Rohini Noni
-
అలీ రెజా సూపర్ స్ట్రాంగ్ : రోహిణి
ఏడో వారంలో అనూహ్యంగా ఎలిమినేట్ అయి ఇంటిబాట పట్టాడు అలీ రెజా. బిగ్‌బాస్ మూడో సీజన్లో విన్నర్‌గా నిలిచే అవకాశాలున్న కంటెస్టెంట్‌గా పేరు తెచ్చుకున్న అలీ.. అనుకోకుండా ఎలిమినేట్ అయ్యాడు. ఆరువారాలుగా నామినేషన్‌ను ఫేస్ చేయకుండా ఉన్న అలీ.. ఇలా ఎలిమినేట్ అవడంతో హౌస్‌మేట్స్‌తో పాటు ఆడియెన్స్ కూడా షాక్‌కు గురయ్యారు. అయితే అలీ రెజాను తిరిగి హౌస్‌లోకి పంపించాలని అతని అభిమానులు కోరుతున్నారు. ఈ మేరకు సోషల్ మీడియాలో ట్వీట్లతో హల్ చల్ చేస్తున్నారు. అలీ రెజా తన కోపాన్ని కంట్రోల్ చేసుకుని, మాటలను అదుపులో పెట్టుకుని ఉంటే ఎలిమినేట్ అయ్యేవాడు కాదని అతని ఫాలోవర్స్ అనుకుంటున్నారు. అలీ ఎలిమినేషన్‌పై బిగ్‌బాస్ కంటెస్టెంట్ రోహిణి సైతం ఆశ్చర్యం వ్యక్తం చేసింది. రోహిణి తన పుట్టినరోజు సందర్భంగా.. కాసేపు నెటిజన్లతో ముచ్చటించింది. ఈమేరకు కొంతమంది అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పుకొచ్చింది. అలీ స్ట్రాంగ్ కంటెస్టెంట్ అవునా? కాదా? సూపర్‌స్ట్రాంగ్. అలీ ఎలిమినేషన్ కరెక్ట్ అనే భావిస్తున్నారా? అవును ఎక్స్పెక్ట్ చేయలేదు. రవి ఫైనల్ వరకు వెళ్తాడా? బిగ్‌బాస్ హౌస్‌లో ఏదైనా జరగొచ్చు. చాన్స్ వస్తే బిగ్‌బాస్‌కి మళ్లీ వెళ్తారా? వెళ్దాం. రాహుల్‌పై మీ అభిప్రాయం? నోరు జారడం తప్పా మిగతాదంతా జెన్యూన్‌గా ఉంటాడు. అలీ పేరెంట్స్ చనిపోయారా? అందుకే ఎలిమినేట్ చేశారా? ఛీ ఛీ ఎవరు చెప్పారు.. అది తప్పుడు వార్త. ఇలా నెటిజన్లు అడిగిన పలు ప్రశ్నలకు సమాధానాలు చెప్పింది. శ్రీముఖి, రవి, బాబా భాస్కర్, తమన్నా, శివజ్యోతిలకు సంబంధించిన కొన్ని ప్రశ్నలను కూడా అడిగారు. వాటికి కూడా రోహిణి కూల్‌గా సమాధానమిచ్చింది. వాటికి సంబంధించిన సమాధానాలు కావాలంటే.. గ్యాలరీలో చూడండి. -
రోహిణి అవుట్.. వెక్కి వెక్కి ఏడ్చిన శివజ్యోతి
అనుకున్నట్లే జరిగింది. అందరూ ఊహించినట్లే రోహిణి ఎలిమినేట్ అయింది. అయితే ఈ వారం నామినేషన్ ప్రక్రియలో జంటగా వెళ్లిన శివజ్యోతి, రోహిణిలు ఒక్కతాటి పైకి వచ్చి శివజ్యోతి నామినేట్ కానున్నట్లు ప్రకటించారు. దీంతో రోహిణి సేవ్ అయినందుకు సంతోషపడింది. అయితే ఆ సంతోషం పది నిమిషాల్లోనే ఆవిరైపోయింది. నామినేషన్ ప్రక్రియ గురించి చర్చిండం అనే నియమాన్ని ఉల్లంఘించినందుకు గానూ బిగ్‌బాస్ రోహిణిని నేరుగా నామినేట్ చేశాడు. (బిగ్‌బాస్.. రోహిణి ఎలిమినేటెడ్!) అయితే ఈ వారం నామినేషన్స్‌లో ఉన్న వారందరిలో రోహిణి కాస్త తక్కువ ఫేమ్ ఉండటం, హౌస్‌లో ఎవరితోనూ ఎలాంటి గొడవలు లేకపోవడం, ఎక్కువగా హైలెట్ కాకపోవడంతో ఓటింగ్‌లో తేడా కొట్టేసింది. దీంతో నామినేషన్స్‌లోకి వచ్చిన మొదటిసారే.. ఇంటి నుంచి వెళ్లిపోయే పరిస్థితి వచ్చింది. అయితే ఓ రకంగా రోహిణి నామినేషన్‌కు తానే కారణమని శివజ్యోతి వెక్కివెక్కి ఏడ్చింది. (బిగ్‌బాస్.. ఓట్లు తక్కువ వచ్చినా సేవ్!) ఈ సండే నిజంగా ఫన్డే అయింది. డైలాగ్‌లతో బిగ్‌బాస్ హౌస్ మార్మోగిపోయింది. ఆటలతో, మాటలతో బిగ్‌బాస్ హౌస్ సందడిగా సాగింది. మాస్క్‌లు తీసేశారా లేదా అని హౌస్‌మేట్స్‌కు ఓ టాస్క్ ఇచ్చాడు నాగార్జున. నామినేషన్స్‌లో ఉన్నవారందరినీ అక్యూజ్డ్ టీమ్, వరుణ్ సందేశ్, శివజ్యోతి, అలీరెజాలను జడ్డిలుగా విడగొట్టి, మిగతా హౌస్‌మేట్స్‌ను ప్రాసిక్యూట్ టీమ్‌లుగా విడగొట్టాడు. అనంతరం అక్యూజ్డ్ టీమ్ మెంబర్స్ హౌస్‌లో ఎందుకు ఉండకూడదో వాదించాలని, అయితే ప్రాసిక్యూషన్ టీమ్ వారి ముసుగు తీసి వాదించారా? లేదా అన్నది జడ్జెస్ టీమ్ మెంబర్స్ చెప్పాల్సి ఉంటుందని తెలిపాడు. ఈ ఆటలో మహేష్-బాబా భాస్కర్, పునర్నవి-రాహుల్, హిమజ-శ్రీముఖి, అషూ రెడ్డి-రోహిణి, వితికా షెరు-రవికృష్ణలు వాదనలు వినిపించారు. ఈ టాస్క్‌లో రాహుల్-పునర్నవి, బాబా భాస్కర్-మహేష్ వాదనలు ఫన్ క్రియేట్ చేశాయి. ఇక హౌస్‌మేట్స్‌తో మారో డైలాగ్ అంటూ మరో ఆట ఆడించాడు. హౌస్మేట్స్ అందరికీ ఒక్కో డైలాగ్‌ను ఇచ్చి.. విలన్ అని భావించేవారికి చెప్పండని తెలిపాడు. ఈ ఆటలో హౌస్మేట్స్ తమ మనసులోని భావాలను బయటపెట్టారు. మహేష్-పునర్నవి, రాహుల్-శ్రీముఖి, శివజ్యోతి-పునర్నవిల మధ్య ఉన్న కోల్డ్‌వార్ ఈ మారో డైలాగ్‌తో బయటకు వచ్చింది. ఎలిమినేషన్ ప్రాసెస్‌లో భాగంగా శ్రీముఖి, బాబా భాస్కర్, రవికృష్ణ సేవ్ అయినట్లు నాగార్జున తెలిపాడు. రోహిణి ఎలిమినేట్ కావడంతో శివజ్యోతి కన్నీరును ఆపుకోలేకపోయింది. బయటకు వచ్చిన రోహిణి.. హౌస్మేట్స్ అందరికీ మార్కులు వేసింది. అలీకి వందకు వంద మార్కులు వేయగా.. బాబా భాస్కర్‌కు వందకు వెయ్యి మార్కులు వేసింది. మహేష్, శ్రీముఖికి 50 మార్కులు వేసింది. శ్రీముఖి బయట అందరితో సరదాగా ఉన్నట్లు బిగ్‌బాష్ హౌస్‌లో అలా ఉండటం లేదని ఎప్పుడూ ఆట గురించే ఆలోచిస్తూ ఉంటుందని తెలిపింది. గొడవలను పెంచడానికి ప్రయత్నిస్తాడు తప్ప తగ్గించాలని మహేష్ చూడడని పేర్కొంది. రవికృష్ణకు 95, అషూకు 99 మార్కులు వేసింది. అనవసరంగా నామినేషన్స్‌లోకి వచ్చి ఇంటి దారి పట్టింది రోహిణి. ఇక ఐదో వారంలో బిగ్‌బాస్ ఎలా ఉండబోతోందో? ఎవరు నామినేషన్స్‌కు వెళ్లనున్నారో? తెలియాలంటే బిగ్‌బాస్ చూస్తూ ఉండాల్సిందే. మరిన్ని బిగ్‌బాస్ వార్తల కోసం క్లిక్ చేయండి -
బిగ్‌బాస్.. ఓట్లు తక్కువ వచ్చినా సేవ్!
