తల్లి అంజనా దేవిపై ఇష్టాన్ని మెగాస్టార్ చిరంజీవి పలు సందర్భాలలో వెల్లడించిన సంగతి తెలిసిందే. తల్లిని ఎంతో ప్రేమగా చూసుకునే చిరంజీవి.. బుధవారం ఆమె బర్త్‌డే సందర్భంగా సరదాగా గడిపారు. తల్లితో సెల్ఫీ దిగుతూ ఉత్సాహంగా కనిపించారు. అలాగే తల్లి చేత కేక్ కట్ చేయించారు. ఈ కార్యక్రమంలో చిరంజీవి, ఆయన భార్య సురేఖలతోపాటు ఇతర కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. ఇందుకు సంబంధించిన ఫొటోలను నిహారిక తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశారు. అలాగే నాయన్నమ్మకు బర్త్ డే విషెస్ చెప్పారు. ఈ ఫొటోల్లో సుష్మిత, నిహారికలు నాయన్నమ్మ అంజనా దేవితో చాలా హుషారుగా గడుపుతూ కనిపించారు.
మరోవైపు గతేడాది సైరా నరసింహారెడ్డి చిత్రంతో విజయాన్ని అందుకున్న చిరంజీవి.. ప్రస్తుతం కొరటాల శివ సినిమాతో బిజీగా ఉన్నారు. ఈ చిత్రాన్ని కొణిదెల ప్రొడక్షన్స్ కంపెనీ, మ్యాట్నీ ఎంటర్‌టైన్‌మెంట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. కాగా, ప్రతి ఏడాదిలాగే ఈసారి కూడా సంక్రాంతి పండగకు మెగాఫ్యామిలీ అంతా ఒకచోట చేరి సందడి చేసిన సంగతి తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment