నిర్మాతగా బిజీ అవుతోన్న హీరోయిన్ | bollywood Heroine anushka Sharma to produce three films | Sakshi
Sakshi News home page

నిర్మాతగా బిజీ అవుతోన్న హీరోయిన్

Published Wed, Dec 9 2015 9:18 AM | Last Updated on Sun, Sep 3 2017 1:44 PM

నిర్మాతగా బిజీ అవుతోన్న హీరోయిన్

నిర్మాతగా బిజీ అవుతోన్న హీరోయిన్

అతి కొద్ది కాలంలో బాలీవుడ్లో స్టార్ హీరోయిన్గా ఎదిగిన హాట్ బ్యూటి అనుష్క శర్మ. హీరోయిన్ కెరీర్ మంచి ఫాంలో ఉండగానే నిర్మాణ రంగం మీద దృష్టిపెట్టిన ఈ భామ, వరుసగా మూడు సినిమాలు నిర్మించడానికి ప్లాన్ చేసుకుంటోంది. విమర్శకుల ప్రశంసలు అందుకున్న 'ఎన్హెచ్ 10' సినిమాతో నిర్మాతగా మారిన అనుష్క, అదే సినిమాలో నటనతో కూడా ఆకట్టుకుంది. అదే ఊపులో ఒకేసారి మూడు సినిమాల నిర్మాణానికి రెడీ అవుతోంది అనుష్క శర్మ.

ఈ సినిమాలు, నా కోసం నేను నిర్మించుకుంటున్నా అంటున్న అనుష్క ఇప్పటికే రెండు సినిమాల కథా కథనాలు కూడా రెడీ అయ్యాయని, మరో సినిమాకు సంబందించిన కథా చర్చలు జరుగుతున్నాయని తెలిపింది. ఈ మూడు చిత్రాల్లో, ఎన్ హెచ్ 10 సినిమాకు దర్శకత్వం వహించిన నవదీప్ సింగ్ ఒక సినిమాను డైరెక్ట్ చేస్తుండగా, మిగతా రెండు సినిమాల ద్వారా అన్షయ్ లాల్, అక్షంత్ వర్మలు దర్శకులుగా పరిచయం అవుతున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement