బిగ్‌బాస్‌.. ఓట్లు తక్కువ వచ్చినా సేవ్‌! | Bigg Boss 3 Telugu Shiva Jyothi Got Less Votes But She Saved | Sakshi
Sakshi News home page

బిగ్‌బాస్‌.. ఓట్లు తక్కువ వచ్చినా సేవ్‌!

Published Sun, Aug 18 2019 5:50 PM | Last Updated on Tue, Aug 20 2019 6:06 PM

Bigg Boss 3 Telugu Shiva Jyothi Got Less Votes But She Saved - Sakshi

బిగ్‌బాస్‌ షో.. ప్రజలు వేసే ఓట్ల మీదే ఆధారపడుతుందా? లేదా కార్యక్రమాన్ని నిర్వహించే వారిదే పెత్తనమా? మరి ప్రజల అభిప్రాయాన్ని ఎందుకు తీసుకుంటున్నారు? అని చాలా రకాల ప్రశ్నలు సోషల్‌ మీడియాలో వినిపిస్తున్నాయి. ఎందుకంటే ఈ వారం ఎలిమినేషన్‌ ప్రాసెస్‌లో వచ్చిన వివాదాలే కారణం. నాల్గో వారానికి గానూ ఇంటి నుంచి ఎలిమినేట్‌ అయ్యేందుకు బాబా భాస్కర్‌, శ్రీముఖి, రవికృష్ణ, వరుణ్‌ సందేశ్‌, రాహుల్‌, రోహిణి, శివజ్యోతి నామినేట్‌ అయ్యారు.అయితే రోహిణి మాత్రం ఉట్టి పుణ్యానికే నామినేట్‌ అయింది.

నామినేషన్‌ ప్రక్రియ గురించి మాట్లాడకూడదు అన్న నిబంధనను ఉల్లంఘించినందుకు గానూ రోహిణిని నేరుగా నామినేట్‌ చేసేశాడు బిగ్‌బాస్‌. రోహిణియే ఈ వారం ఎలిమినేట్‌ కాబోతోందని అనాలిసస్‌ చేసి చెప్పింది శ్రీముఖి. ఈ విషయంలో ఆమె కాస్త బాధపడినా.. అదే నిజమయ్యేట్టుంది. ఇప్పటికే అందించిన సమాచారం మేరకు రోహిణి ఎలిమినేషన్‌ దాదాపు ఖరారైంది. సోషల్‌ మీడియాలో మాత్రం రోహిణి విషయంలో భిన్నాభిప్రాయాలు వెల్లువెత్తుతున్నాయి. (బిగ్‌బాస్‌.. రోహిణి ఎలిమినేటెడ్‌!)

ఓటింగ్‌ విషయంలో రాహుల్‌, శివజ్యోతి, రోహిణికి ఒకే విధంగా వచ్చాయని వార్తలు వినిపిస్తున్నాయి. అయితే పునర్నవి వ్యవహారంతో బజ్‌ క్రియేట్‌ అవుతుందని రాహుల్‌ను ఎలిమినేట్‌ చేయలేదని టాక్‌ వినిపిస్తోంది. అయితే మిగిలిన ఆ ఇద్దరిలో శివజ్యోతికే కాస్త తక్కువ ఓట్లు వచ్చాయట.. కానీ ఆమెను సేవ్‌ చేసి రోహిణిని ఎలిమినేట్‌ చేశారనే వార్తలు వినిపిస్తున్నాయి. అయితే రోహిణికి అంత నెగెటివిటీ కానీ పాజిటివీటి కానీ లేకపోవడం.. తనను ఎలిమినేట్‌ చేసేంత కోపం, సేవ్‌ చేసే అంత అభిమానం సంపాదించుకోలేదని అందుకే ఆమెను ఎలిమినేట్‌ చేసినట్లు తెలుస్తోంది. సోషల్‌ మీడియాలో ప్రచారం జరుగుతున్నట్లుగా రోహిణియే బిగ్‌బాస్‌ ఇంటిని వీడిందా? లేదా అన్నది అధికారికంగా తెలియాలంటే ఇంకొన్నిగంటలు ఆగాలి.

మరిన్ని బిగ్‌బాస్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement