రానా సమర్పించు ‘కేరాఫ్ కంచరపాలెం’ | COKancharapalem Selected For New York Indian Film Festival | Sakshi
Sakshi News home page

Published Tue, Apr 3 2018 11:15 AM | Last Updated on Sun, Jul 14 2019 1:04 PM

COKancharapalem Selected For New York Indian Film Festival - Sakshi

సురేష్‌ ప్రొడక్షన్స్‌ బ్యానర్‌తో కలిసి రానా సమర్పిస్తున్న ‘కేరాఫ్ కంచరపాలెం’ సినిమా పోస్టర్స్‌

విలక్షణ పాత్రలతో నటుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్న తెలుగు హీరో రానా దగ్గుబాటి. స్టార్ వారసుడిగా ఎంట్రీ ఇచ్చినా.. ఇమేజ్‌ చట్రంలో ఇరుక్కుపోకుండా విభిన్న పాత్రలు చేస్తూ ఆకట్టుకుంటున్నాడు ఈ యంగ్ హీరో. అంతేకాదు నిర్మాతగానూ తన మార్క్‌ చూపించేందుకు రెడీ అవుతున్నాడు. న్యూయార్క్‌ కు చెందిన పరుచూరి ప్రవీణ నిర్మించిన ‘కేరాఫ్‌ కంచరపాలెం’ సినిమాను సురేష్‌ ప్రొడక్షన్స్‌ బ్యానర్‌తో కలిసి సమర్పిస్తున్నారు.

చాలా ఏళ్లు సినీ రంగంలోకి అడుగుపెట్టాలని ఎదురుచూస్తున్న ప్రవీణ.. అపర్ణ మల్లాది సహాయంతో వెంకట్‌ మహా దర్శకత్వంలో ఈ సినిమాను తెరకెక్కించారు. ఇటీవల హైదరాబాద్‌లో వేసిన స్పెషల్ షోలో కేరాఫ్ కంచరపాలెం సినిమాను చూసిన నిర్మాణ సురేష్‌ బాబు, హీరో రానాలు చిత్రంలో భాగస్వాములయ్యేందుకు అంగీకరించారు. కేన్స్‌లో ప్రదర్శించాలన్న ఆశయంతో తెరకెక్కించిన ఈ అచ్చ తెలుగు సినిమా న్యూయార్క్‌ ఇండియన్‌ ఫిలిం ఫెస్టివల్ లో ప్రదర్శించేందుకు అర్హత సాధించిన తొలి సినిమాగా రికార్డ్‌ సృష్టించింది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement