
నిఖిల్
‘ఒక అబద్ధాన్ని నిజం చేయడం చాలా ఈజీ.. కానీ, ఒక నిజాన్ని నిజమని ప్రూవ్ చేయడం చాలా కష్టం. నా పేరు అర్జున్ లెనిన్ సురవరం.. జనాలకు నిజం చెప్పడం నా ప్రొఫెషన్. మీ అందరికీ టీ ఆర్పీ పిచ్చి పట్టింది.. న్యూస్ అమ్మడం కోసం మిమ్మల్ని మీరే అమ్ముకుంటున్నారు. ఎంత తెలివిగలవాడైనా కచ్చితంగా ఏదో ఒక పొరపాటు చేస్తాడు. వెతికేవాడు దొరకట్లేదు.. వెతకాల్సినవాడు తెలియట్లేదు... దీనికి సమాధానం ఒకే ఒక్కడు...’ వంటి డైలాగులు ‘అర్జున్ సురవరం’ చిత్రం టీజర్‌లో ఆకట్టుకుంటున్నాయి. నిఖిల్, లావణ్యా త్రిపాఠి జంటగా నటిస్తోన్న చిత్రం ‘అర్జున్ సురవరం’.
మూవీ డైనమిక్స్, ఆరా సినిమా ప్రైవేట్ లిమిటెడ్ సంయుక్తంగా టి.సంతోష్ దర్శకత్వంలో తెరకెక్కుతోంది. రాజ్‌కుమార్ ఆకెళ్ల, కావ్య వేణుగోపాల్ నిర్మాతలుగా వ్యవహరిస్తున్న ఈ చిత్రాన్ని బి.మధు (ఠాగూర్ మధు) సమర్పిస్తున్నారు. తమిళ్‌లో అథర్వ హీరోగా నటించిన ‘కణిథన్’ మూవీ ఆధారంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. మార్చి 29న ప్రపంచవ్యాప్తంగా ఈ చిత్రం విడుదల కానుంది. మహాశివరాత్రి సందర్భంగా ఈ చిత్రం టీజర్‌ను సోమవారం విడుదల చేసింది చిత్రబృందం. విడుదలైన 24 గంటల్లో 23 లక్షల వ్యూస్‌ను సొంతం చేసుకుంది ఈ టీజర్. టీజర్‌ను చూసిన ప్రేక్షకులే కాదు మెగాస్టార్ చిరంజీవి నుండి కూడా ప్రశంసలు రావటంతో చిత్రయూనిట్ ఆనందం వ్యక్తం చేసింది. నిఖిల్ జర్నలిస్ట్‌గా చేస్తున్న ఈ చిత్రం ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉంది.
Comments
Please login to add a commentAdd a comment