బిగ్‌బాస్ షో.. ప్రజలు వేసే ఓట్ల మీదే ఆధారపడుతుందా? లేదా కార్యక్రమాన్ని నిర్వహించే వారిదే పెత్తనమా? మరి ప్రజల అభిప్రాయాన్ని ఎందుకు తీసుకుంటున్నారు? అని చాలా రకాల ప్రశ్నలు సోషల్ మీడియాలో వినిపిస్తున్నాయి. ఎందుకంటే ఈ వారం ఎలిమినేషన్ ప్రాసెస్‌లో వచ్చిన వివాదాలే కారణం. నాల్గో వారానికి గానూ ఇంటి నుంచి ఎలిమినేట్ అయ్యేందుకు బాబా భాస్కర్, శ్రీముఖి, రవికృష్ణ, వరుణ్ సందేశ్, రాహుల్, రోహిణి, శివజ్యోతి నామినేట్ అయ్యారు.అయితే రోహిణి మాత్రం ఉట్టి పుణ్యానికే నామినేట్ అయింది. నామినేషన్ ప్రక్రియ గురించి మాట్లాడకూడదు అన్న నిబంధనను ఉల్లంఘించినందుకు గానూ రోహిణిని నేరుగా నామినేట్ చేసేశాడు బిగ్‌బాస్. రోహిణియే ఈ వారం ఎలిమినేట్ కాబోతోందని అనాలిసస్ చేసి చెప్పింది శ్రీముఖి. ఈ విషయంలో ఆమె కాస్త బాధపడినా.. అదే నిజమయ్యేట్టుంది. ఇప్పటికే అందించిన సమాచారం మేరకు రోహిణి ఎలిమినేషన్ దాదాపు ఖరారైంది. సోషల్ మీడియాలో మాత్రం రోహిణి విషయంలో భిన్నాభిప్రాయాలు వెల్లువెత్తుతున్నాయి. (బిగ్‌బాస్.. రోహిణి ఎలిమినేటెడ్!) ఓటింగ్ విషయంలో రాహుల్, శివజ్యోతి, రోహిణికి ఒకే విధంగా వచ్చాయని వార్తలు వినిపిస్తున్నాయి. అయితే పునర్నవి వ్యవహారంతో బజ్ క్రియేట్ అవుతుందని రాహుల్‌ను ఎలిమినేట్ చేయలేదని టాక్ వినిపిస్తోంది. అయితే మిగిలిన ఆ ఇద్దరిలో శివజ్యోతికే కాస్త తక్కువ ఓట్లు వచ్చాయట.. కానీ ఆమెను సేవ్ చేసి రోహిణిని ఎలిమినేట్ చేశారనే వార్తలు వినిపిస్తున్నాయి. అయితే రోహిణికి అంత నెగెటివిటీ కానీ పాజిటివీటి కానీ లేకపోవడం.. తనను ఎలిమినేట్ చేసేంత కోపం, సేవ్ చేసే అంత అభిమానం సంపాదించుకోలేదని అందుకే ఆమెను ఎలిమినేట్ చేసినట్లు తెలుస్తోంది. సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతున్నట్లుగా రోహిణియే బిగ్‌బాస్ ఇంటిని వీడిందా? లేదా అన్నది అధికారికంగా తెలియాలంటే ఇంకొన్నిగంటలు ఆగాలి. మరిన్ని బిగ్‌బాస్ వార్తల కోసం క్లిక్ చేయండి -
బిగ్‌బాస్.. రోహిణి ఎలిమినేటెడ్!
వీకెండ్లో వచ్చిన నాగార్జున.. హౌస్‌మేట్స్‌కు ఫన్నీ అవార్డులను ప్రకటించడం.. కిచెన్‌లో వచ్చిన గొడవతో పునర్నవి అలగడం.. వితికా వెళ్లి వరుణ్‌తో మొరపెట్టుకోవడం.. తనకు సపోర్ట్‌గా మాట్లాడటం లేదని వితికా కూడా అలగడం.. తన వెనుకే వరుణ్ వెళ్లి మాట్లాడటం.. గొడవ తగ్గకపోవడంతో వితికాను హగ్ చేసుకోవడం.. టాస్క్‌లో ప్రొటెక్టర్ టీమ్ గెలవడంతో అటాకర్ టీమ్ సభ్యులను కించపర్చడంపై రవికృష్ణ, అషూ మాట్లాడుకోవం.. పునర్నవి-రాహుల్ తమపై వచ్చే మీమ్స్ గురించి మాట్లాడుకోవడం.. వీకెండ్ ఎపిసోడ్లో హైలెట్‌గా నిలిచాయి. బిగ్‌బాస్ ఇచ్చిన డాబర్ పేస్ట్ టాస్క్‌లో ప్రొటెక్టర్.. అటాకర్‌గా రెండు టీమ్స్‌గా విడగొట్టారు. ఈ టాస్క్‌లో న్యాయ నిర్ణేతగా వరుణ్‌సందేశ్ వ్యవహరించాడు. టాస్క్‌లో ప్రొటెక్టర్ టీమ్ గెలవడంతో ఆ టీమ్ సభ్యులైన శ్రీముఖి, అలీ.. అటాకర్ టీమ్ సభ్యులైన రవి, అషూను కించపర్చడంతో వారు హర్ట్ అయ్యారు. బయట సైమా అవార్డుల పండగ జరగుతూ ఉంటే.. బిగ్‌బాస్ హౌస్‌లో ఫన్నీ అవార్డుల కార్యక్రమం జరిగింది. ప్రతీ ఇంటి సభ్యుడిని తమ ప్రవర్తనకు అనుగుణంగా ఓ అవార్డును ప్రకటించారు. ఈ వారంలో అషూ తనను నామినేట్ చేసిన విషయాన్ని మనసులో ఉంచుకున్నందుకు బాబా భాస్కర్‌కు ప్రెజర్ కుక్కర్ అవార్డును ప్రకటించారు. అందరితో మంచి అనిపించుకోవాలనే వ్యాధి అన్నింటి కంటే భయంకరమైందని బాబా భాస్కర్‌కు సూచించాడు. రోహిణి విషయంలో తన అనాలసిస్ చెప్పడం తప్పని, అయితే చివరివరకు రాహుల్‌ను నామినేట్ చేస్తూ ఉంటానని చెప్పడం ఫెయిర్‌నెస్ అని శ్రీముఖిని ఉద్దేశించి అన్నాడు. ఉదయం లేచినప్పటి నుంచి పడుకునే వరకు అరుస్తూనే ఉంటుందని లైడ్ స్పీకర్ అవార్డును శ్రీముఖికి ప్రకటించారు. టాస్క్‌లో పాల్గొనకుండా కామెంట్లు చేస్తుండటంతో పునర్నవికి అంపైర్ అవార్డును ప్రకటించారు. ఎక్కువగా అలుగుతుందని, కోపం కూడా వస్తోందని తగ్గించుకోవాలని నాగ్ సూచించాడు. తనకిష్టమైన వారి దగ్గరే అలుగుతానని పునర్నవి చెప్పగా.. మరి రాహుల్ దగ్గర చేసినట్టు కనిపించలేదని నాగ్ సెటైర్ వేయగా.. రాహుల్ స్పందిస్తూ.. అరాచకం చూపిస్తుందని తెలిపాడు. ఈ వారం మాత్రం కాస్త ఎక్కువగానే అలిగానని, ఇక ఇప్పటినుంచి అలా చేయనని, టాస్క్‌లో కూడా పార్టిసిపేట్ చేస్తానని తెలిపింది. మాటలు బాగా మాట్లాడుతాడు కానీ చేతలు మాత్రం ఉండవని నాగ్ చురకలంటించాడు. పాటలు బాగా పాడుతావ్.. ఆటలు కూడా ఆడాలి అంటూ సూచించాడు. శ్రీముఖి విషయంలో రాహుల్ సారీ చెప్పి మళ్లీ వెనకాల మాట్లాడటం సరికాదన్నాడు. ఆటలో అరిటిపండు.. అషూ, పుల్లలుపెట్టే అవార్డు.. మహేష్, భూతద్దం అవార్డు.. వితికా, ఆనియన్ అవార్డు.. శివజ్యోతి, ఫ్లూట్ అవార్డు.. అలీ, కత్తెర అవార్డు.. రోహిణి, పైనాపిల్ అవార్డు.. వరుణ్, పెద్ద చెవి అవార్డు రవికృష్ణ, చిచ్చుబుడ్డి అవార్డు.. హిమజలకు ఇచ్చాడు. అయితే ఇక నామినేషన్స్‌లో భాగంగా శివజ్యోతి, వరుణ్ సందేశ్ సేవ్ అయినట్లు నాగ్ ప్రకటించాడు. బాబా భాస్కర్, శ్రీముఖి, రవికృష్ణ, రాహుల్, రోహిణిలోంచి ఎవరు ఎలిమినేట్ కాబోతున్నారో తెలియాలంటే రేపటి వరకు ఆగాల్సిందే. అయితే ఇప్పటివరకు అందించిన సమాచారం, సోషల్ మీడియా ట్రెండింగ్ పట్టి చూస్తే రోహిణి ఎలిమినేట్ అయినట్లు తెలుస్తోంది. మరి నిజంగానే రోహిణి ఎలిమినేట్ అయిందా? లేదా తెలియాంటే ఆదివారం ఎపిసోడ్ చూడాల్సిందే. మరిన్ని బిగ్‌బాస్ వార్తల కోసం క్లిక్ చేయండి -
ఈ వారం ‘బిగ్’ సర్ప్రైజ్ ఉందా?
బిగ్‌బాస్‌ను చూస్తున్న ప్రేక్షకులకు గడిచిన మూడు వారాల్లో రాని విసుగు నాల్గో వారంలో వచ్చేసింది. నామినేషన్ ప్రక్రియలో ఎలాంటి గొడవలు జరగకపోవడం.. కెప్టెన్సీ టాస్క్ సైతం తేలిపోవడం.. డ్రాగన్స్ చేజిక్కించున్న అలీరెజా, రవికృష్ణ, రాహుల్ సిప్లిగంజ్‌లు కూడా ఆకట్టుకోలేకపోయారు. సింహాసనంపై కూర్చున్న అలీరెజాను దింపడంలో హౌస్మేట్స్ వినూత్న ప్రయత్నాలేవీ చేయలేదు. ఎంతసేపు అలీ మీద కూర్చోడం, సింహాసనం పక్కనే ఉండటం తప్ప చేసిందేమీ లేదు. ఒంటి చేత్తో రవికృష్ణ కాసేపు పోరాడగా.. పెద్ద పెద్ద మాటలు చెప్పిన రాహుల్.. కొద్దిసేపు మాత్రమే పోరాడి చేతులెత్తేశాడు. చివరకు అలీరెజా సులభంగా కెప్టెన్‌గా ఎన్నికయ్యాడు. ఈ టాస్క్‌లో కొద్దిలో కొద్దిగా వరుణ్ కొత్తగా ట్రై చేశాడు. నీళ్లు తెచ్చి సింహాసనానికి రక్షణగా ఉన్నవారిపై పోయడం లాంటివి చేశాడు. బక్రీద్, స్వాతంత్ర్య దినోత్సవం, రాఖీ పండుగ అంటూ హౌస్మేట్స్ సంబరాలు చేసుకున్నారు. కానీ ప్రేక్షకులను