
హరీష్ వినయ్, తనిష్క్ తివారి
హరీష్ వినయ్, తనిష్క్ తివారి జంటగా నటించిన చిత్రం ‘బైలంపుడి’. ‘ఇక్కడ యుద్ధం చేయాలి... గెలవడానికి కాదు.. బతకడానికి’’ అనేది ఉప శీర్షిక. ఈ చిత్రం ద్వారా అనిల్ పిజి రాజ్ దర్శకునిగా పరిచయం అవుతున్నారు. పారిశ్రామిక వేత్త బ్రహ్మానందరెడ్డి నిర్మించారు. ఈ చిత్రంలోని ‘పిల్లల దేవుడు...’ అనే సాంగ్‌ని బాలీవుడ్ హీరోయిన్ మైరా అమిథి విడుదల చేశారు.
బ్రహ్మానందరెడ్డి మాట్లాడుతూ– ‘‘పారిశ్రామికవేత్తగా ఉన్న నేను సినిమా మీద ఆసక్తితో తొలిసారి ‘బైలంపుడి’ చిత్రాన్ని నిర్మించా. గ్రామీణ నేపథ్యంలో తెరకెక్కిన చిత్రమిది. అందరూ కొత్తవారైనా చక్కగా నటించారు. త్వరలోనే సినిమా విడుదల చేస్తాం’’ అన్నారు. ‘‘కెమెరామేన్‌గా చాలా చిత్రాలకు వర్క్ చేశాను. దర్శకుడిగా ఇది తొలి సినిమా. ‘బైలంపుడి’ అనే గ్రామంలో జరిగే లవ్ అండ్ పొలిటికల్ చిత్రమిది’’ అన్నారు అనిల్ పిజి రాజ్.
Comments
Please login to add a commentAdd a comment