బిచ్చగాడా మజాకా! | Bichagada Mazaka movie will be a bigger hit than Bichagadu | Sakshi
Sakshi News home page

బిచ్చగాడా మజాకా!

Published Tue, Mar 14 2017 12:28 AM | Last Updated on Tue, Sep 5 2017 5:59 AM

బిచ్చగాడా మజాకా!

బిచ్చగాడా మజాకా!

ఆల్‌ వెరైటీ మూవీ మేకర్స్‌ పతాకంపై కె.ఎస్‌. నాగేశ్వరరావు దర్శకత్వంలో నూతన నిర్మాత బి. చంద్రశేఖర్‌ నిర్మిస్తున్న చిత్రం ‘బిచ్చగాడా మజాకా’. అర్జున్, నేహాదేశ్‌ పాండే జంటగా నటిస్తున్నారు. నిర్మాత చంద్రశేఖర్‌ మాట్లాడుతూ – ‘‘మూడు పాటలు, రెండు ఫైట్స్‌ మినహా షూటింగ్‌ పూర్తయింది. మేలో విడుదల చేసేందుకు ప్రయత్నిస్తున్నాం’’ అన్నారు. దర్శకుడు మాట్లాడుతూ –‘‘ఓ కొత్త నిర్మాతను అందిస్తున్నందుకు గర్వంగా ఉంది.

 ‘బిచ్చగాడా మజాకా’ టైటిల్‌ వినగానే ఆశ్చర్యం అనిపించవచ్చు. సినిమా చూశాక ఈ టైటిలే యాప్ట్‌ అంటారు’’ అని చెప్పారు. ఈ చిత్రానికి సంగీతం: శ్రీవెంకట్, ఎడిటింగ్‌: మార్తాండ్‌.కె. వెంకటేష్, కెమెరా: అడుసుమల్లి విజయ్‌కుమార్, ఎగ్జిక్యూటివ్‌ నిర్మాత: ఎస్‌.కె రహమాన్, ఎస్‌.ఎమ్‌ భాషా, కథ–మాటలు–నిర్మాత: బి.చంద్రశేఖర్, స్క్రీన్‌ప్లే–దర్శకత్వం: కేయస్‌ నాగేశ్వరరావు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement