: అతిథిగా బన్నీ కూతురు)
కాగా, అఖిల్ హీరోగా, అల్లు అరవింద్ సమర్పణలో జిఏ2 పిక్చర్స్ ,సుకుమార్ రైటింగ్స్ బ్యానర్స్ సంయుక్త నిర్మాణంలో బన్నీ వాసు నిర్మాతగా పల్నాటి సూర్య ప్రతాప్ దర్శకత్వంలో ‘18 పేజీస్’ అనే సినిమా తెరకెక్కనుంది. గురువారం (మార్చి 5) హైదరాబాద్ ఫిలింనగర్ దైవసన్నిధానంలో పూజాకార్యక్రమాలు జరిగాయి. (అర్హ అల్లరి మాములుగా లేదుగా..)
ఈ కార్యక్రమంలో నిఖిల్‌పై బేబి అల్లు అర్హ క్లాప్ నివ్వగా, నిర్మాత బన్నీ వాసు కుమార్తె బేబి హన్విక కెమెరా స్విచ్చాన్ చేసింది. ఈ సందర్భంగా తాతా మనవరాలు అర్హ, అరవింద్ సరాదాగా ముద్దులాడుకుంటూ సందడి చేశారు. ‘ అర్హ.. మా ముహుర్తం ఫంక్షన్ చీఫ్‌గెస్ట్’ అంటూ నిఖిల్ షేర్ చేసిన వీడియో నెటిజన్స్‌ను ఆకట్టుకుంటోంది.
All the Best for the new Movie @actor_Nikhil . N Arha is lucky to be the chief guest at this age ... it’s took me 23 years of age to be chief guest at a muhurtam 😂 https://t.co/YUzxSU8DQe
— Allu Arjun (@alluarjun) March 5, 2020
Comments
Please login to add a commentAdd a comment