ఎవర్ గ్రీన్ బిగ్ బి!
ముంబై: బిగ్ బి అమితాబ్ బచ్చన్ మరోసారి ఎవర్ గ్రీన్ అనిపించుకున్నాడు. బాలీవుడ్ లో విలక్షణమైన నటనతో తనదైన ముద్ర వేసిన అమితాబ్.. ఇటు సోషల్ మీడియాలో కూడా దూసుకుపోతున్నాడు. ఈ విషయం తాజాగా అతని ఫేస్ బుక్ ఫోలోవర్స్ సంఖ్యను చూస్తే మనకు అర్ధమవుతుంది. ఏకంగా 18 మిలియన్లు(కోటి ఎనభై లక్షలు) మందికి పైగా అమితాబ్ ను ఫాలో అవుతున్నారంటే అది సామాన్యమైన విషయం కాదు. అమితాబ్ ఫాలోవర్స్ సంఖ్య అక్షరాలా ఒక కోటి ఎనభై లక్షల పద్దెనిమిది వేలట. ఈ విషయాన్ని అతనే స్వయంగా ట్విట్టర్ అకౌంట్ ద్వారా స్పష్టం చేశాడు.
ఇదిలా ఉండగా ట్విట్టర్ లో అమితాబ్ ను 90 లక్షల మందికి పైగా ఫాలో అవుతుండటం మరో విశేషం. ' సోషల్ మీడియాలో మీరంతా నాతో భాగస్వామ్యం అవుతున్నందుకు ధన్యవాదాలు' అని బిగ్ బి తన ఆనందాన్ని అభిమానులతో పంచుకున్నాడు .