బిగ్‌బాస్‌: లీకువీరుల కన్నా ముందే పసిగట్టారు! | Bigg Boss 3 Telugu: All Housemates Pack Their Bags, Any Twist | Sakshi
Sakshi News home page

కంటి మీద కునుకు లేకుండా చేస్తున్న బిగ్‌బాస్‌

Published Fri, Oct 25 2019 12:52 PM | Last Updated on Fri, Oct 25 2019 1:57 PM

Bigg Boss 3 Telugu: All Housemates Pack Their Bags, Any Twist - Sakshi

పద్నాలుగో వారం పూర్తయితే బిగ్‌బాస్‌ ఫైనల్‌కు వచ్చేసినట్లే.. అయితే దీనికన్నా ముందుగా ఎలిమినేషన్‌ ఉంది. ఈసారి రాహుల్‌ మినహాయిస్తే ఇంటి సభ్యులంతా ఎలిమినేషన్‌ జోన్‌లో ఉన్నారు. అయితే ఇంటి సభ్యులతో కొన్ని స్టంట్‌లు చేయిస్తూ.. వారిని సేఫ్‌ చేసుకోడానికి ప్రేక్షకులను ఓట్లు అడిగే అవకాశం కల్పించాడు. చివరి ఎలిమినేషన్‌ కావడంతో హౌస్‌మేట్స్‌ గుండెల్లో గుబులు మొదలైంది. ఇక తాజా ప్రోమోను చూసినట్టయితే బిగ్‌బాస్‌ ఇంటిసభ్యులకు కంటి మీద కునుకు లేకుండా చూస్తున్నారు. అందరూ పడుకున్న సమయంలో సైరన్‌ మోగించి వారిని నిద్రకు భంగం కలిగించాడు. ఉన్నపళంగా వారిని బ్యాగులు సర్దుకొని గార్డెన్‌ ఏరియాకు వెళ్లాల్సిందిగా ఆదేశించాడు.

అయితే ఇంత సడన్‌గా బ్యాగులను ఎందుకు సర్దుకోమన్నాడు. ఈ సారి భిన్నంగా రెండు రోజుల ముందే, నాగార్జున లేకుండానే ఎలిమినేషన్‌ ప్రక్రియను ప్రారంభించనున్నాడా అన్న ప్రశ్నలు వినిపిస్తున్నాయి. వీటన్నింటికీ సమాధానం దొరకాలంటే నేటి ఎపిసోడ్‌ వచ్చేంతవరకు వేచి చూడాల్సిందే. కాగా ఈసారి ఎలిమినేషన్‌ పూర్తయితే బిగ్‌బాస్‌ ఫైనల్‌ లెవల్‌కు వెళ్లనుంది. అయితే ఫైనల్‌కు వెళ్లేదెవరు అనేదానిపై ప్రేక్షకులు ఇప్పటికే ఓ అంచనాకు వచ్చారు. అందరినీ దాటేసి రాహుల్‌ ఫైనల్‌ బెర్తు ఖాయం చేసుకోగా శ్రీముఖి, వరుణ్‌, బాబా భాస్కర్‌, అలీ రెజా రేసులో ఉంటారని అభిప్రాయపడుతున్నారు. పాతాళ గంగ శివజ్యోతికి ఫైనల్‌కు వెళ్లే అవకాశాలు తక్కువగా ఉన్నట్టు తెలుస్తోంది. దీంతో ఈసారి లీకువీరుల కన్నా ముందుగా ప్రేక్షకులే శివజ్యోతి ఎలిమినేట్‌ అవుతుందని ఘంటాపథంగా చెప్తున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement