సీనియర్ బాలీవుడ్ నటుడు ఫారూక్ షేక్ శుక్రవారం రాత్రి గుండెపోటుతో దుబాయ్లో మరణించారు. ఈ విషయాన్ని దీర్ఘకాలంపాటు ఆయనతో కలిసి నటించిన దీప్తి నావల్ తెలిపారు. పూర్తి వివరాలు తనకు తెలియవని, ఆయన కుటుంబ సభ్యుల్లో ఎవరితోనూ తాను మాట్లాడలేకపోయానని ఆమె అన్నారు. షబానా అజ్మీకి కూడా ఈ విషయం తెలుసని, ఆమె కూడా తీవ్ర దిగ్భ్రాంతి చెందారని తెలిపారు. 'చష్మే బద్దూర్', 'సాథ్ సాథ్' లాంటి సినిమాలతోపాటు అనేక బాలీవుడ్ చిత్రాల్లో హీరోగా, క్యారెక్టర్ నటుడిగా ఆయన ప్రేక్షకులకు సుపరిచితుడు. చిత్రపరిశ్రమలోని అద్భుతమైన నటుల్లో షేక్ ఒకరని, ఎప్పుడూ తనను ప్రోత్సహించేవారని, ఆయన లేరంటే నమ్మలేకపోతున్నామని దీప్తి నావల్ కన్నీటి పర్యంతమయ్యారు.
దుబాయ్లో అధికారిక కార్యక్రమాలు పూర్తయిన తర్వాత అంత్యక్రియల కోసం మృతదేహాన్ని ముంబైకి తరలించనున్నారు. ఫారుక్ షేక్కు 65 సంవత్సరాల వయసున్నా, శారీరకంగా మంచి దృఢంగా ఉండేవారు. రెండునెలల క్రితం షార్జాలో జరిగిన పుస్తక మహోత్సవంలో కూడా నావల్తో మాట్లాడారు. తామిద్దరం కలిసి మరో సినిమా చేద్దామనుకున్నామని, ఇంతలోనే షేక్ ఈ లోకాన్ని వదిలి వెళ్లిపోయారని నావల్ చెప్పారు. 1948 మార్చి 25న పుట్టని షేక్.. 1973లో 'గరమ్ హవా' సినిమాతో తన బాలీవుడ్ కెరీర్ ప్రారంభించారు. షత్రంజ్ కే ఖిలాడీ, ఉమ్రావో జాన్, కిసీసేన కెహనా, నూరీ, యే జవానీ హై దివానీ లాంటి సినిమాల్లో ఆయన నటించారు.
గుండెపోటుతో బాలీవుడ్ నటుడు ఫారూక్ షేక్ మృతి
Published Sat, Dec 28 2013 10:25 AM | Last Updated on Wed, Apr 3 2019 6:34 PM
Advertisement