మాత్రం మెప్పించలేకపోయారు. ఈ వారం మొత్తంగా బిగ్‌బాస్ ఫెయిల్ అయినట్టు కనిపిస్తోంది. అయితే కొంతలో కొంత ఉపశమనం కలిగించే అంశం ఏంటంటే.. ఎలిమినేషన్ ప్రక్రియ. ఈ సారి ఎవరు ఎలిమినేట్ కానున్నారనే ఆసక్తి అందరిలోనూ నెలకొంది. బిగ్‌బాస్ ఇంట్లోనూ ఈ టెన్షన్ వాతావరణం కనిపిస్తోంది. శ్రీముఖి అనాలిసిస్ చేసి.. ఈవారం రోహిణి ఎలిమినేట్ కానుందని తేల్చిచెప్పింది. దీంతో కుంగిపోయిన రోహిణి కంటతడి పెట్టుకుంది. అయితే బయట కూడా ఇలాంటి అనాలిసిస్సే జరుగుతోంది. ఈవారం ఎలిమినేషన్లో ఉన్న వారందరిలో రాహుల్, శివజ్యోతి, రోహిణికి తక్కువ ఓట్లు వచ్చాయని తెలుస్తోంది. ఓటింగ్ విషయంలో ఈ ముగ్గురు చాలా తక్కువ వ్యత్యాసంలో ఉన్నట్లు సమాచారం. (‘అందరికీ రాఖీ శుభాకాంక్షలు.. రాహుల్‌కు తప్ప’) అయితే ముగ్గురికి సమాన ఓట్లు వస్తుండటంతో సోషల్ మీడియాలో ఓ క్యాంపైన్ కూడా నడిచింది. మీకు నచ్చని కంటెస్టెంట్ ఎలిమినేట్ కావాలి అనుకుంటే.. మిగతా ఇద్దరికీ సమాన ఓట్లు వేయండంటూ ప్రచారం జరిగింది. మరోవైపు ఈ సారి డబుల్ ఎలిమినేషన్ ఉంటుందనే వార్త కూడా వైరల్ అవుతోంది. మొత్తానికి ఈ వారం ఏది జరిగినా అది పెద్ద సర్ప్రైజ్గానే ఉంటుందనేది మాత్రం వాస్తవం. ఇంతవరకు ఎలాంటి నెగెటివిటీ లేకుండా నెట్టుకొట్టుస్తున్న రోహిణి.. హౌస్‌లో నిత్యం కంటతడి పెడుతూ పాతాళగంగగా పేరు తెచ్చుకున్న శివజ్యోతి.. పునర్నవి వ్యవహారంతో క్రేజ్ తెచ్చుకున్న రాహుల్ ఎలిమినేషన్‌కు దగ్గరగా ఉండటం.. ఈ వీకెండ్‌ను మరింత ఆసక్తికరంగా మలచనుంది. చూడాలి మరి.. ఈ వారం బిగ్‌బాస్ ఇంటిని ఎవరు వీడనున్నారో?. -
ప్రత్యేకమైన యాసతో అదరగొట్టే రోహిణి
ఏడో కంటెస్టెంట్‌గా ప్రముఖ నటి రోహిణి ఎంట్రీ ఇచ్చారు. విశాఖపట్టణంలో జన్మించినా.. రాయలసీమ యాసలో ప్రత్యేకమైన డైలాగ్ డెలివరీతో సీరియల్స్‌లో నవ్వులు పూయిస్తుంది రోహిణి. అప్పుడప్పుడూ జబర్దస్త్ వేదికపైనా పంచ్‌లు పేల్చింది. కొంచెం ఇష్టం కొంచెం కష్టం సీరియల్లో ప్రత్యేక నటనకు అవార్డులు కూడా అందుకుంది. బుల్లితెరపై సీరియల్స్‌తో నవ్వించే రోహిణి.. ఇక బిగ్‌బాస్ హౌస్‌లో కంటెస్టెంట్లతో పాటు ప్రేక్షకులనూ ఎంటర్టైన్ చేయనుంది. మరి రోహిణి కడవరకు నిలబడుతుందా? అన్నది చూడాలి.