చిచ్చా గెలుపు.. ప్రతీకారం తీర్చుకుంటున్న ఫ్యాన్స్‌ | Bigg Boss 3 Telugu: Memes On Rahul Sipligunj First Finalist | Sakshi
Sakshi News home page

బిగ్‌బాస్‌: హీరోగా మారిన రాహుల్‌

Published Wed, Oct 23 2019 5:45 PM | Last Updated on Fri, Oct 25 2019 1:06 PM

Bigg Boss 3 Telugu: Memes On Rahul Sipligunj First Finalist - Sakshi

బిగ్‌బాస్‌ నామినేషన్‌ ప్రక్రియలో ‘టికెట్‌ టు ఫినాలే’ ట్విస్టులతో కొనసాగింది. ఇక ఇంటి సభ్యులు నువ్వా నేనా అన్న రీతిలో తలపడ్డప్పటికీ గెలుపు రాహుల్‌ సొంతం  అయింది. ఇది మిగతా ఇంటి సభ్యులకు మింగుడు పడటంలేదు. టాస్క్‌లు ఆడడు.. అన్న అపనింద తెచ్చుకున్న రాహుల్‌ ఈ దెబ్బతో తనేంటో నిరూపించుకున్నాడా! , అసలు ‘టికెట్‌ టు ఫినాలే’ రాహుల్‌కు పొరపాటున వచ్చిందా? ఈ గెలుపు కొద్దిపాటిదేనా, లేక అదే ఊపుతో టైటిల్‌ కొట్టేయడానికి పావులు కదుపుతాడా అన్నది చర్చనీయాంశంగా మారింది.

గేమ్‌లో అప్పటివరకూ ఆధిక్యతను కనబర్చిన అలీని.. టాప్‌ 5 అంటూ ఆటపట్టించిన ఇంటి సభ్యులకు రాహుల్‌ విజయంతో నోటమాట రాలేదు. ఈ గేమ్‌లో రాహుల్‌ ప్రదర్శన చూసినట్టయితే.. టాస్క్‌ ప్రారంభంలోనే అదృష్టం అతనికి కలిసొచ్చింది. అతను ఎంచుకున్న కార్డులో 50 శాతం అని రాసి ఉండగా దానితోనే ఆటను మొదలుపెట్టాడు. మొదటగా.. వరుణ్‌, రాహుల్‌ టాస్క్‌ ఆడాల్సి రాగా వాళ్లు కొట్టుకుంటున్నారేమో అన్నట్టుగా వీరోచితంగా పోరాడారు. కానీ విజయం రాహుల్‌నే వరించింది.

ఈ టాస్క్‌లో తన బ్యాగు కూడా రాహుల్‌కే ఇస్తూ వరుణ్‌ మరోసారి ఫ్రూట్‌ అని నాగార్జున చెప్పిన మాటలను నిజం చేశాడని సోషల్‌ మీడియాలో నెటిజన్లు కామెంట్‌లు చేస్తున్నారు. ఇక అలీ, బాబా ఆడిన పూల టాస్క్‌ ఎంత హింసాత్మకంగా మారుతుందో బిగ్‌బాస్‌ హెచ్చరిస్తూనే వచ్చాడు. అయినప్పటికీ అలీ బాబాపై అదును చూసి దాడి చేయడం, తోయడం వంటి హింసకు పాల్పడటంతో అతన్ని రేస్‌ నుంచి తప్పిస్తున్నట్టు బిగ్‌బాస్‌ ప్రకటించాడు. దీంతో అలీ విజయానికి అడుగుదూరంలో ఆగిపోయాడు. అలీ అనర్హుడిగా తేలడంతో రాహుల్‌కు టికెట్‌ గెలుచుకునే అవకాశాలు మరింత మెరుగయ్యాయి. దీంతో రాహుల్ మరీంతగా శ్రమించాడు. 

మరో టాస్క్‌లో బద్ధ శత్రువైన శ్రీముఖితో రాహుల్‌ తలపడ్డారు. దీంతో శ్రీముఖి పెట్టిన కార్డ్‌లు గాలికి కూలిపోగా రాహుల్‌ పెట్టిన కార్డ్‌లు నిటారుగా ఉండటంతో అతను విజేతగా నిలిచాడు. ఒకవేళ అలీ పూల టాస్క్‌లో గెలుచుంటే రాహుల్‌ ఫినాలే టికెట్‌ దక్కించుకోవటం కష్టతరమయ్యేది. ఎలాగైతేనేం.. రాహుల్‌ గెలుపును ముద్దాడాడు. ఈ సీజన్‌లో ఫైనల్‌కు వెళ్లిన మొదటి కంటెస్టెంట్‌గా తన పేరును లిఖించుకున్నాడు. దీంతో చిచ్చా(రాహుల్‌) ఫ్యాన్స్‌ సంబరాలు చేసుకుంటున్నారు. అమ్మ మాట నిలబెట్టాడంటూ ఆనందం వ్యక్తం చేస్తున్నారు. టైగర్‌ టైమ్ స్టార్టయింది అంటూ పంచ్‌ డైలాగ్‌లు విసురుతున్నారు. టాస్క్‌లు ఆడడు.. లేజీ అంటూ మూకుమ్మడిగా దాడి చేసిన వారికి మీమ్స్‌తో తగిన సమాధానమిస్తున్నారు. కింద ఇచ్చిన కొన్ని మీమ్స్‌పై మీరూ ఓ లుక్కేయండి.

No comments yet. Be the first to comment!
Add a comment
1
1/4

2
2/4

3
3/4

4
4/4

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement