పదో నెలలో ఆరో తేదీన పెళ్లి | Chaitu, Samantha Wedding Date Fixed | Sakshi
Sakshi News home page

పదో నెలలో ఆరో తేదీన పెళ్లి

Published Thu, Jun 8 2017 11:40 PM | Last Updated on Sun, Jul 14 2019 4:41 PM

పదో నెలలో ఆరో తేదీన పెళ్లి - Sakshi

పదో నెలలో ఆరో తేదీన పెళ్లి

నాగచైతన్య–సమంతల పెళ్లి తేదీ నిశ్చయమైంది. నిన్న మొన్నటి వరకూ అక్టోబర్‌లో పెళ్లి ఉంటుంది కానీ, ఇంకా డేట్‌ అనుకోలేదని చెప్పుకుంటూ వచ్చారు చైతు. గురువారం పెళ్లి తేదీని ప్రకటించారు. జియో ఫిల్మ్‌ఫేర్‌ అవార్డ్స్‌ సౌత్‌ వేడుక ఈ నెల 17న హైదరాబాద్‌లో జరగనుంది. ఈ వేడుకకు సంబంధించిన వివరాలు తెలియజేయడానికి గురువారం ప్రెస్‌మీట్‌ ఏర్పాటు చేశారు.

ఈ సమావేశంలో ముఖ్య అతిథిగా చైతూ పాల్గొన్నారు. ‘‘మా పెళ్లి అక్టోబర్‌ 6న’’ అని ఈ వేదికపై చైతూ పేర్కొన్నారు. అది మాత్రమే కాదు.. సమంతతో తాను మరో రొమాంటిక్‌ లవ్‌ ఎంటర్‌టైనర్‌లో నటించాలనుకుంటున్నట్లు కూడా పేర్కొన్నారు. న్యూయార్క్‌ని హనీమూన్‌ ప్లేస్‌గా సెలెక్ట్‌ చేసుకున్నారు ఈ కాబోయే దంపతులు. ఈ ఇద్దరి కాంబినేషన్‌లో వచ్చిన తొలి చిత్రం ‘ఏ మాయ చేశావె’కి సంబంధించిన కీలక సన్నివేశాలు చిత్రీకరించింది అక్కడే. అందుకే హనీమూన్‌ని అక్కడ ప్లాన్‌ చేసుకున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

Photos

View all
Advertisement