బిగ్‌బాస్‌: కెప్టెన్‌ అయ్యేదెవరు? | Bigg Boss 3 Telugu Who Is The Next Capatain In 10th Week | Sakshi
Sakshi News home page

బిగ్‌బాస్‌: కెప్టెన్‌ అయ్యేదెవరు?

Published Fri, Sep 27 2019 12:43 PM | Last Updated on Fri, Sep 27 2019 1:06 PM

Bigg Boss 3 Telugu Who Is The Next Capatain In 10th Week - Sakshi

ఎన్ని విమర్శలొచ్చినా బిగ్‌బాస్‌ తాను అనుకున్నదే చేశాడు. ఎలాంటి పోలింగ్‌ నిర్వహించకుండానే ఎలిమినేట్‌ అయిన అలీరెజాను తిరిగి ఇంట్లోకి పంపించాడు. తన రాకతో బిగ్‌బాస్‌ హౌస్‌ సందడిగా మారింది. ఒంటరిగా మిగిలపోయిన శ్రీముఖికి అలీ రాకతో కొండంత బలం వచ్చినట్టైంది. ఇటు శివజ్యోతికి ఏడవటానికి మళ్లీ ఓ అవకాశం దొరికింది. అటు రవి తన జిగిరీ దోస్త్‌ తిరిగిరావటంతో సంతోషంలో మునిగిపోయాడు. మరోవైపేమో టాస్క్‌లో జరిగిన గొడవతో వరుణ్‌-వితి​కా, రాహుల్‌- పునర్నవిల మధ్య దూరం పెరిగింది. నలుగురు మిత్రులు కాస్తా రెండు గ్రూపులుగా చీలిపోయారు. రాహుల్‌-పునర్నవిల జోడీ మొదట బాగా ఆడినప్పటికీ రెండురోజులుగా జరుగుతున్న గొడవతో చివరి నిమిషంలో డీలా పడిపోయి కెప్టెన్సీ టాస్క్‌కు అర్హత సాధించలేకపోయారు. ఎవరెంత కాకా పట్టినా వీలునామాను మాత్రం ఎవరికీ దక్కకుండా జాగ్రత్తగా దాచుకున్న శివజ్యోతి కెప్టెన్సీ టాస్క్‌కు అర్హురాలిగా నిలిచింది.

బెస్ట్‌ ఫర్‌ఫార్మెన్స్‌ ఇచ్చి బాబా, ఎక్కువ ఇటుకలతో గోడను నిర్మించిన రవి- శ్రీముఖిలు కూడా కెప్టెన్సీ టాస్క్‌లో తలపడనున్నారు. ఇక వీరికోసం బిగ్‌బాస్‌ ‘కలర్‌ఫుల్‌ కెప్టెన్‌’ టాస్క్‌ ఇచ్చాడు. నాలుగు వేర్వేరు రంగులు నింపిన పాత్రలను ఇచ్చాడు. ఈ టాస్క్‌లో వారంతా ఇంటిని చిందరవందరగా మార్చుతూ చెలరేగిపోయినట్టు కనిపిస్తోంది. ఒకరు తప్పించుకోడానికి ప్రయత్నిస్తుంటే మరొకరు వారిని దొరకబుచ్చుకునే అవకాశం కోసం ఎదురు చూస్తున్నారు. తనదైన కామెడీతో ఇంట్లో నవ్వులు పూయించే బాబా భాస్కర్‌, తన అరుపులతో ఇంటిని దద్దరిల్లించే రాములమ్మ, మంచివాళ్లకే మంచివాడుగా పేరు గాంచిన రవి, ఏడుపే ఆయుధంగా పెట్టుకున్న శివజ్యోతి.. ఈ నలుగురిలో ఎవరు కెప్టెన్‌ అవుతారో చూడాలి! ఇప్పటివరకు రవి, శ్రీముఖికి ఒక్కసారి కూడా కెప్టెన్‌ అవలేదు. రవి అయితే కనీసం కెప్టెన్సీ టాస్క్‌ వరకు కూడా వెళ్లలేదు. మరి ఈ టాస్క్‌లో ఎవరికి రంగు పడుద్దో ఎవరు కెప్టెన్‌ అవుతారో చూడాలి! 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement