ట్విట్టర్ కింగ్ బిగ్ బి! | Big B is the king of Twitter, says report | Sakshi
Sakshi News home page

ట్విట్టర్ కింగ్ బిగ్ బి!

Published Thu, Dec 18 2014 10:49 AM | Last Updated on Thu, Jul 26 2018 5:21 PM

ట్విట్టర్ కింగ్ బిగ్ బి! - Sakshi

ట్విట్టర్ కింగ్ బిగ్ బి!

కోల్ కతా :బాలీవుడ్ లో తనదైన ముద్రవేసిన బిగ్ బి అమితాబచ్చన్ ట్విట్టర్ వినియోగంలో కూడా కింగ్ అనిపించుకున్నాడు. మైక్రో బ్లాగింగ్ సైట్ ట్విట్టర్ లో విపరీతమైన పాపులారిటీని సంపాదించుకున్న అమితాబ్.. అంతే స్థాయిలో క్రీయాశీలక పాత్ర పోషిస్తూ ముందుకు దూసుకుపోతున్నాడు. ట్విట్టర్ 12 మిలియన్ల(కోటి 20 లక్షలు) ఫాలోవర్స్ ను కల్గిన ఉన్న అమితాబ్ కింగ్ ఆఫ్ ద ట్విట్టర్ గా నిలిచినట్లు తాజాగా విడుదల చేసిన నివేదికలో స్పష్టమైంది. 

 

ఇదిలా ఉండగా బాలీవుడ్ బాద్ షా షారుక్ ఖాన్ 10.4 మిలియన్లు(కోటి నలభై వేల ఫాలోవర్స్ తో రెండు స్థానంలో ఉండగా, అభిషేక్ బచ్చన్ 5.4 మిలియన్లు( యాభై లక్షల నలభై వేలు) ఫాలోవర్స్ తో మూడో స్థానంలో నిలిచాడు. ఫేస్ బుక్ లో కూడా అమితాబ్  కు విశేషమైన అభిమానులను సంపాదించుకున్నాడు. అమితాబ్ ఫేస్ బుక్ ఫాలోవర్స్ సంఖ్య అక్షరాలా కోటి ఎనభై లక్షలు ఉండటం గమనార్హం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement