అనుకున్నట్లే జరిగింది. అందరూ ఊహించినట్లే రోహిణి ఎలిమినేట్ అయింది. అయితే ఈ వారం నామినేషన్ ప్రక్రియలో జంటగా వెళ్లిన శివజ్యోతి, రోహిణిలు ఒక్కతాటి పైకి వచ్చి శివజ్యోతి నామినేట్ కానున్నట్లు ప్రకటించారు. దీంతో రోహిణి సేవ్ అయినందుకు సంతోషపడింది. అయితే ఆ సంతోషం పది నిమిషాల్లోనే ఆవిరైపోయింది. నామినేషన్ ప్రక్రియ గురించి చర్చిండం అనే నియమాన్ని ఉల్లంఘించినందుకు గానూ బిగ్‌బాస్ రోహిణిని నేరుగా నామినేట్ చేశాడు. (బిగ్‌బాస్.. రోహిణి ఎలిమినేటెడ్!)
అయితే ఈ వారం నామినేషన్స్‌లో ఉన్న వారందరిలో రోహిణి కాస్త తక్కువ ఫేమ్ ఉండటం, హౌస్‌లో ఎవరితోనూ ఎలాంటి గొడవలు లేకపోవడం, ఎక్కువగా హైలెట్ కాకపోవడంతో ఓటింగ్‌లో తేడా కొట్టేసింది. దీంతో నామినేషన్స్‌లోకి వచ్చిన మొదటిసారే.. ఇంటి నుంచి వెళ్లిపోయే పరిస్థితి వచ్చింది. అయితే ఓ రకంగా రోహిణి నామినేషన్‌కు తానే కారణమని శివజ్యోతి వెక్కివెక్కి ఏడ్చింది. (బిగ్‌బాస్.. ఓట్లు తక్కువ వచ్చినా సేవ్!)
ఈ సండే నిజంగా ఫన్‌డే అయింది. డైలాగ్‌లతో బిగ్‌బాస్ హౌస్ మార్మోగిపోయింది. ఆటలతో, మాటలతో బిగ్‌బాస్ హౌస్ సందడిగా సాగింది. మాస్క్‌లు తీసేశారా లేదా అని హౌస్‌మేట్స్‌కు ఓ టాస్క్ ఇచ్చాడు నాగార్జున. నామినేషన్స్‌లో ఉన్నవారందరినీ అక్యూజ్డ్ టీమ్, వరుణ్ సందేశ్, శివజ్యోతి, అలీరెజాలను జడ్డిలుగా విడగొట్టి, మిగతా హౌస్‌మేట్స్‌ను ప్రాసిక్యూట్ టీమ్‌లుగా విడగొట్టాడు. అనంతరం అక్యూజ్డ్ టీమ్ మెంబర్స్ హౌస్‌లో ఎందుకు ఉండకూడదో వాదించాలని, అయితే ప్రాసిక్యూషన్ టీమ్ వారి ముసుగు తీసి వాదించారా? లేదా అన్నది జడ్జెస్ టీమ్ మెంబర్స్ చెప్పాల్సి ఉంటుందని తెలిపాడు. ఈ ఆటలో మహేష్-బాబా భాస్కర్, పునర్నవి-రాహుల్, హిమజ-శ్రీముఖి, అషూ రెడ్డి-రోహిణి, వితికా షెరు-రవికృష్ణలు వాదనలు వినిపించారు. ఈ టాస్క్‌లో రాహుల్-పునర్నవి, బాబా భాస్కర్-మహేష్ వాదనలు ఫన్ క్రియేట్ చేశాయి.
ఇక హౌస్‌మేట్స్‌తో మారో డైలాగ్ అంటూ మరో ఆట ఆడించాడు. హౌస్‌మేట్స్ అందరికీ ఒక్కో డైలాగ్‌ను ఇచ్చి.. విలన్ అని భావించేవారికి చెప్పండని తెలిపాడు. ఈ ఆటలో హౌస్‌మేట్స్ తమ మనసులోని భావాలను బయటపెట్టారు. మహేష్-పునర్నవి, రాహుల్-శ్రీముఖి, శివజ్యోతి-పునర్నవిల మధ్య ఉన్న కోల్డ్‌వార్ ఈ మారో డైలాగ్‌తో బయటకు వచ్చింది. ఎలిమినేషన్ ప్రాసెస్‌లో భాగంగా శ్రీముఖి, బాబా భాస్కర్, రవికృష్ణ సేవ్ అయినట్లు నాగార్జున తెలిపాడు. రోహిణి ఎలిమినేట్ కావడంతో శివజ్యోతి కన్నీరును ఆపుకోలేకపోయింది.
బయటకు వచ్చిన రోహిణి.. హౌస్‌మేట్స్ అందరికీ మార్కులు వేసింది. అలీకి వందకు వంద మార్కులు వేయగా.. బాబా భాస్కర్‌కు వందకు వెయ్యి మార్కులు వేసింది. మహేష్, శ్రీముఖికి 50 మార్కులు వేసింది. శ్రీముఖి బయట అందరితో సరదాగా ఉన్నట్లు బిగ్‌బాష్ హౌస్‌లో అలా ఉండటం లేదని ఎప్పుడూ ఆట గురించే ఆలోచిస్తూ ఉంటుందని తెలిపింది. గొడవలను పెంచడానికి ప్రయత్నిస్తాడు తప్ప తగ్గించాలని మహేష్ చూడడని పేర్కొంది. రవికృష్ణకు 95, అషూకు 99 మార్కులు వేసింది. అనవసరంగా నామినేషన్స్‌లోకి వచ్చి ఇంటి దారి పట్టింది రోహిణి. ఇక ఐదో వారంలో బిగ్‌బాస్ ఎలా ఉండబోతోందో? ఎవరు నామినేషన్స్‌కు వెళ్లనున్నారో? తెలియాలంటే బిగ్‌బాస్ చూస్తూ ఉండాల్సిందే.
Comments
Please login to add a commentAdd a comment