
కామెడీ లవ్‌స్టోరీ
ప్రేమకథ నేపథ్యంలో సాగే రొమాంటి క్ ఎంటర్‌టైనర్ ‘రొమాన్స్ విత్ ఫైనాన్స్’. కామెడీ ఎంటెర్‌టైనర్ ఉపశీర్షిక. సతీష్ బాబు, మెరీనా జంటగా జనార్ధన్ మందుముల నిర్మిస్తున్న ఈ చిత్రానికి రాజు కుంపట్ల దర్శకుడు. ఈ చిత్రం ఆడియో సీడీని తెలంగాణ శాసన మండలి చైర్మన్ స్వామిగౌడ్, ట్రైలర్‌ను దర్శకుడు వీవీ వినాయక్ ఆవిష్కరించారు. ఔత్సాహిక సినీ కళాకారుల కోసం తక్కువ వడ్డీకే రుణాలు ఇచ్చే ఆలోచనలో ప్రభుత్వం ఉందని స్వామి గౌడ్ తెలిపారు.