
డిసెంబర్‌లో సెట్స్‌కి సైరా ‘ఒరేయ్... నేను వట్టి చేతులతో వచ్చా. నువ్వు భుజం మీద తుపాకీతో వచ్చావ్. అయినా.. నా చెయ్యి మీసం మీదకు వెళ్లే సరికి నీ బట్టలు తడిచిపోతున్నాయ్ రా’ – తన మీదకు తుపాకీ ఎక్కుపెట్టిన బ్రిటీష్ అధికారితో ఉయ్యాలవాడ నరసింహారెడ్డి చెప్పే డైలాగ్. చిరంజీవి హీరోగా సురేందర్‌రెడ్డి దర్శకత్వంలో కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ పతాకంపై చిరు సతీమణి సురేఖ సమర్పణలో, ఆయన తనయుడు రామ్‌చరణ్ నిర్మించనున్న సిన్మా ‘సైరా’.
అందులో చిరు డైలాగులు ఎంత పవర్‌ఫుల్‌గా ఉండబోతున్నాయనేది చెప్పడానికి పైన చెప్పిన డైలాగ్ ఓ ఉదాహరణ అంటున్నారు యూనిట్ సభ్యులు. ప్రస్తుతం సినిమా ప్రీ–ప్రొడక్షన్ వర్క్ చివరి దశలో ఉందట! పరుచూరి సోదరులు అందించిన కథకు మాటల రచయిత సాయిమాధవ్ బుర్రా అండ్ కో అద్భుతమైన డైలాగులు రాస్తున్నారట. త్వరలో బౌండ్ స్క్రిప్ట్ రెడీ కానుందని తెలుస్తోంది. డిసెంబర్ 6న షూటింగ్ ప్రారంభించాలనుకుంటున్నారట. నయనతార మెయిన్ హీరోయిన్‌గా, అమితాబ్ బచ్చన్, జగపతిబాబు, సుదీప్, విజయ్ సేతుపతి తదితరులు ముఖ్య పాత్రల్లో కనిపించనున్నారు.
Comments
Please login to add a commentAdd a comment