బ్యాట్‌మ్యాన్, సూపర్ మ్యాన్...డిష్యుం.. డిష్యుం.. | 'Batman V Superman' Comic-Con Trailer Analysis | Sakshi
Sakshi News home page

బ్యాట్‌మ్యాన్, సూపర్ మ్యాన్...డిష్యుం.. డిష్యుం..

Published Sun, Jul 12 2015 11:02 PM | Last Updated on Sun, Sep 3 2017 5:23 AM

బ్యాట్‌మ్యాన్, సూపర్ మ్యాన్...డిష్యుం.. డిష్యుం..

బ్యాట్‌మ్యాన్, సూపర్ మ్యాన్...డిష్యుం.. డిష్యుం..

 బ్యాట్‌మ్యాన్... సూపర్ మ్యాన్... ఈ ఇద్దర్నీ ఇష్టపడనివాళ్లుండరు. విడి విడిగా వేరు వేరు చిత్రాల్లో ఆకట్టుకున్న ఈ రెండు పాత్రలూ ఒకే సినిమాలో కనిపిస్తే? ఇక ఫుల్ మజా అని ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ‘బ్యాట్‌మ్యాన్ వెర్సస్ సూపర్‌మ్యాన్’లో ఈ రెండు పాత్రలూ కనిపించనున్నాయి. బ్యాట్‌మ్యాన్‌గా బెన్ ఎఫ్లిక్,  సూపర్‌మ్యాన్‌గా హెన్రీ కావిల్ నటిస్తున్నారు. ఇటీవల ఈ చిత్రం ట్రైలర్‌ను విడుదల చేశారు. అందులో బ్యాట్‌మ్యాన్, సూపర్‌మ్యాన్ హోరాహోరీగా తలపడిన వైనం అందర్నీ విస్మయానికి గురి చేసింది. పైగా, నీవల్లే  ప్రపంచం నాశనమయ్యే పరిస్థితి వచ్చిందని ప్రజలందరూ సూపర్‌మ్యాన్‌ను దూషిస్తున్న దృశ్యం చర్చనీయాంశమైంది. మరి.. సూపర్ మ్యాన్ ఎందుకు నిందలపాలయ్యాడు? బ్యాట్‌మ్యాన్... సూపర్ మ్యాన్ మధ్య ఎందుకు శత్రుత్వం ఏర్పడింది? అనే ప్రశ్నలకు సమాధానం తెలియాలంటే వచ్చే ఏడాది వరకూ
 వెయిట్ చేయాల్సిందే.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement