లవ్‌లో ఫెయిలయ్యా.. అందుకే ఇలా! | chit chat with ram | Sakshi
Sakshi News home page

లవ్‌లో ఫెయిలయ్యా.. అందుకే ఇలా!

Published Tue, Dec 29 2015 12:33 AM | Last Updated on Mon, Aug 20 2018 6:18 PM

లవ్‌లో  ఫెయిలయ్యా..  అందుకే ఇలా! - Sakshi

లవ్‌లో ఫెయిలయ్యా.. అందుకే ఇలా!

ప్రతిరోజూ పండగ చేస్కోవాలన్నంత హుషారుగా ఉంటాడు రామ్. అతని దగ్గర ఏ ప్రశ్న అడిగినా ఆన్సర్ ‘రెడీ’గా ఉంటుంది. చాలా స్పీడ్‌గా ‘స్టార్’ స్థాయికి ఎదిగిన రామ్ రానున్న జనవరి 1న ‘నేను... శైలజ’ అంటూ ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. ఈ సందర్భంగా రామ్‌తో ముచ్చట్లు...
 
  ‘నేను... శైలజ’ అంటున్నారు.. రియల్ లైఫ్‌లోనూ శైలజలు ఏమైనా ఉన్నారా?
 (నవ్వుతూ)... రియల్ లైఫ్‌లో ఎవరూ లేరండి. ప్రస్తుతం సింగిల్. హ్యాపీగా ఉన్నాను.  

  మరి లవ్‌లో ఫెయిలైనట్లు గడ్డం ఏంటి?
 ఫెయిలయ్యానండి. అందుకే ఇలా!

  అవునా.. ఇంతకీ ఎవరా అమ్మాయి?
 కీర్తి సురేశ్ అండి (నవ్వుతూ). ‘నేను శైలజ’లో నా సరసన నటించింది కదా. ఈ సినిమాలో తనతోనే నా లవ్ ఫెయిల్ అవుతుంది. అసలు విషయం అది. సెకండాఫ్‌లో ఈ ఫెయిల్యూర్ కహానీ టైమ్‌లో ఓ ఐదు నిమిషాల పాటు గడ్డంతో కనిపిస్తా.

  సినిమా పూర్తయినా గడ్డం ఉంచేశారేం? తదుపరి సినిమా గెటప్పా?
 అదేం లేదు. జస్ట్ బాగుందనిపించింది. గడ్డం తీయకపోవడానికి మరో కారణం.. బద్ధకం అనుకోవచ్చు (నవ్వేస్తూ).

  ‘నేను... శైలజ’ ముగింపు పాజిటివ్వేనా?
 తెలుగువాళ్ళం పాజిటివ్ ఎండింగ్‌నే కోరుకుంటాం. సో.. అదే ఉంటుంది.

  ఈ సినిమా మొత్తం డెరైక్టర్ మీద వదిలేశానని ఆడియో ఫంక్షన్‌లో చెప్పారు...?
 కిశోర్ ‘వన్ మ్యాన్ ఆర్మీ’. స్టోరీ-స్క్రీన్‌ప్లే-డైలాగ్స్ అన్నీ తనవే. క్లారిటీ ఉంది తనకు. అందుకని మొత్తం తన మీదే వదిలేశా. నేను స్ట్రెస్ తీసుకుని, రిహార్సల్ చేస్తా. అలా వద్దని, లొకేషన్‌లో అప్పటికప్పుడు డైలాగ్ చెప్పమన్నాడు. ఇప్పుడు  కిశోర్ నా ఫేవరెట్ పర్సన్.

  మాస్ మూవీ వదిలి లవ్‌స్టోరీ చేయడం?
 చేసిన సినిమాలే చేస్తున్నప్పుడు ఒకానొక దశలో అలసిపోతాం. చూసేవాళ్లూ అలానే అయిపోతారు. ఈ ఏడాది చేసిన ‘పండగ చేస్కో’, ‘శివమ్’కు ఇది భిన్నంగా ఉంటుంది. ‘పండగ చేస్కో’ రెగ్యులర్ ఫార్మట్ సినిమా అయినా అందరికీ నచ్చింది. బాగా కలెక్ట్ చేసింది. అంటే... రెగ్యులర్ సినిమాలను కూడా ప్రేక్షకులు ఇష్టపడుతున్నారు. కానీ, మధ్య మధ్య వెరైటీ సినిమాలు చేయాలి.  

  ‘శివమ్’ నెగిటివ్ రిజల్ట్‌కు కారణం?
 ఎవర్నీ నిందించలేను. ఎందుకంటే, కథ సెలక్ట్ చేసుకున్నది నేనేగా. ఆ మాటకొస్తే నా ఫ్లాప్‌ల బాధ్యతను నేనే తీసుకుంటా.

  ఆ సినిమా రిజల్ట్‌ని దృష్టిలో పెట్టుకుని ‘నేను... శైలజ’లో మార్పులు చేశారా?
 ఆ సినిమా విడుదలయ్యే నాటికే ‘నేను... శైలజ’ 90 శాతం పూర్తయింది. అయినా, ఈ కథలో మార్పులు చేయడానికి ఏమీ లేదు. బేసిక్‌గా నిర్మాతలు, పంపిణీదారులు రొటీన్ సినిమాలనే ఇష్టపడతారు. దానికి కారణం ఏమాత్రం పాజిటివ్ టాక్ వచ్చినా ఆడతాయి. అదే కాన్సెప్ట్ సినిమా మంచి టాక్ వచ్చినా ఆడదు. అందుకే అలాంటి సినిమాలు నిర్మించడానికి నిర్మాతలు పెద్దగా ఇష్టపడరు. టాక్ మిగులుతుంది. సేఫ్టీ కోసం రొటీన్ సినిమాలు చేయాలనుకుంటారు. ఇప్పుడు నా దగ్గరకు 70 కథలు వచ్చాయనుకోండి. అందులో 5 కొంచెం డిఫరెంట్‌గా ఉంటాయి. వాటిలో ఒకటి ఎంచుకుంటున్నా.

  మరి... ‘నేను.. శైలజ’ మీకు కొత్త తరహా ఫిల్మ్ కాబట్టి.. ఏమైనా టెన్షన్ అనిపించిందా?
 టెన్షన్ కాదు కానీ, కన్‌ఫ్యూజ్ అయ్యాను. నా గత చిత్రాలంత ఎనర్జీ అవసరంలేదు. కాస్త డోస్ తగ్గించాలి. డ్యాన్స్ చేసేటప్పుడు నేను రెచ్చిపోతుంటా. ఇక్కడేమో ‘అంతొద్తు.. కాస్త తగ్గిస్తే బెటర్’ అన్నారు. అందుకని, మనం చేస్తున్నది కరెక్టేనా? కాదా? అనిపించింది. కానీ, కొన్ని రోజులు గడిచాక... శాటిస్‌ఫేక్షన్ అనిపించింది. నటుడిగా నాకు కొత్తగా అనిపించింది.

  మీ సినిమాల విషయంలో బెస్ట్ క్రిటిక్?
 నాకు నేనే పెద్ద క్రిటిక్‌ని. నా అంత దారుణంగా నన్ను తిట్టేవాళ్లు ఉండరు. నాకు ఒక పట్టాన ఏదీ నచ్చదు. త్వరగా ఇంప్రెస్ కాను.

  మీరు, మీ పెదనాన్న (‘స్రవంతి రవికిశోర్) డెరైక్షన్‌లో జోక్యం చేసుకుంటారని టాక్?
 కథా చర్చలప్పుడు వంద శాతం మా ఇన్‌వాల్వ్‌మెంట్ ఉంటుంది. ఒక్కసారి కథను ఫైనలైజ్ చేశాక జోక్యం ఉండదు. కొత్త దర్శకులనుకోండి.. వాళ్లకి షెడ్యూల్ ప్లానింగ్ విషయంలో ఏమైనా కన్‌ఫ్యూజన్ ఉండే అవకాశం ఉంటుంది. అందుకని ఆ ప్లానింగ్ విషయంలో పెదనాన్నగారు ఇన్‌వాల్వ్ అవుతారే తప్ప డెరైక్షన్‌లో మా జోక్యం ఉండదు.

   మళ్లీ వైవీయస్‌తో, శ్రీను వైట్లతో సినిమా చేయనున్నారనీ, సంతోష్ శ్రీనివాస్‌తో సినిమా ఉందనీ వినిపిస్తోంది?
 సంతోష్ శ్రీనివాస్‌తో సినిమా చర్చల దశలో ఉంది. వైవీయస్, శ్రీను వైట్లతో సినిమాల గురించి ఇంకా డిస్కషన్స్ జరగలేదు.

  న్యూ ఇయర్ ఎలా సెలబ్రేట్ చేస్తారు?
 ఈ 2015 జనవరికి ఫారిన్ వెళ్లాను. ఈసారి కూడా వెళ్లాలనుకున్నా. కానీ, ‘నేను.. శైలజ’ రిలీజ్ ఉంది కాబట్టి సినిమా ప్రమోషన్సే సెలబ్రేషన్స్. అయినా కొత్త సంవత్సరం సందర్భంగా పార్టీయింగ్ చేయడం నాకు ఎప్పుడూ అలవాటు లేదు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement