ప్రేమలో స్వార్థం | Romance With Finance Movie Press Meet | Sakshi
Sakshi News home page

ప్రేమలో స్వార్థం

Published Thu, Nov 20 2014 10:31 PM | Last Updated on Sat, Sep 2 2017 4:49 PM

ప్రేమలో స్వార్థం

ప్రేమలో స్వార్థం

అన్ని ప్రేమలూ ఒకలా ఉండవ్. ప్రేమ ముసుగులో ఆర్థిక ప్రయోజనాలు పొందాలనుకునేవారు కూడా ఉంటారు. ఈ నేపథ్యంలో  రాజు కుంపట్ల దర్శకత్వంలో జనార్దన్ మందుముల నిర్మిస్తున్న చిత్రం ‘రొమాన్స్ విత్ ఫైనాన్స్’. సతీష్, మెరీనా నాయకా నాయికలు. ఈ చిత్రం ఫస్ట్ లుక్‌ను నిర్మాత గొట్టిముక్కల పద్మారావు ఇటీవల హైదరాబాద్‌లో ఆవిష్కరించారు. దర్శకుడు మాట్లాడుతూ -‘‘ప్రేమ ముసుగులో స్వార్థం అనేది ఈ చిత్రం ప్రధానాంశం. జాన్ స్వరపరచిన పాటలు, మురళి ఛాయాగ్రహణం ఈ చిత్రానికి ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి’’ అని చెప్పారు. నిర్మాత మాట్లాడుతూ - ‘‘టైటిల్ వినగానే.. ఇది బూతు చిత్రం అనుకునే అవకాశం ఉంది. కానీ, వినోద ప్రధానంగా సాగే ఆహ్లాదకర చిత్రం ఇది. త్వరలో పాటలను విడుదల చేస్తాం’’ అని తెలిపారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement