క్యాష్ కంటే...క్యారెక్టర్ ముఖ్యం! | Character is important rather than the cash | Sakshi

క్యాష్ కంటే...క్యారెక్టర్ ముఖ్యం!

Nov 2 2016 11:11 PM | Updated on Sep 4 2017 6:59 PM

క్యాష్ కంటే...క్యారెక్టర్ ముఖ్యం!

క్యాష్ కంటే...క్యారెక్టర్ ముఖ్యం!

నాగచైతన్య హీరోగా గౌతమ్ మీనన్ దర్శకత్వంలో మిర్యాల రవీందర్‌రెడ్డి నిర్మించిన ‘సాహసం శ్వాసగా సాగిపో’

నాగచైతన్య హీరోగా గౌతమ్ మీనన్ దర్శకత్వంలో మిర్యాల రవీందర్‌రెడ్డి నిర్మించిన ‘సాహసం శ్వాసగా సాగిపో’ ఈ నెల 11న విడుదలవుతోంది. ఈ సినిమా ద్వారా హీరోయిన్‌గా పరిచయమవుతున్న మలయాళ బ్యూటీ మంజిమా మోహన్ చెప్పిన ముచ్చట్లు...
 
► నాన్న విపిన్ మోహన్ ప్రముఖ మలయాళీ సినిమాటోగ్రాఫర్. ఆయన వల్లే యాక్టర్‌నయ్యా. నాన్నతో కలసి ఓరోజు షూటింగ్‌కి వెళ్లా. చిన్న అమ్మాయి ఎవరో రాలేదు. నాన్న చెప్పినట్టు కెమేరా ముందు పరిగెత్తాను. అలా మూడేళ్ల వయసులోనే తొలిసారి నటించా. చైల్డ్ ఆర్టిస్ట్‌గా 8 సినిమాలు చేశా.

► నాన్నకు నేను హీరోయిన్ కావడం ఇష్టం లేదు. ఇండస్ట్రీ గురించి ఆయనకు బాగా తెలుసు. హీరోయిన్లు ఎలాంటి కష్టాలు పడతారు, వాళ్ల ప్రయాణం ఎలా ఉంటుందో తెలుసు. బహుశా.. నా కూతురుకి అటువంటి కష్టాలెందుకు? అని వద్దన్నారేమో! (నవ్వుతూ..) చివరకు, ‘నీ ఇష్టాన్ని కాదనను. కానీ, ముందు డిగ్రీ కంప్లీట్ చేయ్’ అన్నారు.

► ‘ఒరు వడక్కన్ సెల్ఫీ’ అనే మలయాళ సినిమాతో హీరోయిన్‌గా పరిచయమయ్యా. ఆ సినిమా ట్రైలర్ చూసి గౌతమ్ మీనన్ ఆడిషన్‌కి పిలిచారు. తమిళ సినిమాకే నన్ను సెలెక్ట్ చేశారనుకున్నా. అగ్రిమెంట్ మీద సంతకం చేసేటప్పుడు తమిళం, తెలుగు - రెండు భాషల్లో అని అర్థమైంది.

చెన్నైలో చదివా కాబట్టి తమిళ్ వచ్చు. తెలుగు రాదు. సో, తెలుగులో నటించలేనని చెప్పా. గౌతమ్ మీనన్ నువ్వు చేయగలవని ప్రోత్సహించారు. నిజానికి, ‘ఏ మాయ చేసావె’ విడుదలైన తర్వాత ఓ కెఫేకి వెళ్లా. అక్కడికి గౌతమ్ మీనన్ వచ్చారు. నేను ఎగ్జయిటయ్యా. కానీ, ఏదో ఒక రోజు ఆయన సినిమాలో నటిస్తానని అనుకోలేదు. నాగచైతన్య వెరీ ఫ్రెండ్లీ కో-స్టార్.


► ఓసారి చేసిన సీన్‌లో మళ్లీ సేమ్ ఫీలింగ్‌తో నటించడం చాలా కష్టం. రెండు భాషల్లో డైలాగులను గుర్తు పెట్టుకోవాలి. షూటింగ్‌కి ఓ రోజు ముందు తెలుగు డైలాగ్స్ నేర్చుకునేదాన్ని. తమిళ్ సీన్ షూట్ చేసిన తర్వాత తెలుగు తీసుంటే బాగుండేదేమో! కానీ, ఫస్ట్‌డే చైతన్యతో ఓ సీన్ షూట్ చేశాం. రెండో రోజు శింబుతో తమిళ్ సీన్ షూటింగ్... సినిమా అంతా ఇంతే.

► క్యాష్ కంటే సినిమాలో నా క్యారెక్టర్ ముఖ్యం. కమర్షియల్ సినిమాలు కూడా ముఖ్యమే. నాకు అసౌకర్యంగా అనిపించే సినిమాలు చేయను. గ్లామర్ పేరుతో చిట్టిపొట్టి బట్టలు వేసుకోవడం నాకిష్టం లేదు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all
Advertisement