బిగ్‌బాస్‌.. రోహిణి ఎలిమినేటెడ్‌! | Rohini May Eliminated in Bigg Boss 3 Telugu Fourth Week | Sakshi
Sakshi News home page

బిగ్‌బాస్‌.. రోహిణి ఎలిమినేటెడ్‌!

Published Sat, Aug 17 2019 10:45 PM | Last Updated on Tue, Aug 20 2019 6:15 PM

Rohini May Eliminated in Bigg Boss 3 Telugu Fourth Week - Sakshi

వీకెండ్‌లో వచ్చిన నాగార్జున.. హౌస్‌మేట్స్‌కు ఫన్నీ అవార్డులను ప్రకటించడం.. కిచెన్‌లో వచ్చిన గొడవతో పునర్నవి అలగడం.. వితికా వెళ్లి వరుణ్‌తో మొరపెట్టుకోవడం.. తనకు సపోర్ట్‌గా మాట్లాడటం లేదని వితికా కూడా అలగడం.. తన వెనుకే వరుణ్‌ వెళ్లి మాట్లాడటం.. గొడవ తగ్గకపోవడంతో వితికాను హగ్‌ చేసుకోవడం.. టాస్క్‌లో ప్రొటెక్టర్‌ టీమ్‌ గెలవడంతో అటాకర్‌ టీమ్‌ సభ్యులను కించపర్చడంపై రవికృష్ణ, అషూ మాట్లాడుకోవం.. పునర్నవి-రాహుల్‌ తమపై వచ్చే మీమ్స్‌ గురించి మాట్లాడుకోవడం.. వీకెండ్‌ ఎపిసోడ్‌లో హైలెట్‌గా నిలిచాయి.

బిగ్‌బాస్‌ ఇచ్చిన డాబర్‌ పేస్ట్‌ టాస్క్‌లో  ప్రొటెక్టర్‌.. అటాకర్‌గా రెండు టీమ్స్‌గా విడగొట్టారు. ఈ టాస్క్‌లో న్యాయ నిర్ణేతగా వరుణ్‌సందేశ్‌ వ్యవహరించాడు. టాస్క్‌లో ప్రొటెక్టర్‌ టీమ్‌ గెలవడంతో ఆ టీమ్‌ సభ్యులైన శ్రీముఖి, అలీ..  అటాకర్‌ టీమ్‌ సభ్యులైన రవి, అషూను కించపర్చడంతో వారు హర్ట్‌ అయ్యారు. బయట సైమా అవార్డుల పండగ జరగుతూ ఉంటే.. బిగ్‌బాస్‌ హౌస్‌లో ఫన్నీ అవార్డుల కార్యక్రమం జరిగింది. ప్రతీ ఇంటి సభ్యుడిని తమ ప్రవర్తనకు అనుగుణంగా ఓ అవార్డును ప్రకటించారు. ఈ వారంలో అషూ తనను  నామినేట్‌ చేసిన విషయాన్ని మనసులో ఉంచుకున్నందుకు  బాబా భాస్కర్‌కు ప్రెజర్‌ కుక్కర్‌ అవార్డును ప్రకటించారు. అందరితో మంచి అనిపించుకోవాలనే వ్యాధి అన్నింటి కంటే భయంకరమైందని బాబా భాస్కర్‌కు సూచించాడు. రోహిణి విషయంలో తన అనాలసిస్‌ చెప్పడం తప్పని, అయితే చివరివరకు రాహుల్‌ను నామినేట్‌ చేస్తూ ఉంటానని చెప్పడం ఫెయిర్‌నెస్‌ అని శ్రీముఖిని ఉద్దేశించి అన్నాడు. ఉదయం లేచినప్పటి నుంచి పడుకునే వరకు అరుస్తూనే ఉంటుందని లైడ్‌ స్పీకర్‌ అవార్డును శ్రీముఖికి ప్రకటించారు.

టాస్క్‌లో పాల్గొనకుండా కామెంట్లు చేస్తుండటంతో పునర్నవికి అంపైర్‌ అవార్డును ప్రకటించారు. ఎక్కువగా అలుగుతుందని, కోపం కూడా వస్తోందని తగ్గించుకోవాలని నాగ్‌ సూచించాడు. తనకిష్టమైన వారి దగ్గరే అలుగుతానని పునర్నవి చెప్పగా.. మరి రాహుల్‌ దగ్గర చేసినట్టు కనిపించలేదని నాగ్‌ సెటైర్‌ వేయగా.. రాహుల్‌ స్పందిస్తూ.. అరాచకం చూపిస్తుందని తెలిపాడు. ఈ వారం మాత్రం కాస్త ఎక్కువగానే అలిగానని, ఇక ఇప్పటినుంచి అలా చేయనని, టాస్క్‌లో కూడా పార్టిసిపేట్‌ చేస్తానని తెలిపింది. మాటలు బాగా మాట్లాడుతాడు కానీ చేతలు మాత్రం ఉండవని నాగ్‌ చురకలంటించాడు. పాటలు బాగా పాడుతావ్‌.. ఆటలు కూడా ఆడాలి అంటూ సూచించాడు. శ్రీముఖి విషయంలో రాహుల్‌ సారీ చెప్పి మళ్లీ వెనకాల మాట్లాడటం సరికాదన్నాడు. ఆటలో అరిటిపండు.. అషూ, పుల్లలుపెట్టే అవార్డు.. మహేష్‌, భూతద్దం అవార్డు.. వితికా, ఆనియన్‌ అవార్డు.. శివజ్యోతి, ఫ్లూట్‌ అవార్డు.. అలీ, కత్తెర అవార్డు.. రోహిణి, పైనాపిల్‌ అవార్డు.. వరుణ్‌, పెద్ద చెవి అవార్డు రవికృష్ణ, చిచ్చుబుడ్డి అవార్డు.. హిమజలకు ఇచ్చాడు. 

అయితే ఇక నామినేషన్స్‌లో భాగంగా శివజ్యోతి, వరుణ్‌ సందేశ్‌ సేవ్‌ అయినట్లు నాగ్‌ ప్రకటించాడు. బాబా భాస్కర్‌, శ్రీముఖి, రవికృష్ణ, రాహుల్‌, రోహిణిలోంచి ఎవరు ఎలిమినేట్‌ కాబోతున్నారో తెలియాలంటే రేపటి వరకు ఆగాల్సిందే. అయితే ఇప్పటివరకు అందించిన సమాచారం, సోషల్‌ మీడియా ట్రెండింగ్‌ పట్టి చూస్తే రోహిణి ఎలిమినేట్‌ అయినట్లు తెలుస్తోంది. మరి నిజంగానే రోహిణి ఎలిమినేట్‌ అయిందా? లేదా తెలియాంటే ఆదివారం ఎపిసోడ్‌ చూడాల్సిందే.

మరిన్ని బిగ్‌బాస్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement