
నందమూరి బాలకృష్ణ, మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను కాంబినేషన్‌లో సింహా, లెజెండ్ లాంటి భారీ హిట్లు వచ్చాయి. అప్పటి నుంచి ఈ కాంబినేషన్‌లో హ్యాట్రిక్ మూవీ కోసం అభిమానులు ఎదురుచూస్తున్నారు. బాలకృష్ణ వందో సినిమాకు బోయపాటి దర్శకత్వం వహిస్తారన్న ప్రచారం జరిగినా కుదరలేదు. తాజాగా మరోసారి ఈ కాంబినేషన్‌పై వార్తలు వినిపిస్తున్నాయి.
ప్రస్తుతం బాలకృష్ణ స్వీయ నిర్మాణంలో ఎన్టీఆర్ బయోపిక్‌లో నటిస్తున్నారు. ఈ సినిమా తరువాత బోయపాటి శ్రీను దర్శకత్వంలో సినిమా చేయాలని భావిస్తున్నారు. అంతేకాదు ఆ సినిమాను కూడా భారీ బడ్జెట్‌తో స్వయంగా నిర్మించాలని భావిస్తున్నారట. అయితే ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికలకు సమయం దగ్గర పడుతుండటంతో బోయపాటి సినిమాను వీలైనంత త్వరగా పూర్తి చేసే ఆలోచనలో ఉన్నాడు బాలకృష్ణ.
అందుకే బోయపాటి దర్శకత్వంలో తెరకెక్కబోయే సినిమాను కేవలం 70 రోజుల్లోనే పూర్తి చేయాలని భావిస్తున్నాడట. బోయపాటి శ్రీను లాంటి మాస్ దర్శకుడి సినిమా అంటే భారీ స్టార్ కాస్ట్‌తో పాటు అదేస్థాయిలో యాక్షన్ సీన్సూ ఉంటాయి. మరి 70 రోజుల్లో అంతా భారీ చిత్రం పూర్తి చేయటం సాధ్యమవుతుందా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ప్రస్తుతానికి చర్చల దశలో ఉన్న ఈ ప్రాజెక్ట్‌పై త్వరలోనే క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.
Comments
Please login to add a commentAdd a comment