బాహుబలి విలన్కు మరో ఆఫర్
చెన్నై: బ్లాక్ బస్టర్ మూవీ బాహుబలిలో విలన్గా కాలకేయ పాత్రలో నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్న నటుడు ప్రభాకర్ మలయాళ సినిమాల్లో తెరంగేట్రం చేయనున్నాడు. మోహన్ లాల్, పృథ్వీరాజ్ నటిస్తున్న ప్రాజెక్టులో ప్రభాకర్ విలన్గా నటించనున్నట్టు ఫిలిం యూనిట్ వర్గాలు తెలిపాయి.
ఇంకా పేరు నిర్ణయించని ఈ ప్రాజెక్టుకు బి.ఉన్నికృష్ణన్ దర్శకత్వం వహించనున్నట్టు ఓ జాతీయ వార్త ఏజెన్సీ తెలిపింది. ఈ ఏడాది చివర్లో ఈ సినిమా షూటింగ్ ప్రారంభంకానున్నట్టు సమాచారం. ఈ సినిమాకు పూర్తిస్థాయిలో నటీనటులను, సాంకేతిక బృందాన్ని ఎంపిక చేయాల్సివుంది.