మోదీ ట్వీట్ కు అత్యధిక షేర్లు | narendra Modi has highest retweets, Amitabh largest following in India | Sakshi
Sakshi News home page

మోదీ ట్వీట్ కు అత్యధిక షేర్లు

Dec 10 2014 9:57 PM | Updated on Aug 15 2018 2:20 PM

మోదీ ట్వీట్ కు అత్యధిక షేర్లు - Sakshi

మోదీ ట్వీట్ కు అత్యధిక షేర్లు

మైక్రోబ్లాగింగ్ సైట్ ట్వీటర్‌లో ప్రధాని నరేంద్ర మోదీ మరో రికార్డు సృష్టించారు.

న్యూఢిల్లీ: మైక్రోబ్లాగింగ్ సైట్ ట్విట్టర్ లో ప్రధాని నరేంద్ర మోదీ మరో రికార్డు సృష్టించారు. లోక్‌సభ ఎన్నికల్లో విజయం తర్వాత ట్విట్టర్ లో ఆయన చేసిన ట్వీట్‌ను దేశంలో అత్యధికంగా 70,515 మంది షేర్ చేశారు. ‘'భారత్ గెలిచింది. భారత్‌కు విజయం. ఇక మంచి రోజులు రాబోతున్నాయి'’ అంటూ మోదీ చేసిన ఈ ట్వీట్‌కు దేశంలో అత్యధిక  రీట్వీట్లు దక్కాయని బుధవారం ట్విట్టర్ వర్గాలు వెల్లడించాయి. ఇదిలా ఉండగా 'కిక్'  మూవీలో భాగంగా సల్మాన్ ఖాన్ పోస్ట్ చేసిన ట్వీట్.. 51,981 రీట్వీట్ లతో రెండో స్థానంలో నిలిచింది.

 

అటు ఫేస్ బుక్ 18 మిలియన్లు(కోటి ఎనభై లక్షలు) మందికి పైగా ఫోలోవర్స్ ను కలిగి ఉన్న అమితాబ్.. ట్విట్టర్ ఫోలోవర్స్ లో కూడా తనదైన ముద్రవేశారు. 90 లక్షల మంది ఫోలోవర్స్  ను సంపాదించుకున్న అమితాబ్ ..దేశంలో అత్యధిక ఫాలోవర్స్ తో అగ్రస్థానంలో కొనసాగుతున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all
Advertisement