ఆ నవల ప్రభావం ఇప్పటికీ తగ్గలేదు! | Campus Ampasayya Movie Thearical Trailer | Sakshi
Sakshi News home page

ఆ నవల ప్రభావం ఇప్పటికీ తగ్గలేదు!

Published Mon, Jun 6 2016 11:05 PM | Last Updated on Mon, Sep 4 2017 1:50 AM

ఆ నవల ప్రభావం ఇప్పటికీ తగ్గలేదు!

ఆ నవల ప్రభావం ఇప్పటికీ తగ్గలేదు!

- రచయిత ‘అంపశయ్య’ నవీన్
  తెలుగు సాహితీ చరిత్రలో ‘అంపశయ్య’ ఓ సంచలనం. 1969లో వచ్చిన ఈ నవలతో రచయిత నవీన్ ఇంటిపేరు ‘అంపశయ్య’గా మారిపోయింది. ఈ నవలకు తెర రూపమే ‘క్యాంపస్ అంపశయ్య’. ప్రభాకర్ జైని నటించి, దర్శకత్వం వహించారు. జైనీ క్రియేషన్స్, ఓం నమో భగవతే వాసుదేవాయ ఫిలిమ్స్ పతాకంపై విజయలక్ష్మి జైని ఈ చిత్రాన్ని నిర్మించారు. శ్యామ్‌కుమార్, పావని కీలక పాత్రల్లో ఈ చిత్రాన్ని తెలుగు, తమిళ, మలయాళ భాషల్లో నిర్మించి, హిందీలోకి అనువ దించారు. సోమవారం ఈ చిత్రం హిందీ పాటలను విడుదల చేశారు.
 
  ఈ సందర్భంగా ‘అంపశయ్య’ నవీన్ మాట్లాడుతూ - ‘‘ఈ సినిమా చాలా మంది జీవితాలకు గమ్యంగా మారింది. ఈ నవల వచ్చి 47 ఏళ్లయినా దీని ప్రభావం ఇంకా తగ్గలేదు.  మొత్తం నాలుగు భాషల్లో విడుదల చేయడం ఆనందంగా ఉంది’’ అని చెప్పారు. దర్శకుడు ప్రభాకర్ జైని  మాట్లాడుతూ- ‘‘క్యాంపస్‌లో చదివే ప్రతి విద్యార్థి అంపశయ్య స్టేజ్ నుంచి దాటి వచ్చినవాడే. ఈ చిత్రాన్ని అందరూ ఆదరిస్తారని ఆశిస్తున్నా’’ అని అన్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement