
బిగ్‌బాస్ మూడో సీజన్‌లో ప్రధానంగా రెండు గ్రూపులు ఉన్నాయి. ఒకటి శ్రీముఖి గ్యాంగ్ కాగా.. రెండో వరుణ్ సందేశ్, వితికా, రాహుల్, పునర్నవిల గ్యాంగ్. అయితే శ్రీముఖి గ్యాంగ్‌లో బాబా, మహేష్, హిమజ ఉన్నా.. వారి మధ్య సమీకరణాలు మారుతూ ఉంటాయి. వరుణ్ గ్యాంగ్ మాత్రమే చాలా దగ్గరైనట్లు కనిపిస్తోంది. ఎక్కడ చూసినా ఆ నలుగురే కనిపిస్తారు. మొదట్లో ఈ నలుగురినే అందరూ టార్గెట్ చేస్తూ గ్రూపిజం అంటూ వేలెత్తి చూపారు.
అయితే రాను రాను ఈ గ్యాంగ్‌లో కూడా గొడవలు వచ్చాయి. కానీ చివరకు మళ్లీ ఒక్కటయ్యారు. వితికా-పునర్నవిల మధ్య గొడవలు, అలకలు, బుజ్జగింపులు జరిగిన సంగతి తెలిసిందే. జైల్లో రాహుల్ ఉన్నప్పుడు వరుణ్‌సందేశ్‌తో గొడవ అయింది. కానీ మళ్లీ కలిసిపోయారు అది వేరే సంగతి అనుకోండి. అయితే నేడు జరగనున్న నామినేషన్ ప్రక్రియలో పునర్నవిని ఏకాకిని చేసినట్లు తెలుస్తోంది. మహేష్, రవిలతో ఇదే విషయం చెప్పుకుని పునర్నవి బాధపడుతోంది. వితికా చేసింది తనకు షాక్ అనిపించిందని మహేష్ ఏదో అనడం ప్రోమోలో కనిపిస్తోంది. మొత్తానికి నామినేషన్ ప్రక్రియ ఆ నలుగురిలో చిచ్చు పెట్టినట్లు తెలుస్తోంది. అసలు వారిమధ్య ఏం జరిగింది? ఎవరెవరు నామినేట్ అయ్యారు? అనే విషయాలు తెలియాలంటే ఇంకొన్ని గంటలు ఆగాలి.
Comments
Please login to add a commentAdd a comment