అప్పుడప్పుడు బాలీవుడ్ చిత్రాల్లో కూడా తళుక్కుమంటున్న దగ్గుబాటి రానా ఇప్పుడు బాలీవుడ్ నల్లకలువ బిపాసా బసుతో రొమాన్స్ చేయనున్నారు. ప్రముఖ ఫ్యాషన్ డిజైనర్గా ఉండి, తర్వాత దర్శకుడిగా మారిన విక్రమ్ ఫడ్నిస్ తాను రూపొందిస్తున్న కొత్త సినిమా 'నియా'లో వీళ్లిద్దరినీ హీరో హీరోయిన్లుగా తీసుకున్నారు. తన సినిమా జీవితాన్ని పండగలా చేసుకోవడం గురించే ఉంటుందని, రానా.. బిపాసాలు ఇంతకుముందు చేసిన 'దమ్ మారో దమ్' చిత్రంతో ఈ సినిమాకు ఎలాంటి సంబంధం లేదని విక్రమ్ ఫడ్నిస్ చెప్పారు.
విక్రమ్ ఫడ్నిస్ తీసిన మొదటి సినిమా అంతగా ఆడలేదు. అయితే.. తాను కేవలం డబ్బు కోసమే సినిమాలు తీయడంలేదని, వందకోట్ల క్లబ్బులో చేరకపోయినా తాను లక్ష్యపెట్టేది లేదని ఫడ్నిస్ అన్నారు. తాను స్క్రిప్టు రాసిన మాట వాస్తవమే గానీ, అసలు డైరెక్టర్ టోపీ పెట్టుకుంటానని మాత్రం ఎప్పుడూ భావించలేదన్నారు. మంచి సినిమా రాశానని, ఎవరైనా దర్శకత్వం వహిస్తారేమో అనుకున్నానని, కానీ ఎవరూ దాన్ని తాను అనుకున్నట్లు అర్థం చేసుకోకపోవడంతో తానే దర్శకత్వ బాధ్యతలు చేపట్టానని చెప్పారు. కొరియోగ్రాఫర్గా కెరీర్ మొదలుపెట్టి, ఫ్యాషన్ డిజైనర్గా మారి, ఇప్పుడు దర్శకుడైన ఫడ్నిస్.. తన జీవితయానం ఓ రోలర్ కోస్టర్ లాంటిదని అంటారు.
బిపాసా బసుతో రొమాన్స్ చేయనున్న రానా
Published Mon, Nov 10 2014 4:20 PM | Last Updated on Sat, Sep 2 2017 4:12 PM
Advertisement
Advertisement